డైలీ సీరియల్

విలువల లోగిలి-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే సామ, దాన, దండోపాయాలు ఒకదాని తర్వాతఒకటి కాకుండా అన్నీ ఒకేసారి ప్రయోగించేస్తున్నాను. ఆయన్ని రప్పించటం కూడా ఇందులో భాగమే. ఒకవేళ నేనున్నానని, నేను చూస్తున్నానని ఇలా ప్రేమ ఒలకపోస్తుంటే కుదరదుగా. ఎప్పటికీ నిన్ను ప్రేమగా చూసుకోవాలి.’’
‘‘అందరికీ నీలాంటి స్నేహితురాలు, సి.ఐలు దొరుకుతారా?’’
‘కచ్చితంగా దొరకరు. ఇలా ఇబ్బందిపడుతున్న ఆడపిల్లలకు ఆ ఊరి ఎస్.ఐ.లే అన్నయ్యల్లా రక్షణ కల్పించాలి. అప్పుడే ఇలాంటివారికి బుద్ధి వస్తుంది. సమాజంలో ఒక్కరే మార్పుకోసం ప్రయత్నిస్తే అది జరగదు. ప్రతి వ్యక్తీ వృత్తిపరంగాగానీ, వ్యాపారపరంగా గానీ, నైతిక బాధ్యతగా గానీ, సంస్కారపరంగా గానీ ఆలోచించి సహాయం చెయ్యాలనుకుంటేనే ఇలాంటివారిలో మార్పు తీసుకురాగలం. పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కాదు. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే రూపుమాపాలి. ఆ విషయంలో చుట్టుప్రక్కల అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అందుకే ఎప్పుడూ ‘నేను’ అనుకోకూడదు ‘మనం’అనుకోవాలి అంటుంటాను నేను.
‘‘ఇదంతా చందూకి చెప్పావా?’’
‘‘ఆ రాత్రే చెప్పేసాను. వెల్‌డన్ అన్నాడు.’’
‘‘చందూని మెచ్చుకోవాలి. క్రొత్త భార్యను ఎవ్వరూ ఇలా సంస్కరణలకు పంపరు. పుట్టింటికి కూడా పంపకుండా తనదగ్గిరే ఉంచేసుకోవాలనుకుంటారు.’’
‘‘చందూకి తెలుసు విశ్వ ఎప్పుడూ ఒకటికాదు. పదిమంది తనచుట్టూ ఉంటారని. వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుందని’’.
‘‘అప్పుడే మీ ఇద్దరిలో అంత అవగాహన వచ్చేసిందా?’’
‘‘ఆఁ! అన్నం ఉడికిందా అని చూడటానికి ఒక్క మెతుకే చూస్తాం. అన్నం అంతా కాదుగా. అలాగే ఇదికూడా.’’
‘‘నీ భావాలు చూసి చిన్నప్పటినుంచీ అనుకునే దాన్ని. నీకెలాంటి భర్త వస్తాడోనని, నువ్వేమయిపోతావోనని. అలాంటిది ఇప్పుడు నువ్వే నా కాపురాన్ని చక్కదిద్దుతున్నావు.’’
‘‘పదేపదే అనకు ఆ మాటను’’అని విశ్వ అంటూ ఉండగానే గుమ్మం ముందు పోలీసు జీపు ఆగింది. అందులోంచి ‘చక్రధర్’దిగాడు.
‘‘రాబాబాయ్!’’అంటూ విశ్వ ఎదురువెళ్ళి ఆయన్ని ఇంట్లోకి ఆహ్వానించింది.
విశ్వ అత్తగారిని పిలిచి పరిచయం చేసింది.
శాంతి లోపలికి వెళ్ళి ‘టీ’చేసి తీసుకువచ్చింది.
‘‘బాబాయ్! టీ తీసుకోండి. అన్నట్లు మీరు వెళ్ళిన పని ఏమయింది?’’
అత్త, మామ, మరిది, ఆడపడుచు, మొగుడు, ఆడపడుచు మొగుడ్ని మొత్తం అందరినీ ‘గృహహింస’ చట్టంక్రింద బుక్‌చేసేసాను. ఇంక ఏడేళ్ళు వాళ్ళు జైలుజీవితం గడపాల్సిందే. అయినా ఈ ఆడపిల్లలను అనాలమ్మా. ఎంత హింసనయినా భరిస్తాను కానీ నోరువిప్పి విషయం చెప్పరు.
‘‘అది పెద్దలంటే గౌరవం’’అంది విశ్వ వినయంగా.
‘‘ఇలాంటివాళ్ళు పెద్దమనుషులా? కట్నాలు ఇవ్వద్దమ్మా అంటే ఇస్తారు. పోనీ తీసుకున్నాకన్నా బాగా చూస్తారా అంటే ఇంకాఇంకా కట్నంతెమ్మని సతాయింపు. దానికి అంతు ఎక్కడ ఉంది? ఆశ ఇంకాఇంకా కట్నంతెమ్మని సతాయింపు. దానికి అంతు ఎక్కడ ఉంది? ఆశ ఇంకాఇంకా తేవాలనే. ఆడపిల్ల తల్లిదండ్రులకు డబ్బులేమన్నా చెట్టుకు కాస్తున్నాయా చెప్పు? రేపు వీళ్ళ పిల్లనూ అలాతెమ్మని అవతలివారు చెబితే అప్పుడు తెలుస్తుంది బాధ. ఏమంటారు మీరు?’’అంటూ లీలావతి వైపు చూసాడాయన.
ఆవిడకు అప్పటికే కాళ్ళు వణికిపోతున్నాయి.
‘‘అవునండీ’’అంది ఎలాగో నోరు పెగల్చుకుని.
టీ కప్పును టీపాయ్ మీద పెడుతూ ‘‘సరే! విశ్వా! నేను అర్జంట్‌గా ప్రక్క ఊర్లో మరో కేసుకి అటెండ్ అవ్వాలి. నువ్వు పిలిచావని, నిన్ను చూడాలనిపించి వచ్చా. నీకుగానీ, నీ వాళ్ళెవరికైనా ఏ సహాయం కావాలన్నా ఒక ఫోనుకొట్టు చాలు. వాలిపోతా. మరి ఉండనా’’ అంటూనే అందరికీ వెళ్ళొస్తాననిచెప్పి వెళ్ళిపోయాడు.
అసలే పోలీసువ్యాను వచ్చింది. ఏమిటి విషయం అని తొంగితొంగి చూస్తున్న ప్రక్కిళ్ళవాళ్ళు గబుక్కున లోపలికి వెళ్ళిపోయారు. ఆయన బయటకు రావటం చూసి.
ఆయన జీపు ఎక్కగానే అది కదిలివెళ్ళిపోయింది.
వాన వచ్చి వెలిసినట్లయింది లీలావతికి.
శాంతి నోరువిప్పితే తమ పరిస్థితీ అంతేగదా అనే భయమో మరేమైనాగానీ శాంతిని ఇంటి బిడ్డలా చూసుకోవాలని మాత్రం ఆ క్షణంలో నిశ్చయించేసుకుంది ఆవిడ.
ఆవిడ ఉద్దేశాన్ని సులభంగానే గ్రహించేసింది విశ్వ. ఆవిడను లోపలికి వెళ్ళనిచ్చి చిన్నగా నవ్వుకున్నారిద్దరూ.
వేణుగోపాల్ మాటఇచ్చిన ప్రకారం ఇంటిల్లిపాదినీ సినిమాకి తీసుకువెళ్ళాడు. ఇంటర్వెల్‌లో ‘సినిమా ఎలా ఉందండీ’అని అడిగాడు విశ్వను.
‘బాగుందండీ ఇప్పటివరకు. ముగింపు ఎలా చూపిస్తాడో చూడాలి. అప్పుడుకదా ఎలా ఉందో చెప్పగలిగేది. అయినా భార్యాభర్తలు హక్కులుకోసం పోరాడటం మానేసి స్నేహితుల్లా ఉంటే ఇలా ‘‘నువ్వా? నేనా?’’అనే సినిమాలు రావుకదండీ’’అంది నవ్వుతూ.
‘‘బాగా చెప్పారు. ఇదివరకు ‘అత్తా-కోడలూ’అనే సినిమా వచ్చింది. ఇప్పుడు నువ్వా? నేనా?’’అన్నాడు అతను తనూ నవ్వుతూ.
కొడుకు, భర్తగా అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతాడు. మగవాడని అందరూ అంటారు. అందుకే ఆ సినిమా వచ్చింది. నిజం చెప్పాలంటే అమ్మను గౌరవించాలి, భార్యను ప్రేమించాలి. తక్కెడలో ఏవైపూ ఒరగకూడదు. ఎవరినీ తక్కువ చేయకూడదు. న్యాయం ఎటువైపుఉంటే అటే మాట్లాడాలి. ఎవరినీ కించపరచకూడదు. అలా ఉంటే సమస్యలు ఎందుకొస్తాయి చెప్పండి?
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206