డైలీ సీరియల్

విలువల లోగిలి 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకపోతే కలిసి గడిపిన సంతోషపు జ్ఞాపకాల పూత పూసి ఈ బాధను మాపుకోవాలి’’
‘‘అదంత తేలిక కాదు’’ మరింత దిగులుగా ముఖం పెట్టి అంది శాంతి.
‘‘తేలికని నేను అన్నానా?’’
‘‘మరెలా విశ్వా?’’
‘‘చిన్న పిల్లలా ఇలా మారాం చేస్తే నేనేం చెయ్యాలి? పోనీ చందూని వదిలి నీ దగ్గిర ఉండిపోనా?’’
నిజంగా అలా ఉండిపోతే ఎంత బాగుంటుంది? కానీ నేనంత స్వార్థపరురాలిని కాదు. వెళ్లిపోదువుగానీలే. నీ జ్ఞాపకాల అనుభూతిని పదిలంగా దాచుకుంటాను’’.
‘‘అదీ ఇలాగ నన్ను పంపిస్తే నాకు సంతోషం’’’
వేణుగోపాల్ వచ్చి మూడు గంటలకు బస్సు ఉందని చెప్పటంతో గబగబా రెడీ అయింది విశ్వ.
చకచకా భోజనాల కార్యక్రమం ముగించారు.
‘‘విశ్వక్కా! నా జ్ఞాపకంగా ఇది నీదగ్గరుండాలి’’ అంటూ ఊలుతో అల్లిన షాల్‌ను విశ్వ చేతికి అందించింది సుందరి.
లేత గులాబీ రంగులో ఎంతో అందంగా ఉన్నదాన్ని అందుకుంటూ ‘‘్థంక్స్ సుందరీ. దీన్ని జాగ్రత్తగా వాడుకుంటాను. ఈ షాల్‌ని చూడగానే దీని అందమే కనిపిస్తుంది కానీ తాకితే దీనిలో వున్న మృదుత్వం తెలుస్తుంది. అలాగే నీ ప్రవర్తన కూడా అలా మృదువుగా ఉండాలని నా కోరిక’’.
‘‘తప్పకుండా! ఈసారి వచ్చినపుడు నాలో ఆ మార్పు నువ్వు తప్పక గమనిస్తావు’’.
‘‘శాంతీ! విశ్వకి బొట్టు పెట్టి ఇవ్వు’’ అంటూ లీలావతిగారు ఒక ప్లేటులో చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ పొట్లాలు, పువ్వులు, గాజులు పెట్టిన ప్లేటును అందించారు.
‘‘ఇప్పుడివన్నీ అవసరమా? వద్దండీ’’ అంది విశ్వ మొహమాటంగా.
‘‘నువ్విచ్చినవన్నీ మేము తీసుకోలేదా. ఏదో మా తృప్తికోసం కాదనకు’’ అంది లీలావతి.
ఇక బాగోదని ఊరుకుంది.
శాంత బొట్టుపెట్టి అందించింది.
దాన్ని అందుకుని లీలావతిగారికి, విశ్వనాధంగారికి నమస్కరించింది. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.
ఫణి వెళ్లి ఆటో తీసుకువచ్చాడు.
వేణుగోపాల్, శాంత బస్టాండు దాకా వెళ్లి వస్తామని విశ్వతో బయలుదేరారు. మిగతా అందరూ గేటు దాకావచ్చి వీడ్కోలు పలికారు.
అందరి కళ్లలో విషాదపు ఛాయలు అలుముకున్నాయి.
వెనె్నల వచ్చి వెళ్లిపోయినట్లనిపించింది అందరికీ.
ఇల్లంతా ఒక్కసారి బోసిపోయినట్లయ్యింది. ఒక్కరే తగ్గినా ఆ వెలితి పూడ్చలేనిదనిపిస్తుంది ఆ క్షణంలో.
ఓ పావుగంట ఆలస్యంగా వచ్చిన బస్సును చూసి శాంతి ఇంకో అరగంట లేట్‌గా రావచ్చుగా అనుకుంది మనసులో.
మరి కాసేపు విశ్వతో ఉండొచ్చని ఆశ.
దూరంనుంచీ బస్సును చూసి పరుగెత్తుకొచ్చి లగేజీ తీసుకోబోతున్న విశ్వను వారించి తను తీసుకుని వెళ్లి పైన పెట్టి ఖాళీగా వున్న ఓ సీటులో కూర్చున్నాడు. శాంతికి వీడ్కోలు ఇచ్చి విశ్వ బస్సులోపలికి వచ్చింది. వేణుగోపాల్ తను లేచి ఆమెను కూర్చోమన్నాడు.
‘‘చాలా థాంక్సండీ’’ అంది విశ్వ.
‘‘భలేవారే మేడమ్. ఇది మా బాధ్యత’’ అన్నాడు నవ్వేస్తూ.
‘‘శాంత జాగర్తండీ’’ అంది చెప్పకుండా ఉండలేక.
‘‘మీరే చూస్తారుగా. మీరు చెప్పిన సూత్రం పాటిస్తా. తర్వాత మీ ఫ్రెండ్ మీకు చెబుతుందగా’’
‘‘ఊ!’’ అన్నట్లు తల వూపింది.
శాంతి బస్సు ప్రక్కగా వచ్చి నిలబడింది.
తన చేతిని వదలలేనన్నట్లు గట్టిగా పట్టుకున్న శాంతినే చూస్తోంది విశ్వ.
‘‘్ధర్యంగా ఉండు శాంతీ. నీకు నేనున్నానుగా. ఏ చిన్న సమస్య వచ్చినా నీకు నేనున్నానని గుర్తుపెట్టుకో. ఎంత దూరంలో వున్నా పక్షిలా నీ చెంత చేరుతాను. సరేనా?’’ అంది ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ.
డ్రైవరు వచ్చి తన సీటులో కూర్చుని హారన్ మ్రోగించాడు. క్రిందకు ఎవరైనా దిగి ఉంటే ఎక్కుతారని అతని ఉద్దేశంకావచ్చు. బస్సు బయలుదేరటంతో వదలలేక వదలలేక వదిలింది విశ్వ చేతిని.
అప్పుడు ఆమె వెనుకగా వున్న వేణుగోపాల్‌కి టాటా చెప్పింది విశ్వ. అలా ఆ నాలుగు చేతులకు ఈ రెండు చేతులను రోడ్డు దూరం చేసింది. ఆ ఆలోచనే శాంతికి చేదుగా ఉంది.
నెచ్చెలి, ప్రియనేస్తం, నాలుగు రోజులుగా తోడునీడగా ఉండి ఒక్కసారి దూరమవ్వడంతో ఆమెను నిస్సత్తువ ఆవరించింది.
ఒకసారి తూలి పడబోయింది. ప్రక్కనే వున్న వేణుగోపాల్ ఆమెను పట్టుకున్నాడు. లేకపోతే నేలకు జారిపోయేదే.
అక్కడే వున్న బెంచీమీద శాంతిని కూర్చోబెట్టి కొబ్బరి బోండాం తీసుకుని వచ్చి తాగించాడు.
కాస్త తెప్పరిల్లాక బయటకు వచ్చి స్కూటర్ ఎక్కారు. ఇంటికి ఎలా వచ్చిందో ఆమెకు తెలియదు.
అత్తగారు ఏమనుకుంటుందో, ఆడబడుచు ఏమంటుందో అనే ఆలోచన లేనే లేదు. వెళ్లటం వెళ్లటం మంచంమీద వాలిపోయింది.
ఆగని కన్నీరుని తుడుచుకునే ఓపిక లేనట్లు వదిలేసింది. మెలకువ వచ్చేటప్పటికి చీకట్లు ముసురుకున్నాయి.
‘‘అయ్యో! ఇలా నిద్రపోయానేమిటి?’’ అనుకుంది. అలసటగా సహకరించనంటున్న శరీరాన్ని బుజ్జగించి లేపింది. వంటింట్లో టిఫిను చేసే కార్యక్రమంలో ఉంది లీలావతి.
‘‘తెలియకుండానే నిద్రపట్టేసింది అత్తయ్యా!’’ అంది వెనుకనుంచీ బెరుగ్గా శాంతి.
‘‘ఫరవాలేదులే. బజ్జీలు వేడిగా ఉన్నాయి.. తిను’’ అంది ప్లేటులో పెడుతూ.
ఈసారి ఆశ్చర్యపోవడం శాంతి వంతయింది.
ఏమిటి అత్తయ్యేనా ఇలా మాట్లాడుతోంది.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ