డైలీ సీరియల్

విలువల లోగిలి-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదంతా నా గొప్పకాదు ‘కమలారామన్’గారిది అని నువ్వు తోసి పారేస్తావని నాకు తెలుసు. కానీ వాళ్ళతో ఆ పని చేయించింది నువ్వే కాబట్టి ఆ క్రెడిట్ నీకుకూడా దక్కుతుంది. ఇప్పుడంతా స్నేహంగా మసలుతున్నారు. కోడళ్ళందరూ నీవల్ల స్వేచ్ఛవచ్చింది. ఇప్పుడు మేము బందీలం కాదు. పక్షులం. అలాగని ఎగరలేం కానీ ఎప్పుడు కావాలన్నా అప్పుడు బయటకురావచ్చు. మాట్లాడుకోవచ్చు కూడా.
నా జీవితాన్ని ఇలా వెనె్నలబాట చేసినందుకు నేనేమివ్వను? ముందుగా నిన్ను నా దగ్గరకు పంపినందుకు విశ్వకు, అమ్మకు కృతజ్ఞతలు చెప్పాలి.
అమ్మ నిన్ను ఎప్పుడూ ఒంటరిగా పంపదని తెలుసు. ఆరోజు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా అమ్మదగ్గిరే కూర్చుని ఎంత కంగారు పడిందో నట. అలాంటిది నాకోసం నిన్ను పంపటానికి ఒప్పుకుందిగా. ఇక చందూమాత్రం తక్కువ తినలేదు. తనదగ్గిరే ఉండాలనుకోకుండా నిన్ను నా దగ్గిరకు పంపాడుగా. అందుకని తనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పానని చెప్పు.
మరి నీకో...మాటలు చాలటం లేదు. నా మనసే నీకు శిరస్సు వంచి ప్రణమిల్లుతోంది.
స్నేహంలో ఇదంతా కావాలా అని నువ్వంటావని తెలుసు. అయినా చెప్పకుండా ఉండలేను.
ఈ జీవితం నీవుపెట్టిన ప్రేమ భిక్షే!
ఉంటానే నీ శాంతి

ఓ సత్ గ్రంథం మనుషుల్లో మంచి మార్పును తప్పక తీసుకు వస్తుంది అని ‘సత్సంగం’లో చెప్పినమాట నిజమయ్యింది. దానికి ప్రేమ జతచేస్తే పెనుమార్పులు తప్పవని తన విషయంలో రూఢి అయింది. చాలా తృప్తిగా ఉంది అనుకుంది మనసులో.
ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి చందూ చేతిలో పెట్టింది విశ్వ.
అంతా చదివి ఉత్తరాన్ని ఆమె చేతిలో పెడుతూ
‘‘ఇది అమ్మ, నేనూ ముందుగా ఊహించిందే. అందుకే నిన్ను పంపాం. కానీ మేమిద్దరం ఎంత భయపడ్డామో నీకు తెలియదు. వాళ్ళ భీకర మనస్తత్వాలతో నిన్ను ఇబ్బంది పెడతారేమో. మాటలు ఈటెలతో నిన్ను బాధిస్తారేమో..
ఇలా ఎన్నో ఊహలు. ముఖ్యంగా ఆ ఫణి. అలాంటి వాడి దగ్గరకు నిన్ను అనవసరంగా పంపానేమోనని. నిజం చెప్పాలంటే నువ్వు నా చెంత చేరేవరకూ నేను మనిషి మనిషిలా లేనంటే నమ్మాల్సిందే.’’
‘‘నాకు తెలుసు’’అన్నట్లు అతన్నిదగ్గరకు తీసుకుంది.
ఆ పరిష్వంగంలో ఒదిగిపోయాడు అతను.
తండ్రి ప్రేమ అంటే ఏమిటో తెలియని విశ్వకి ఆరోజు చందూలో ఆ మమకారాన్ని చూడగలిగింది.
కళ్ళలో తడి కాటుక రేఖలా పరుచుకుంది. ఒక్క చందూలో లేని తన కుటుంబ సభ్యులందరినీ చూసుకోవచ్చు అనుకుంది విశ్వ.
***
‘‘విశ్వా! విశ్వా!’’ అంటూ పది మంది బిలబిలా ఇంట్లోకి వచ్చేసారు.
‘‘ఓ! మీరా! రండి! రండి!’’ అంటూ లోపలికి పిలిచింది.
‘‘ఏమిటి? పెళ్ళిచేసుకున్నావట. పార్టీ లేదు. ఏమీ లేదు.’’
‘‘మీకంతా తెలుసుగా. అనవసరమైన వాటికి నేను ఖర్చులు పెట్టనని. మిమ్మల్నీ పెట్టనివ్వనని.’’
‘‘అదంతా లేదు కాబట్టి అనుకునే వాళ్ళం నిన్ను చూసి, ఇంత డబ్బు వచ్చినా నువ్వదేమాట మీద ఉన్నావంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది తెలుసా?’’
‘‘మనస్తత్వాలు అనేవి డబ్బును బట్టి మారుతాయని మీరు ఎలా ఊహించారోనాకు అర్థం కావటం లేదు.’’
‘‘అర్థం కావటం లేదని బుర్రలు బ్రద్దలుకొట్టుకోవల్సింది మేము. నువ్వు కాదు.’’
‘‘సరే ఇంతకీ ఏం పని మీద ఊడిపడ్డారు?’’
ఇదివరకు వరదలు వచ్చినప్పుడు ఊరందరి దగ్గరా బట్టలు సేకరిస్తుంటే తను కూడా వాళ్ళతో కలిసి పనిచేసింది. స్వచ్ఛందంగా బరిలోకి దిగానని తనను వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. అలాంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నా ముందుగా తనకు చెప్పేసి తన సహకారం తీసుకుంటారు. అందుకే అడిగింది అలాంటిది ఏమన్నా ఉందేమోనని.
‘‘లేదే! నిన్ను చూద్దామనే వచ్చాం! మళ్ళీ ఎప్పుడు కలుస్తావో ఏమోనని. అదీ కాకుండా విషయం దాచిపెట్టావని నిన్ను తిట్టడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకొని వచ్చాం.’’
‘‘అదా!’’ అంది తేలికగా తీసుకుని నవ్వేస్తూ.
‘‘ఇప్పుడయితే మాకు పార్టీ లాంటిది ఏం లేదా?’’ ఉండదని తెలిసినా అడిగింది.
‘‘అమ్మ వేడివేడిగా పకోడీలు వేస్తోంది. ఇప్పటికి అవి తినండి. దానితోపాటూ నిమ్మరసం కూడా బోనస్‌గా’’ అంది మరోమాట మాట్లాడనివ్వకుండా.
‘‘ఇదింతేనే. ఏదో దక్కిందే దక్కుడని సరిపెట్టుకుందాం’’ అని తేల్చేసారు చివరకు.
విశ్వ దగ్గిర తమ పప్పులు ఉడకవని వారికి ముందే తెలుసు.
పకోడీలు అన్నీ ఒక గినె్నలో వేసుకుని వచ్చి వారిముందు పెట్టింది తీసుకోమన్నట్లు.
ఇక పకోడీలులో కబుర్లు అద్దుకుని తినేసారు అందరూ. ఈలోపు నిమ్మరం తయారుచేసింది.
‘‘మాకు టైమయిపోతోంది వెళతాం’’ అంటూ వెళ్ళిపోయారు అనుకోకుండా గాలివాన వచ్చి వెలిసినట్లయింది విశ్వకు.
ఇలాంటి వారితో కలిసి పనిచేసినా వారి స్వభావాలు నచ్చవు ఆమెకు.
పైన ఒక మాట. లోపల ఒక మాట. చాలామందిది అదే తీరు. అలా అబద్ధపు బురఖావేసుకునే వారంటే తనకు పడదు.
కాకపోతే వారు చేసేది మంచి కోసమే కాబట్టి వారితో సహకరిస్తుంది.
అదీ కాకుండా అవి చేరవలిసిన చోటుకి క్షేమంగా చేర్చేవరకూ నిద్రపోదు.
మధ్యమధ్యలో ఈ చీర బాగుందే, ఈ షర్టు బాగుందే అంటూ అసలు ఆపదలో ఉన్న వారికి చేరనీయకుండా ఈ నొక్కేసే వాళ్ళే ఎక్కువ.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206