డైలీ సీరియల్

విలువల లోగిలి-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ఆయన బలం తగ్గిపోయింది.
ఆఫీసు విషయాలన్నీ అనిరుధ్ సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఆయన ఏ సంగతీ చూసుకోవాల్సిన శ్రమలేకుండా చేస్తున్నాడు. వాడికి బాధ్యత అప్పజెప్పేప్పుడు తను భయపడ్డాడు. చిన్నవాడు.. అంత పెద్ద బాధ్యత నిర్వర్తించగలడా అని. అమ్మే భరోసాగా నిలబడింది. నేనూ, నాన్నగారూ ఉన్నాంగా. ఏం ఫర్వాలేదు అని ధైర్యం చెప్పింది. నచ్చిన అమ్మాయిని వదులుకోకు అని తన ప్రేమను నిలబెట్టటానికి కావాల్సిన ప్రోత్సాహాన్నిచ్చింది. ఎంతైనా అమ్మ ఆల్ ఇన్ వన్. అందుకే ఆమె అంటే తనకు చచ్చేంత ఇష్టం.
ఆలోచనలలో కొట్టుకుపోతున్న సూర్యచంద్రకు ‘‘ఏరా! నాన్నా! ఎలా ఉన్నావ్?’’ అన్న పిలుపుకు లాప్‌టాప్ వైపుకు తిరిగాడు.
‘‘బాగున్నానమ్మా!’’ అన్నాడు.
‘‘ఆఫీసు ఎలా ఉందిరా?’’ అడిగాడు నరేంద్రనాథ్.
‘‘బ్రాంచే కాబట్టి బాగానే మేనేజ్ అయిపోతున్నాను’’.
‘‘వెరీగుడ్. కీప్‌ఇట్ అప్. నేనూ నీ ప్రోగ్రెస్‌ను గమనిస్తున్నాను’’.
‘‘కోడలు ఏదిరా?’’అమృత అడిగింది.
‘‘అమ్మా! నీకు పక్షపాతం ఎక్కువైపోయింది. నాతోకంటే విశ్వతోనే ఎక్కువ మాట్లాడుతున్నావ్?’’ అన్నాడు కాస్త చిన్నబుచ్చుకుంటూ.
‘‘అదేం లేదురా. రోజూ నువ్వు రాక ముందే తను మాట్లాడేసేది. ఈ రోజు ఎందుకో రాలేదు. అందుకని అడిగానంతే’’
ఈలోపు ఆవిడకు సమాధానంగా ‘‘వచ్చేసానత్తయ్యా!’’ అంది వెనుక నుంచీ.
‘‘ఇంకేం మాట్లాడుకోండి అత్తాకోడళ్ళు’’ అని కుర్చీలోంచి లేవబోయాడు.
‘‘నువ్వు లేవడం ఎందుకు? నువ్వు వినగూడని రహస్యాలు మా ఇద్దరి దగ్గర ఏం లేవు, కూర్చో’’ అని కొడుకుతో చెప్పి, ‘‘మనిద్దరం దగ్గరయిపోయామని నా కొడుకు ఓ ఇదయిపోతున్నాడు విశ్వా’’.
‘‘పోనీలేండయ్యా! కాసేపు పోట్లాడుకుందాం.. అప్పుడు తనే బేరం పెడతారు’’.
‘‘అంతేనంటావా?’’ అందావిడ నవ్వుతూ.
‘‘బాబోయ్! ఆ పని మాత్రం చెయ్యకండి. సుఖాన వున్న ప్రాణాన్ని కష్టాలలో పడేసుకున్నట్లు అయిపోతుంది నా పరిస్థితి’’- నిజంగా అది జరిగిపోయినంత భయాన్ని నటిస్తూ అన్నాడు.
‘‘విశ్వా! వీడు బాగా యాక్ట్ చేసేస్తున్నాడు. సినిమాల్లోకి పంపేద్దామా?’’
‘‘ఆ పని చేయండత్తయ్యా, సరిపోతుంది’’
‘‘అప్పుడు నాకు ఎంతోమంది హీరోయిన్స్ ఉంటారు.. అది గుర్తుంచుకో’’.
‘‘అసలు నేను పంపితేకదా’’ ప్లేటు మార్చేసింది విశ్వ.
‘‘ఎంతసేపూ మీరేనా? నన్నూ నా కోడల్ని మాట్లాడుకోనివ్వండి’’ అని మధ్యలో తయారవుతున్న తండ్రిని చూసి ‘‘పోటీకి మీరొక్కరే తక్కువ. రండి.. రండి’’ అన్నాడు.
‘‘మామయ్యా! బీపీ మాత్రలు జాగ్రత్తగా వేసుకుంటున్నారా?’’
‘‘చూసావమ్మా! నా కొడుకు నీలా ఒక్కసారైనా అడిగాడా?’’
‘‘విశ్వ అడుగుతుందనే నేను అడగలేదు. ఇద్దరూ ఒకే మాట మాట్లాడటం ఎందుకుని’’ అందుకున్నాడు సూర్యచంద్ర.
‘‘కోయ్! కోయ్! కోతలు’’
‘‘నాన్నా! కోడలు ముందు నన్ను లోకువ చెయ్యకండి. తర్వాత మీరే ఇబ్బంది పడతారు’’
‘‘మాకా భయం విశ్వతో లేదు లేరా’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి.
తనమీద వీళ్ళిద్దరికీ ఎంత నమ్మకం అనుకుంది విశ్వ మనసులోనే.
‘‘మామయ్యా! మీ తిరుగు ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు?’’
‘‘ఈ మాట అడగని రోజు ఉండదా విశ్వా?’’
‘‘ఏం లేదు మామయ్యా! ఏ మనవడో వస్తే వాళ్ళా క్రెడిట్ కొట్టేస్తారని’’
‘‘నిజంగా ఆ మాట నిజం చెయ్.. తప్పకుండా వచ్చేస్తాం’’.
‘‘అదేం కుదరదు. మీరు వచ్చాకే అలాంటి వాటి ఆలోచన’’ అంది సిగ్గుపడుతూ.
‘‘వచ్చేసే ఆలోచనలోనే ఉన్నాను. తొందరలోనే చెబుతాను. అది కూడా ముందుగా నీకే’
‘‘నేనొప్పుకోను.. నాక్కూడా చెప్పరా’’ అంది అమృత.
‘‘నేను ఇండియా వెళదాం అనుకోవడానికి కారణం విశ్వ. కాబట్టి ఆ గొప్పతనం విశ్వకే దక్కాలి’’ అన్నారాయన నిర్మొహమాటంగా.
‘‘్ఫర్వాలేదు మామయ్యా! ముందు అత్తయ్యగారికే చెప్పండి. మాకు కావాల్సింది మీరు ఇద్దరూ రావటంగానీ ముందుగా చెప్పటం కాదు’’.
‘‘చూసారా! నా కోడలు ఎంత మంచిదో’’
‘‘అంతేలేమ్మా! ముందొచ్చిన చెవులుకన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అన్నారా’’ అన్నాడు ఉడుక్కుంటూ సూర్యచంద్ర.
‘‘విశ్వా! మీ ఆయన్ని చూస్కో.. గుడ్‌నైట్’’ అందావిడ.
‘‘నేను కూడా’’ అన్నారాయన వెనుకనుంచీ.
‘‘గుడ్‌నైట్’’ అన్నారు విశ్వ, చంద్ర ఒకేసారి.
‘‘ప్రపంచమంతా ఈ బుల్లి బాక్సులో నిక్షిప్తమైపోయింది కాబట్టి బ్రతకగలుగుతున్నాం. లేదంటే అమ్మా, నాన్నలను చూడకుండా నేనుండగలిగేవాడినా?’’
‘‘నీకీ బెంగ ఇంక ఎన్నో రోజులు ఉండదులే చందూ. నా ఊహ నిజమయితే రెండు, మూడు నెలల్లో అత్తయ్య, మామయ్య మన దగ్గిర ఉంటారు?’’
‘‘నిజమా?’’
‘‘ఆఁ! అంతకంటే ఎక్కువ మాత్రం పట్టదు. మీ నాన్నగారి మాటల్లో అది కనిపించటం లేదూ?’’
‘‘ఏమో! నాన్న నా కళ్ళముందు నిలుచుని వచ్చేసా అన్నా నేను నమ్మనేమో’’
‘‘అదంత కష్టసాధ్యమైన పని అని నన్ను భయపెడుతున్నావా?’’
‘‘నిన్ను భయపెట్టటం కాదు. నాన్న అంత మొండివాడు అని చెబుతున్నానంతే’’
‘‘చూద్దాం. ప్రేమకు లొంగని మనిషి ఉండడని నా నమ్మకం’’.
‘‘చూద్దాం’’ అన్నాడు ఇక చేసేదేం లేదన్నట్లు.
‘‘చందూ! నేనే మీ అందరినీ వేరు చేసాను. మళ్లీ అందరినీ కలిపే బాధ్యత కూడా నాదే’’
‘‘సరే! ఇంక నిద్రపోదామా?’’
‘‘ఊ!’’
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206