డైలీ సీరియల్

విలువల లోగిలి-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద లైటు ఆర్పెయ్యటంతో నీలి రంగు బెడ్‌లైట్ కాంతి ఆ గదంతా పరచుకుంది.
ఇది ఆర్పటం, అది వేయటం రెండూ ఒకేసారి చెయ్యటం విశ్వ అలవాటు.
దాన్ని సరదాగా చూడటం తన అలవాటుగా మార్చుకున్నాడు చందూ.
‘‘ఇక దేవిగారు మమ్మల్ని కరుణిస్తే సంతోషిస్తాం’’
చిన్నగా నవ్వి అతని చెంత చేరింది విశ్వ.
ఇక ఆ ప్రియలోకం వారిదే. అన్యులకు తావులేదందులో.
***
మరునాడు చందూ పుట్టినరోజని కేక్ ఆర్డర్ ఇవ్వటానికి బేకరీ షాపుకి వెళ్లింది విశ్వ.
అక్కడ తనతోపాటూ ఇంకొకావిడ కూడా కేక్స్ కొనటానికి వచ్చింది. ఆవిడ దగ్గిర చిల్లర లేదు. వెయ్యి నోటే ఉందని ఆవిడ, మా దగ్గరా లేదని షాపువాడు అనుకుంటున్నారు.
‘‘ఎక్కడికైనా మీ వాళ్ళను పంపి తెప్పించండి’’ అంటోందావిడ.
‘‘ఇది బిజీ టైమ్. మా వాళ్ళను పంపటం కుదురదు. మా యజమాని ఇపుడే వచ్చి కలెక్షన్ తీసుకువెళ్ళాడు. లేకపోతే మీకే ఇబ్బంది వచ్చేది కాదు.
మెట్ల క్రింద వాళ్ళాయన అనుకుంటా నిలబడి ఉన్నాడు. నేనిస్తానుండండి అంటూ వెయ్యికి చిల్లర ఇచ్చింది విశ్వ.
‘‘చాలా థాంక్సండీ. కేక్స్ తెస్తామని చెప్పాను. తీసుకువెళ్ళకుండా వెళితే మా బాబు చిన్నబుచ్చుకుంటాడు’’ అంది ఆమె.
‘‘్భమేశ్వరీ! ఎనీ ప్రాబ్లమ్’’ అంటున్నాడాయన క్రిందనుంచీ.
‘‘ఏంలేదు..
‘‘్ఫర్వాలేదు. నా దగ్గిర ఉంది కాబట్టి ఇచ్చాను’’ అని చెప్పి మెట్లు దిగుతున్న విశ్వ ‘్భమేశ్వరి’ అన్న పిలుపుకు ఆగిపోయింది.
‘‘ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే?’’
వెంటనే గుర్తువచ్చింది. ధర్మేంద్ర చెల్లెలి పేరు భీమేశ్వరి కదా!
గిర్రున వెనుదిరిగి ‘మీరు ధర్మేంద్ర చెల్లెలా?’ అని అడిగింది.
‘‘అవును.. మీకెలా తెలుసు?’’ అందామె ఆశ్చర్యంగా.
‘‘చెబుతాను మా ఇంటికి వస్తానంటే’’
‘‘ముందు మీరెవరో చెప్పండి’’ అతృత పట్టలేనన్నట్లు అందామె.
‘‘మీ అత్తయ్యగారి అబ్బాయి సూర్యచంద్ర భార్యను’’
‘‘అవునా.. అయితే మీ పేరు విశ్వ. ఇప్పుడంతా నాకు అర్థమైంది’’
‘‘జార్జ్! ఈవిడ మా చెల్లి విశ్వ!’’ అని పరిచయం చేసింది. బంధువుల పలకరింపే కరువైన సమయంలో విశ్వ అలా మాట్లాడటం పన్నీటి జల్లు చిలకరించినట్లయింది.
‘‘నాకు లేవబుద్ధికావటంలేదు. ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది’’
‘‘అబ్బా! అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు’’
‘‘ప్లీజ్’’
‘‘ఈ రోజు నీ ప్లీజులకు నా దగ్గర స్థానం లేదు. తొందరగా బ్రష్ చేసుకుని వచ్చేయ్. శివస్నానం చేయిస్తాడు నలుగుపెట్టి’’
‘‘బాబోయ్ నలుగాఁ!’’
‘‘ఆఁ! తప్పదు’’
‘‘అమ్మ దగ్గరనుంచీ పారిపోయి వచ్చాననుకున్నా. ఇక్కడ నీ దగ్గిర తప్పటంలేదన్నమాట’’
‘‘తొందరగా రా చందూ’’ అంటూ వెళ్లిపోయింది.
‘‘శివా!’’
‘‘ఆఁ! వస్తున్నానమ్మా!’’
‘‘ఈ రోజు అయ్యగారి పుట్టినరోజు. పెసరపిండితో నలుగుపెట్టు. కుంకుడు కాయ పులుసుతో తల అంటు’’
‘‘అలాగేనమ్మా!’’
‘‘బాబోయ్! కుంకుడుకాయ రసమా! నా కొద్దు. షాంపుతో చేసుకుంటా’’ అన్నాడు చిన్నపిల్లవాడిలా మారాంచేస్తూ.
‘‘కుదరదు. ఇది దేవిగారి ఆజ్ఞ’’
అటునుంచీ వెళుతున్న సుగుణ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంది.
‘‘అమ్మా! నువ్వు అయినా వద్దని చెప్పమ్మా!’’
‘‘లాభం లేదు. అక్కడ ఉన్నది విశ్వ అమ్మగారు’’ అంది గంగ.
పూర్తిగా బుక్ అయిపోయానని అర్థమైంది అతనికి. అందుకే బుద్ధిమంతుడిలా మారిపోయాడు.
చక్కగా స్నానం చేసి విశ్వ అక్కడ ఉంచిన బట్టలు కట్టుకున్నాడు. పంచ, లాల్చీ, కుండువాతో తెలుగువాడిలా మెరిసిపోతున్నాడు సూర్యచంద్ర.
తను కూడా తయారయి వచ్చి ‘‘పదండి.. గుడికి వెళ్దాం’’ అంది.
భీమేశ్వర ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. వచ్చేప్పుడు నిన్న ఆర్డర్ ఇచ్చిన కేక్ ఇంకా కావాల్సిన వస్తువులు తీసుకుని ఇంటిదారి పట్టారు ఆ దంపతులు.
గుడినుంచీ ఇంటికి వచ్చేటప్పటికి భీమేశ్వరి, జార్జి, వాళ్ళబాబు గ్రేస్ కూడా అక్కడ కూర్చుని వున్నారు.
‘‘హేయ్! భీమేశ్వరి వదినా! ఏమిటి సడన్ సర్‌ప్రైజ్! ఆ రోజు ధర్మేంద్ర పెళ్లిలో నిన్ను ఎంతగా తలచుకున్నానో తెలుసా?’
‘‘తెలుసు సూర్యా! ఈయనే మా వారు జార్జ్! చర్చ్ ఫాదర్!’’
‘‘గ్లాడ్ టు మీట్ యు’’ అంటూ కరచాలనం చేశాడు.
‘‘వీడు మా బాబు గ్రేస్’’
‘‘హాయ్! గ్రేస్’’ ఎత్తుకొని ముద్దిచ్చాడు.
‘‘హాపీ బర్త్‌డే అంకుల్’’ అన్నాడు వాడు ముందుగా.
అప్పుడు వాళ్ళిద్దరూ కూడా విష్ చేశారు. ఎంతైనా ఈ కాలం పిల్లలు బాగా ఫాస్ట్ అని అనుకుని నవ్వుకున్నారు.
విశ్వ దారిలో తీసుకున్న సామానులను శివతో కార్లోంచి తీయించి లోపలికి వచ్చింది.
‘‘ఓ మీరు వచ్చేసారా! సారీ... గుడికి వెళ్లటంతో కాస్త ఆలస్యమయింది’’ అంది.
‘‘ఏం ఫరావాలేదు. ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వద్దామా అనిపించి మేమే కాస్త ముందు వచ్చేసాం’’ అంది నవ్వుతూ భీమేశ్వరి.
ఆమెకు విశ్వ అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అందరూ ఒక రకంగా వెలివేసిన సమయంలో తామెవరో పరిచయం లేకపోయినా ఆదరంగా మాట్లాడి ఇంటికి ఆహ్వానించటం జీవితంలో మరిచిపోలేననుకుంది మనసులో. అలా ఇప్పటికి ఎన్నిసార్లు అనుకుందో ఆమెకే తెలియదు.
టీపాయ్‌మీద కేక్‌ను సర్ది రంగుల పేపరులో అలంకరించిన నైఫ్‌ను ఉంచింది.
శివా, గంగా, అమ్మా అందరూ రండి అని పిలిచింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206