ధర్మసందేహాలు

ధర్మసందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సృష్టికర్త బ్రహ్మ అంటారుగదా! బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సమానమైనప్పుడు బ్రహ్మకు ఆ పేరెలా వచ్చింది?
- వి.బాలకేశవులు, గిద్దలూరు
ముగ్గురు అన్నదమ్ములు ఆస్తి పంపకాల్లో సమానమయి వున్నారనుకోండి. అంతమాత్రాన వారికి వేరువేరు పేర్లు వుండవా? బ్రహ్మ పేరుగూడా అలాంటిదే. ఆయనే స్వయంగా సృష్టిస్వరూపంగా ‘‘బృంహణం’’ చెందాడు గనుక ఆయనకు ‘‘బ్రహ్మ’’అనే పేరు వచ్చిందనే వ్యుత్పత్తిని నిఘంటువులు సూచిస్తున్నాయి.
* స్వామి మాలలో వున్నప్పుడు ‘‘తేగలు’’ తినవచ్చునా?
-సీత, నల్లగొండ
తేగలు అనేవి తాడిచెట్టునుంచి ఉత్పన్నమయ్యే పదార్థాలు. తాడిచెట్టు నుంచీ ఉత్పన్నమయ్యేవన్నీ మద్యంతో సమానమే. కనుక వాటిని ఎప్పుడూ తినరాదు. తాగరాదు.

============
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.

కుప్పా వేంకట కృష్ణమూర్తి vedakavi@serveveda.org