ధర్మసందేహాలు

ధర్మసందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మనం ఇప్పుడు కలియుగంలో వున్నాం కదా! ఇది ఎన్నవ మహాయాగంలోని కలియుగం. మనం చెప్పుకునే రామకృష్ణాద్యవతారాలు ఎప్పటివి? అలాంటి అవతారాలు మళ్ళీమళ్ళీ వస్తునే వుంటాయా?
- పి.హనుమాన్ ప్రసాద్, విజయవాడ
మనం వివాహాది సమయాలలో చెప్పుకునే మహాసంకల్పంలో ఆ వివరాలు కొన్ని వున్నాయి. ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. ఇ ప్పుడు మనం చదువుతున్న రామాయణ భాగవతాదులలో కనిపించే శ్రీరామ, శ్రీకృష్ణులు కూడా ఈ మహాయుగానికి చెందినవారే. ఇలాంటి అవతారాలు మళ్ళీమళ్ళీ ఆవృతమవుతూనే వుంటాయని అనేక పురాణాలలోను, యోగావాసిష్ఠాది గ్రంథాలలో కూడా స్పష్టంగా వుంది. అన్ని మహాయుగాలలోనూ, అన్ని అవతారాలు పునరావృత్తం కాకపోయినా అన్ని కల్పాలలోనూ అవి పునరావృత్తం అవటం ఖాయమని, వారి చరిత్రలలోను స్వల్పభేదాలు వుంటాయనీ, అందుకనే పురాణాలలో ఆయా అవతారాలను గురించిన భిన్నకథనాలు కనిపిస్తూ వుంటాయని, పురాణ పరిశోధకులు నిశ్చయించి చెబుతున్నారు.
* ద్రౌపది కర్ణుని ఆరవ భర్తగా నిజంగా కోరిందా?
- కాట్రగడ్డ వెంకట్రావు, చీరాల
వ్యాస భారతం ప్రకారం ఆమె అలా కోరలేదు. కేవలం కర్ణుడ్ణి పరీక్షించేందుకోసం శ్రీకృష్ణుడు కర్ణుడితో ‘నువ్వు పాండవ పక్షానికి వస్తే నిన్ను ద్రౌపది ఆరవ భర్తగా స్వీకరిస్తుంది’అని అన్నాడు. కర్ణుడు ఈ పరీక్షలో పడలేదు.
* అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడు?
- నిర్మల, వైజాగ్
అతని తండ్రి అయిన ద్రోణునియొక్క తపోబలం వలననే అతడు చిరంజీవి అయ్యాడు.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

- కుప్పా వేంకట కృష్ణమూర్తి