ధర్మసందేహాలు

ఆదిత్యహృదయం పఠన ఫలితాలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటంటారు? - కాట్రగడ్డ వెంకట్రావు, కావలి
మంచి ఉత్తమ విషయాల మీద చర్చ జరుగుతున్నప్పుడు విలువ లేని అల్ప విషయాల మీద లేనిపోని చర్చలను లేవనెత్తటం అనే దురభ్యాసాన్ని రామాయణంలో పిడకల వేట అనే సామెత ద్వారా పెద్దలు వ్యక్తీకరిస్తున్నారు.
*ఆదిత్యహృదయం ఎవరు ప్రసాదించారు? పఠనం వల్ల ఫలితమేమి? - నీరజ, వేలూరు
వాల్మీకి రామాయణంలో వున్న ఏకైక దేవతాస్తోత్రం ఆదిత్య హృదయం. శ్రీరాముడు యుద్ధరంగంలో వుండి రావణాసురుడిని సంహరించడం ఎలాగా అని తపన పడుతున్న తరుణంలో అగస్త్య మహర్షి అక్కడ ప్రత్యక్షమై శ్రీరాముడికి శత్రుజయార్థమై ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడని వాల్మీకి రామాయణంలో ఉన్నది. అయినప్పటికీ ఆదిత్యుడు ఆరోగ్య దేవత కనుక సర్వరోగ నివారణకు కూడా ఈ స్తోత్రాన్ని జపించడమనేది శిష్టాచారంలో వున్నది.
* విశ్వకర్మ భగవానుడు ఎవరు?
- సుబ్బు సుబ్రహ్మణ్యం , అనంతపురం
ఈయన దేవశిల్పి. శిల్పి అంటే ఈనాటి ఇంజనీరు మరియు శిల్పశాస్తవ్రేత్త. ఈయన దేవలోకం లోని హార్మ్యాలన్నిటికీ నిర్మాత ఈయన పుత్రిక అయిన సంజ్ఞా దేవిని సూర్య భగవానుడు వివాహం చేసుకొన్నాడు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ప్రపంచంలోని సర్వకర్మలకూ ఆదికర్తయైన పరమాత్మయే విశ్వకర్మ.
భగవద్గీతలో శ్లోకాలు ఎన్ని?
- వి.వి.రావు, నెల్లూరు
ఏడు వందలని పండిత లోక ప్రసిద్ధి. ఇటీవల కొందరు ఈ సంఖ్య గురించి కొత్తవాదాలు వినిపిస్తున్నారు. కాని వాటిలో బలం కనిపించడం లేదు.
* ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి?
- వి. లక్ష్మి, బందరు
ధనుర్మాసంలో వచ్చేశుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని రెండు పేర్లు. ఆనాడు వైకుంఠంలో శ్రీహరి ఉత్తర ద్వారం దగ్గర ఉండి దర్శనం ఇస్తుండగా ముక్కోటి దేవతలు వచ్చి దర్శనం చేసుకొంటారని పురాణ ప్రసిద్ధి. అందువల్లే ఈ ఏకాదశికి ఈ పేర్లు వచ్చాయి.
* చిరంజీవ అని దీవిస్తారు. ఆయుష్మాన్ భవ అంటారు. పాపీ చిరాయువంటారు. వీటిని పూర్తిగా వివరించండి. - ఆంజనేయమూర్తి , కావలి
‘‘పాపీ చిరాయుః’’ అనేది ధర్మశాస్త్ర వాక్యం కాదు. అది కేవలం ఎత్తిపొడుపు కోసం పుట్టిన లౌకికమైన సామెత. చిరం జీవ, ఆయుష్మాన్ భవ ఇత్యాదులు శాస్త్రోక్తమైన ఆశీర్వాక్యాలు. ఈ రెంటినీ కలిపి ముడిపెట్టరాదు.
7. వసుదేవునకు భార్యలు ఎందరు?
- శైలేంద్ర, రాజమండ్రి
వసుదేవునికి చాలామంది భార్యలున్నారు. ఈయన మొదట గా దేవకుని కుమార్తెలైన దేవకీ, శాంతాదేవి మొదలైన అక్కాచెల్లెళ్ల ఏడుగురిని వివాహం చేసుకొన్నారు. వీరుగాక రోహిణి, కౌసల్య పౌరవి, మదిర, దేవరక్షిత అనే భార్యలు కూడా ఉన్నారు.
***

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

- కుప్పా వేంకట కృష్ణమూర్తి