ధర్మసందేహాలు

తపస్సు, ధ్యానం ఈ రెండింటి తేడాలేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెల్లజిల్లేడు మొక్క ప్రాధాన్యాన్ని తెలుపగలరు?
డి. సత్యనారాయణ, క్రిష్ణాపురం
దేవతాపరంగా తెల్లజిల్లేడు చెట్లు సూర్యుడికి, హనుమంతునికి, గణపతికి కూడా నివాసస్థానము. తెల్లజిల్లేడు చెట్లు 12 సంవత్సరాలుగా ఏపుగా పెరిగినట్లైతే దాని తల్లివేరు ఆంజనేయస్వామి ఆకారంగా గానీ, తనంతట తానే రూపొందుతుంది. ఇటువంటి చెట్టుకింద కూర్చుని సూర్య ఆంజనేయ గణపతి మంత్రజపాలను చేస్తే మంత్రసిద్ధి త్వరగా లభిస్తుందని మంత్ర శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇక మూలికా పరంగా ఆయుర్వేదంలో దీనికి అనేక ఉపయోగాలున్నాయి.
* వృద్ధాప్యమునందు పురుళ్లూ సూతకములు మొదలగు అశౌచిక కార్య క్రమములకు పట్టింపు లేకుండా ఉండుటకు ఏదైనా తరుణోపాయం ఉన్నదా? పవిత్రమైన నదులలో స్నానం ఆచరించి వదిలి రావటానికి అవకాశం ఉన్నదా?
- కొవూరు వేంకటేశ్వర ప్రసాదరావు,కందుకూరు
ధర్మశాస్త్ర గ్రంథాల్లో అటువంటి వెసులుబాటు ఏదీ కనిపించటం లేదు. అనారోగ్యాదులవల్ల శిరస్నానం అసాధ్యంగా వుంటే భస్మ స్నానం వంటి ప్రత్యామ్నాయ స్నాన విధానాల ద్వారా అశౌచ శుద్ధిని సంపాదించుకోవచ్చును.
* భక్తునికి ఉండవలసిన ముఖ్య అర్హత ఏమిటి?
- కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై
భగవంతుని యందు నిష్కామమైన ప్రీతి
* తపస్సుకీ, ధ్యానానికీ తేడా ఏమిటి? - నీరజ, నెల్లూరు
ధ్యానమంటే తన కిష్టమైన పదార్థం మీద కానీ, భావం మీద కానీ, మనస్సు లగ్నం చేయడం, ‘‘నియమేషు తపఃశబ్దః తపః ఉపతాపే’’ ఇత్యాది ప్రమాణాల వల్ల విశేష నియమాలను స్వీకరించి మనస్సును ఏకాగ్రం చేసి, తన ఉపాస్య మంత్రం కానీ భావన కానీ ఏబిందువులోంచీ ఆవిర్భవిస్తుందో గమనించి ఆ బిందువు మీద తన బుద్ధిని శరీరంలో వేడి పుట్టే లాగా తీవ్రంగా లగ్నం చేస్తే దాని పేరు తపస్సు.
* ఆత్మ పరమాత్మలకు గల తేడా ఏమిటి?
- బి.లక్ష్మీనారాయణ , హైదరాబాదు
సామాన్య వేదాంత పరిభాష ప్రకారం ఒక శరీరం యొక్క హృదయంలో ‘‘నేను నేను’’ అని స్ఫురించే జీవాత్మనే ఆత్మ అంటారు. సమస్త బ్రహ్మాండాలలోనూ అఖండంగా అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్న మహాచైతన్యాన్ని పరమాత్మ అంటారు. కానీ ఒక్కొక్కప్పుడు ఉపనిషత్తులు మొదలైన గ్రంథాలలో ఆత్మ పరమాత్మ అనుపదాలను సమానార్థకాలుగా వినియోగించటం కూడా ఉంది.
* భగవంతుడు ఎవరు? - అనుమాన రావు, నెల్లూరు
ఈ సమస్త ప్రపంచం ఎవరిలోంచి ఉద్భవిస్తోందో, ఎవరి వల్ల నిలిచి ఉంటుందో, చివరకు ఎవరిలోనే లయించి పోతోందో ఆ ఏకైక స్థానం భగవంతుడి లేత పరమాత్మ.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి