ధర్మసందేహాలు

బ్రహ్మదేవునికీ ఆయుష్షు తీరిపోతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహబలేశ్వరంలో వున్న మహాబలేశ్వరుఢు, స్వయంగా వెలసిన శివుడా? రా వణ ప్రతిష్ఠితుడా?
- సి.వాసుదేవరావు, శ్రీకాకుళం
ఇలాంటి విశేషాలు స్థల పురాణాలవలన మాత్రమే మనకు తెలుస్తాయి. ఈ స్థల పురాణాలు ఒకరకంగా వుండటం లేదు. అవి ఏ కాలంలో ఎవరిచేత రచించపబడినాయో చెప్ప డం కష్టం. కొన్నిచోట్ల ఇది రావణ ప్రతిష్ఠ అని కొన్ని చోట్ల స్వయం వ్యక్తిమూర్తి అని వున్నదని స్థానికులు చెబుతున్నారు.
* కలియుగం చివర మహాప్రళయం వస్తుం దా? - నీరజ, ఒంగోలు
ప్రళయం వేరు, మహాప్రళయం వేరు. కల్పాంతంలో వచ్చేది మహాప్రళయం. కల్పం మధ్యలో వచ్చే యుగాంతాల దగ్గర లఘుప్రళయాలు మాత్రమే వస్తాయి, గడచిన ద్వాపరాంతంలో వచ్చినట్లు.
3* ఎన్ని మహాయుగాలైతే బ్రహ్మప్రళయం వస్తుంది? - సందేహాలరావు, సూర్యాపేట
మానవుల సంవత్సరం దేవతలకు ఒక రోజు. అలాంటి 350 రోజులు ఒక దివ్య సంవత్సరం. అలాంటి దివ్య సంవత్సరాలు 1200 కలిస్తే ఒక దివ్య యుగం. ఇలాంటి దివ్య యుగాలు 2000 కలిస్తే అది బ్రహ్మదేవునికి ఒక రోజు. ఇలాంటి రోజులు 360 కలిస్తే అది బ్రహ్మ సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 గడిస్తే ఒక బ్రహ్మదేవుడి ఆయిష్యం తీరిపోతుంది. అప్పుడు వచ్చేది బ్రహ్మప్రళయం.
* భారతదేశ కాలమానమును గురించి ఉదయం ఎప్పుడు మొదలవుతుంది అనగా 00.00 సమయం ఎప్పుడు? - పి.కుమారస్వామి, నెల్లూరు
భారతీయ విధానంలో కాలమానం ఎప్పుడూ కూడా సూర్యబింబం భూమ్యాకాశ సంధిలోకి సగం వరకు వచ్చినపుడు ప్రారంభం అవుతుంది.
* గంగాస్నానముతో కాని జగన్నాథ రథయాత్ర సందర్శించిన కాని, ఆ రథాన్ని లాగిన కాని, సమస్త జన్మల పాపాలు పోతాయని ప్రవచకులు సమాజాన్ని ఎందుకు పెడత్రోవ పట్టిస్తున్నారు.
- విజయరాణి, కోదాడ
మహర్షులు చెప్పిన వాక్యాలు మనలను పెడత్రోవ పట్టించవు. గంగాది దేవతలు, దీర్ఘకాలం నిస్వార్థబుద్ధితో తపస్సు చేసి, తమ మీద పూర్తి నిస్వార్థబుద్ధితో తపస్సు చేసి, నదులమీద ఆధిపత్యాన్ని సంపాదించి, తమ మీద పూర్తి విశ్వాసంతో ఆ నదులలో స్నానం చేసినవారికి పాపాలు పోగొట్టడాన్ని ఒక మహావ్రతంగా స్వీకరించి వున్నాయి. పూరి జగన్నాథ రథంలోని శ్రీకృష్ణస్వామి కూడా ఆ కోవకు చెందినవాడే. అందువల్ల వారి సేవను హృదయపూర్వకంగా చేస్తే అది వ్యర్థంగా పోదు.
* సంధ్యావందనాదులు ఋగ్వేదులకు, యజుర్వేదులకు వేరు వేరుగా వుండటానికి ప్రత్యేక కారణం వుందా? - కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వేదశాఖ అనే వ్యవస్థను ద్వాపరాంతంలో వ్యాస భగవానుడు రూపొందించాడని ప్రతీతి. అంతకుముందు కృతయుగంనుంచే ఈ వ్యవస్థ వుందని కొందరి అభిప్రాయం. ఏ వేందవారు ఆ వేద మంత్రాలతోనే తమ నిత్యనైమిత్తిక శ్రౌత స్మార్త కర్మలను నిర్వర్తించుకోవాలని సూత్రకారులు నిర్ణయించి, ఏఏ మంత్రాలను ఏఏ కర్మలలో వినియోగించుకోవాలో కూడా వారే నిర్ణయం చేసి వున్నారు. అందువల్ల సంధ్యావందనం దగ్గరనుంచి అపరకర్మ దాకా ఏ వేదం వారి విధానం, ఆ వేదంవారికి విడివిడిగా రూపొందించబడినాయి.
* మన దేశానికి భారతదేశమని పిలుపు ఎవరి వలన వచ్చింది? - కొండలేశ్వరరావు, నందిగామ
శ్రీరామునికి వెనుక ఋషభ చక్రవర్తి అనే పేరుతో శ్రీవిష్ణువు అవతారం ఒకటి వెలసింది. ఆయన భూమండలాన్ని తొమ్మిది విభాగాలుగా చేసి తన తొమ్మిది మంది పుత్రులకు పంచి ఇచ్చాడు. వాటిలో ప్రధాన భాగం ఆయన పెద్దకొడుకైన భరతుడికి లభించింది. ఆయనను బట్టే ఈ ప్రాంతానికి భరతవర్షమనే పేరు వుండేది. అంతకుముందు ఈ ప్రదేశానికి అజనాభము అనే పేరు వుండేది. ఈ భరతుడు యొక్క పెద్దకుమారుడైన భారతుడు పాలించిన ప్రాంతానికి భారతదేశము అనే పేరు వచ్చింది.
**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035. vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి vedakavi@serveveda.org