ధర్మసందేహాలు

ఆంగ్లేయులది గ్రిగేరియన్ కాలెండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సంవత్సరానికి 12 నెలలు ఏ విధంగా ఏర్పడినాయి? - యస్.రామారావు
భూమి చుట్టూ వుండే భూచక్రము అనబడే గ్రహ సంచార చక్రాన్ని 12 విభాగాలుగా విభజిస్తే ఒక్కొక్క విభాగానికి 30 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఈ విభాగాలనే ద్వాదశ రాశులు అంటారు. భూమిని కేంద్రంగా చేసుకుని ఖగోళ గణనం చేసేటప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలోను ఒక్కొక్క నెలపాటు సంచారం చేస్తాడు. ఈ సూర్య సంచార విధానాన్ని బట్టే సంవత్సరానికి 12 నెలలు అనే వ్యవస్థ ఏర్పడింది.
* కొన్ని నెలలకు 30 రోజులు, కొన్నింటికి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులు అని ఎందుకు ఏర్పాటుచేశారు? - నీరజ, హైదరాబాద్
ఇది భారతీయ కాలమాన విధానం కాదు. విధానం ఏదైనా సంవత్సరానికి 364 రోజులు చిల్లర సమయం పడుతుంది. అంతేకానీ గుండ్రంగా ఒక సంఖ్య రాదు. అందువల్ల ఏడాదిలో దిన సంఖ్యలకు సవరణ చేసేందుకు వీలుగా గ్రిగరీ అనే పాశ్చాత్య ఖగోళ శాస్తజ్ఞ్రుడు మీరు చెప్పిన మాస దిన సంఖ్యా విధానాన్ని రూపొందించాడు. అందుకనే ఆంగ్లేయుల కాలెండర్‌ను గ్రిగేరియన్ కాలెండర్ అని పిలుస్తారు.
* వివాహంలో చదివే మంత్రాలకు, దేవతా కల్యాణంలో చదివే మంత్రాలకు తేడా ఏమిటి? - యస్.కుమారి
దేవతా కల్యాణం అనేది దేవతానుగ్రహ సిద్ధికోసం మానవులు నిర్మించుకున్న విధానం. అందువలన మానవ కల్యాణంలో వున్న ప్రధాన మంత్రాలనే ఏరి దేవతా కల్యాణ మంత్రాలుగా మన పెద్దలు రూపొందించారు.
* జంధ్యం ఏయే కర్మకాండలలో మార్చాలి?
- పి.వి.ఎ.సూర్యనారాయణ, గజపతినగరం
మనకు తీవ్రమైన అపవిత్రత సంభవించినపుడు జంధ్యం మార్చుకోవాలి. శవస్పర్శ, స్మశానంలోకి ప్రవేశం, మృతాశౌచం (మైల), శునకస్పర్శ, మనకు దగ్గర బంధువులు కానివారి ఇండ్లలో శ్రార్థ్భోజనం, ఇటువంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇదిగాక జంధ్యంలోని దారాలు శిధిలమైపోగులుగా బైటకు వస్తున్నప్పుడు, లేదా తెగినపుడూ కూడా జంధ్యం మార్చుకోవాలి. శ్రావణ పూర్ణిమ (జంధ్యాల పూర్ణిమ)కు నూతన యజ్ఞోపవీత ధారణ విధింపబడి వుంది. కానీ ఇది అపవిత్రతవల్ల చేసే ధారణ కాదు.

కుప్పా వేంకట కృష్ణమూర్తి