ధర్మసందేహాలు

గాయత్రీ సహస్ర పారాయణ ఎందుకు చేయరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వివిధ దేవతా సహస్ర నామాలకు సామూహిక పారాయణలు జరుగుతున్నా గాయత్రీ సహస్రానికి అలా ఎవరూ చేయటం లేదు ఎందువల్ల?
పద్మ, హైదరాబాదు
గాయత్రీ మంత్ర విషయంలో సాధకులకు గౌతమ మహర్షి శాపం వుంది. అందువల్ల సాధకులు గాయత్రీ దేవిని తరచుగా మరచిపోతూ వుంటారు. ఆ శాప ప్రభావంవల్లనే ఆ సహస్రనామ పారాయణాదులు గూడా విరళంగా జరుగుతున్నాయి.
* హిందువులలో జాతి మతపరమైన ఆత్మాభిమానం లోపించటానికి, ఆదివారాలలో మాంసాహారం స్వీకరించే అలవాటుకి, పరస్పర సంబంధం కలదా?
- పి.వి.నరసింహరావు, రాజమండ్రి
మాంసాహారం అనేది వంశాచారంగా కొన్ని వర్ణాలలో పూర్వయుగాలలోగూడా వుంది. వారంతా జాతి ధర్మరక్షణ చేసినవారే. ఇప్పుడు హిందువులలో ఆత్మాభిమానం పెరగాలంటే చేయవలసింది పిల్లలు చిన్నతనంలో వుండగానే వారికి మన దేశం గురించీ, సంప్రదాయం గురించీ, మతం గురించీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరియైన అవగాహన కలిగించాలి. దానికి కావలసిన విధి విధానాలను రూపొందించుకోవాలి.
* వివిధ దేవతా గాయత్రీ మంత్రాలు ఏ విధంగా వచ్చాయి?
- పి.వి.ఆర్. నెల్లూరు
అవి వేద సిద్ధంగానే వచ్చాయి. వాటిలో కొన్ని కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ శాఖలో కనిపిస్తున్నాయి. ఇంకా ఏఏ శాఖలలో వున్నాయో తెలియదు.
* ఒక దేవతకు సంబంధించిన మంత్రానికీ, అదే దేవతకు సంబంధించిన దేవతాగాయత్రికీ గల తేడా ఎటువంటిది? - నీరజ, కాకినాడ
ఒక దేవతా మంత్రం కొన్ని బీజాక్షరాల సంపుటిగా వుండి ఆ దేవతా సంబంధమైన శక్తులను సాధకులకు సంక్రమింపజేసేదిగా వుంటుంది. దేవతా గాయత్రి ఆ దేవతా శక్తిద్వారా సాధకుడి బుద్ధిని పవిత్రీకరించేదిగా వుంటుంది.
* మానవ జీవితంలో ఎదురయ్యే తీవ్ర బాధలకు వైదిక పరిహారాలను పాటించటం మోక్షసాధనకు అవరోధం అవుతుందా?
- రామారావు, కావలి
కాదు. అందుకనే మోక్షసాధన ప్రక్రియలకు ముందర శాంతి మంత్రాలను విస్తారంగా పఠించే విధి గూడా వుంది. అయితే కష్ట నివారణ అనే పేరుతో ప్రారంభించి, కామ్య కర్మలలోకి పడిపోతే మాత్రం మోక్షసాధనకు ప్రతిబంధకమే అవుతుంది.
****
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
పళజ్ఘూర్ఘ్పీజబఒళ్పూళ్పళజ్ఘూ.్య

కుప్పా వేంకట కృష్ణమూర్తి