ధర్మసందేహాలు

ధర్మసందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎవరైనా మరణించినప్పుడు వారి వారి వర్ణాన్ని బఠ్టి ఎన్ని రోజులు కర్మ చేయాలో తేడాలు ఉంటాయా? అందరూ హిందువులే కదా?
ఎ. భాస్కర రావు, సికిందరాబాదు
ఇలాంటి విషయాలలో ధర్మశాస్త్రాలు ఏమి చెప్పాయో దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి గానీ, మన తార్కికబుద్ధి ని బట్టికాదు. ఎందుకంటే శరీరాన్ని వదిలిన జీవాత్మ ల ప్రయాణ రీతి మన తర్కాన్ని బట్టి నడవదు. ఇలాంటి విషయాల్లో కేవలం శాస్త్ర వాక్యాలననుసరించి వెళ్లటమే ఉత్తమం.
* మరణానంతరానుభవాలపై కొందరు విదేశీయులు,పరిశోధనలు చేసి మన గరుడ పురాణాదులలో చెప్పిన విషయాలకు దగ్గరి విషయాలను చెబుతున్నారు. వీటిని మనం నమ్మవచ్చునా?
- బి. రాజేశ్వర మూర్తి, బందరు
మహర్షులు అతీంద్రియమైన విషయాలను తపోమయమైన దృష్టితో దర్శించి గరుడ పురాణాదులను మన మీద కరుణతో రచించారు. ఇక మానవులపరిశోధనలు ఎప్పుడు ఏ దోవన వెళ్తాయో చెప్పటం కష్టం. కనుక మనం మన మహర్షుల గ్రంథాల బాటలో నడవడమే ఉత్తమం.
* ఆంజనేయ,వేంకటేశ్వర, దేవీ కవచాలను పఠించడానికి అనుజ్ఞకావాలా? లేక ఉత్తిగనే చదువుకోవచ్చునా? - రామమోహన్ రావు, చిట్యాల
వాటిలో బీజాక్షరాలుగానీ, మూల మంత్రాలు గాని లేకుండా చేసి ఎవరికి వారే చదువుకోవ్చు. ఒకవేళ అలాంటి మంత్రాల భయం ఉంటే ఉపదేశం లేక అనుజ్ఞ అవసరవౌతుంది.
* కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నిలిచే భగవంతుడు మనలో ఈ తేడాలెందుకు పెట్టాడు? - కె. శ్రీనివాసులు , హైదరాబాదు
భగవంతుడు తాను దేనికీ కర్తను కాదని భగవద్గీతలో అనేకరీతులుగా వివరించాడు. జీవులలో వున్న భేదాలన్నీ అనేక కల్పాలుగా వారు పోగేసుకుంటూ వస్తున్న కర్మల ఫలితాలే. అందువల్లే సర్వసమానత్వం సాధ్యం కావటం లేదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org