మెయన్ ఫీచర్

మన పయనం ఎటువైపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర ఆలోచనలు కలిగిన, ఒకనాటి నిజమైన ఉదారవాది గురిం చి బహుశా నేటి తరంవారికి తెలియకపోవచ్చు. స్వేచ్ఛా విపణి అమలులో లేని నాటి రోజుల్లోనే ఆయన సరళీకృత విధానాల కోసం గట్టిగా మాట్లాడేవాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరు ఆయన ఇంటిపేరు ఒకటే. ఇంతకూ ఆయన పేరు పిలూ మోదీ- అద్భుతమైన హాస్యం పండించే రాజకీయవేత్త. ఆయన 1967లో గుజరాత్ లోని గోద్రా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 1971లో మళ్లీ పార్లమెంటుకు ఎన్నికయ్యారు కూడా. మరయితే ఈ దేశంలోని నేటి ప్రతి 3ఉదారవాది2 ఏ మతం పేరు చెబితే ఒంటికాలిమీద లేస్తారో, ద్వేషిస్తారో ఆ మతానికి చెందినవాడు మాత్రం కాదు! అవును..ఆయన పార్సీ మతం వాడు. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ, తనతో ఏకీభవించని ప్రతి ఒక్కరిని3సిఐఏ ఏజెంట్2 అంటూ ముద్ర వేసే కాలమది! ఒకనాడు పిలూ మోదీ పార్లమెంట్‌కు తన మెడలో ఒక ప్లకార్డును తగిలించుకొని హాజరయ్యా రు. ఇంతకూ ఆ ప్లకార్డుపై ఏమున్నదంటే నేనొక సిఐఎ ఏజెంట్‌ని! నాటి వ్యవస్థను వ్యంగ్యంగా2 విమర్శించడానికి, ఇందిరాగాంధీ నియంతృత్వ శైలి పాలనను వేలెత్తి చూపడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పడానికి ఈ ఉదంతం చాలు.
మరి నేడు బర్ఖాదత్, రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌లు తమను తాము 34దేశ వ్యతిరేకులుగా, కుహనా సెక్యులరిస్టులుగా, ఏకపక్ష సమర్ధకులుగా22 ప్రదర్శించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. పిలూ మో దీ మాదిరిగానే వీరు కూడా యాంకరింగ్ చేసేటప్పుడు 3దేశ-వ్యతిరేకులం2 అనే ప్లకార్డును ధరిస్తే బాగుంటుంది. మరివాళ్లకు ఆ పని చేయడానికి ధైర్యం చాలుతుందా? చాలదు! అందువల్ల వారాపని చేయలేరు. ప్రధానికి బహిరంగ లేఖలు రాయడానికి మాత్రం సిద్ధం. మరి ఈ ఉత్తరాల్లో ఏముంటుంది? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం చిమ్మే రాతలుంటాయి. పైగా హిందూత్వ శక్తులంటూ2పిచ్చి ప్రేలాపనలు! అన్నింటికీ మించిన విచిత్రమేమంటే ఈ బహిరంగ లేఖే ఫిబ్రవరి 20వ తేదీన ఎన్‌డిటివిలో రోజంతా ప్రముఖ కథనంగా ప్రసారం కావడం! ఒక యాంకర్ వ్యక్తిగత అభిప్రాయాలే ఒక వార్తగా చలామణి కావడమేం టి?
నేటి రోజుల్లో జర్నలిజంలో నైతికత పాటింపు ఏమాత్రం లేదన్నది సుస్పష్టం. ఇక వీరి ప్రధాన దృష్టి అంతా 3జాతీయత2 అనే పదం పైనే! ఒక కార్యకర్త కావడం పాపం కాదు! స్పందనాత్మక ప్రజాస్వామ్యానికి దేశం పట్ల, సమాజం పట్ల విశాలహితం, సానుకూల దృక్పథం కలిగిన కార్యకర్తలు అవసరం. అయితే సమస్య ఎక్కడ వస్తున్నదంటే, మీరు మీ వృత్తిని, ఆచరణతత్వంతో మమేకం చేయ డం వల్ల! ఈ ప్రక్రియలో మీరు మీ వృత్తికి, 3అజెండాకు ఒకేసారి న్యాయం చేయలేరు. ఇక్కడ మీ అజెండాను దాచ డం ద్వారా వీక్షకులను పిచ్చివాళ్లను చేస్తున్నారు. ఈ బహిరంగ లేఖ రాసినవారు తమను తాము తటస్థులమని ఏవిధంగా చెప్పుకోగలరు? వీరు తమ వ్యక్తిత్వాన్ని రెండు ముక్కలు చేయాలి. ఒకదాన్ని టెలివిజన్ తెరపైన ప్రదర్శించడానికి, రెండవదాన్ని ఆచరణశీలతకు పరిమితం చేయడానికి!
జెఎన్‌యులో జరిగిన గందరోగళం, మీడియాను అద్దంముందు నిలబెట్టింది. ముఖ్యంగా ఢిల్లీనుంచి పనిచేస్తున్న ఛానళ్లకు ఇది బాగా వర్తిస్తుంది. ఇక్కడి ఒక మీడియా గ్రూపు, జెఎన్‌యులో చోటు చేసుకున్న సంఘటనల్లోని దేశద్రోహ కోణాన్ని చూపగా, మరోగ్రూపు దీన్ని సంప్రదాయ వాదుల అసమ్మతి అంటూ తీర్పు చెప్పేసింది. ఈ రెండు మీడియా గ్రూపులు ఒకరి గుణదోషాలను మరొకరు ఎత్తిచూపడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. స్పష్టంగా చెప్పాలంటే మీడియా యుద్ధం2 కొనసాగిందనడం సముచితమేమో! ఇక్కడ దేశభక్తిని తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నవి ఒక గ్రూపు కాగా, రాజ్యాంగ భక్తిని ప్రదర్శించేది మరో గ్రూపు!
ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేమంటే, ఈ కుహనా పుర్రచేతి ఉదారవాదులు, జెఎన్‌యులో నినాదాలివ్వడం అభ్యంతరకరమనే చెబుతారు. ఇదే సమయంలో వీరిలో కొందరు, ఆవిధంగా నినాదాలు చేసిన విద్యార్థులపై ఏవిధమైన చర్యలు చేపట్టవద్దంటారు! వీరు ఇంకా ముందుకెళ్లి నిరసనను వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేశద్రోహకరమైన ప్రకటనలు చేయడం కూడా ఈ హక్కులో భాగమేనన్నది వీరి వాదన.
ఈ విద్యార్థులపై వచ్చిన దేశద్రోహం ఆరోపణలపై ఇప్పటికే నానా రభస అయింది. ముంబయి కార్టూనిస్టు, నక్సల్ సానుభూతి పరుడైన బినాయక్ దాస్‌పై, వేర్పాటు వాది అరుంధతీ రాయ్‌పై నాటి యుపీఏ ప్రభుత్వం నేరం మోపినప్పుడు, ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం హార్ధిక్ పటేల్‌పై నేరాభియోగం మోపినప్పుడు ఈ ఉదారవాదులంతా ఏం చేస్తున్నారు? ఈ విధంగా నేరం మోపబడిన వారికి భావప్రకటన స్వేచ్ఛ లేదా? ఆ మాటకొస్తే, అక్బరుద్దీన్ ఒవైసీ ఒక దేవదూత! ఘనత వహించిన ఈయనగారు కేవలం హిందువులను మాత్రమే బెదిరిస్తాడు! మరి ఈ విషయంలో ఉదారవాదుల అభిప్రాయమేం టి? భావప్రకటన స్వేచ్ఛ, దేశ వ్యతిరేక నినానాదాల గురించి ఒక పక్క సంక్షోభం చల్లారక ముందే, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి 3రెచ్చగొట్టే వ్యాఖ్యలపై2 విచారణ జరపమంటూ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశించడం కొసమెరుపు! తమ విద్యార్థుల భావప్రకటనా స్వేచ్ఛకోసం జెఎన్‌యు అధ్యాపకులు ఒకపక్క డి మాండ్ చేస్తున్నారు కదా! మరి అదే సు బ్రహ్మణ్యస్వామికి ఎందుకు వర్తించదు? రెచ్చగొట్టే ప్రసంగం చేశారన్న కారణంగా ఎన్‌ఎస్‌ఎ చట్టం కింద కమలేష్ తివారి ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం వీరి సరికొత్త రణ నినాదం ఏంటంటే..44‘అంతా భావ ప్రకటనా స్వేచ్ఛకోసం నిలబడి పోరాడాలి: లేకపోతే మనం దాన్ని కోల్పోతాం.’22 అంటే భారత రాజ్యాంగం కేవ లం జెఎన్‌యు విద్యార్థులకు మాత్రమే భావప్రకటనా స్వేచ్ఛ పరిమితమని చెప్పిందా?
జెఎన్‌యు వ్యవహారంలో మీడియా కూడా తప్పుడు వార్తలను ప్రసారం చేయడమో లేక కాంగ్రెస్-వామపక్ష బృందాలు చేసిన అబద్ధపు ప్రచారాన్ని రిపోర్ట్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించడమో చేశాయి. ఒక ఛానల్ ఐతే ఏకంగా.. కన్హయ్య కుమార్‌పై ఇష్టం వచ్చినట్టు దాడి చేయడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడని కూడా వార్తలను ప్రసారం చేసింది. అయి తే మెడికల్ రిపోర్టు మాత్రం కన్హయ్య కుమార్ ఎడమ కాలిపై, ముక్కుపై కమిలిన గుర్తులున్నాయని పేర్కొంది. పాటియాలా హౌజ్‌లో మొత్తం 200 మంది జర్నలిస్టులున్నారు. కన్హయ్యపై జరిగిన దాడి గురించి ఏ ఒక్కరూ అసలు జరిగిన వాస్తవాన్ని నివేదించడానికి ప్రయత్నించకపోవడం విచారకరం.
4సహనానికి అసహనానికి22మధ్య చర్చ కొనసాగుతున్న తరుణమిది. నిజానికి ఇది బిహార్ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా లిబరల్స్ ఒక పద్ధతి ప్రకారం రూపొందించిన నాటకం. ఎందుకంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎన్నికల బరిలోకి వెళ్లనున్న తరుణంలో ఈ ఉదారవాదులు అస మ్మతి హక్కు2అనే అంశాన్ని నెత్తికెత్తుకున్నారు. జెఎన్‌యు సమస్య కారణంగా వామపక్షాల్లో ఇప్పటికే వణుకు మొదలైంది. భారత్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐలు పాల్గొనడంతో, వామపక్షాల రాజకీయాల్లోని డొల్లతనం బట్టబయలైంది. వెంటనే సమస్యను పక్కదోవ పట్టించే రాజకీయ నేతలు రంగంలోకి దిగిపోయారు. అసలు సమస్య ‘‘జాతీయ వాదం, తీవ్ర జాతీయవాదం’’2మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణిస్తూ సరికొత్త పల్లవి ఎత్తుకున్నారు. అమాయకులైన విద్యార్థుల భావ ప్రకటనా స్వేచ్ఛ ను బలవంతంగా తొక్కిపెట్టడమే కాకుం డా ప్రభుత్వం వారిని 3జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి అణచివేయాలని చూస్తున్నదంటూ అడ్డంగా వాదించడం మొదలుపెట్టారు. అసలు జెఎన్‌యు విద్యార్థులంతా దేశ వ్యతిరేకులని ఎవ్వ రూ అనడం లేదు. దేశాన్ని ముక్కలు చేయాలంటూ నినాదాలిచ్చిన ఒక గ్రూపు విద్యార్థులపైన మాత్రమే చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని స్పష్టంగా నిర్వచించిన చట్టం ముందుకు వెళ్లడానికి వీరికి అడ్డొచ్చిన సమస్య ఏమి టో ఇప్పటికీ అర్థంకాదు!అన్నింటికన్నా దారుణమేమంటే కన్హయ్యను, గాంధీజీతో పోల్చడం! ఎందుకంటే ఇద్దరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కా వాలని కోరుకున్నారట! ఇంతకంటే దౌర్భా గ్యం మరోటి ఉంటుందా? అంటే వక్రబుద్ధి కలిగిన వీరి దృష్టిలో గాంధీజీ కూడా దేశద్రోహే నన్నమాట! మనం ఎటువైపు వెళుతున్నాం?