మెయన్ ఫీచర్

స్వతంత్ర స్వభావం సమకూరిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర విజయాన్ని ఆర్థిక ప్రగతితో ముడిపెట్టి నిర్ధారణలు చేయడం అంతర్జాతీయ రీతి. ఆర్థిక ప్రగతి మాత్రమే స్వాతంత్య్ర విజయానికి కొలమానం కాదు, కారాదు. అయినప్పటికీ ఏడు దశాబ్దులలో స్వతంత్ర భారత్ గణనీయమైన భౌతిక ప్రగతిని సాధించడం నిరాకరించలేని నిజం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఐదేళ్లకు క్రీస్తుశకం 1952-53వ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయం నాలుగువందల పంతొమ్మిది కోట్ల రూపాయలు, ఖర్చు నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ పరిమాణం దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు! ఎక్కడ 419 కోట్లు? ఎక్కడ 20,00,000 కోట్లు? ద్రవ్యోల్బణంతో సమతుల్యం చేసుకున్నప్పటికీ వాస్తవ ఆదాయం సైతం అనేక రెట్లు పెరిగింది. పాలపొడికోసం, పంచదారకోసం, చివరికి ఉల్లిపాయలకోసం, గోధుమలకోసం..అమెరికా వద్ద హాలెండ్ వద్ద చేయి చాచవలసి వచ్చిన దుస్థితి క్రీస్తుశకం 1960వ దశకం వరకు మనదేశానికి దాపురించింది. నేడు అనేక ప్రవర్థమాన దేశాలకు మనదేశం వేలకోట్ల రూపాయల సహాయం-ఋణం కాదు-అందజేస్తోంది. ఏడు దశాబ్దులలో దేశ జనాభా నాలుగింతలకు పైగా పెరిగినప్పటికీ ఆహార స్వయం సమృద్ధిని మనం సాధించగలిగాము..
ఈ భౌతిక ప్రగతి విజయంలో సగం మాత్ర మే! మన జాతీయ సంస్కారంతో ప్రపంచాన్ని ప్రభావితం చేయడం మరోసగం. ఈ ప్రభావం ప్రాబల్య వాంఛకాదు, ఇతర దేశాలను మన వలసలుగా మార్చుకోవాలన్న ఆధిపత్య కాంక్షకాదు. విశ్వవిజేత కావడం, ఇతర దేశాలను దోచుకోవడం అనాదిగా హైందవ జాతీయ స్వభావం కానే కాదు...విశ్వహితం మాత్రమే హైందవ జాతీయ స్వభావం. సంస్కారాల సమాహారం...యోగం అలాంటి సముత్కర్ష సం స్కారం. అంతర్జాతీయ యోగ దినోత్సవం అం దువల్ల విజయంలో మరోసగం. భౌతిక ప్రగతి, సాంస్కృతిక సుగతి స్వాతంత్య్ర రథానికి రెండు చక్రాలు. ఆకలి ఎరుగని సమాజం ఆచరించగల సమాజం భౌతిక ప్రగతికి ప్రమాణం..మానవుడు నిజమైన మానవుడుగా జీవించడం.. స్వయంగా సంస్కారవంతుడై సంస్కారాలను పంచిపెట్టడం సాంస్కృతిక సుగతి! సనాతనమైన భరతజాతి అనాదిగా ఈ రెండింటినీ ప్రస్ఫుటింపజేసింది. ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులు భరతభూమిపై విలసిల్లిన గురుకులాలలోని ఆచార్యులవద్ద సంస్కారాలను నేర్చుకొని వెళ్లారు. భారతజాతి శరణార్థులకు అన్నం పెట్టింది..ఆశ్రయం ఇచ్చిం ది. ఇతర జాతులను హత్యలు చేయని జాతి భరత జాతి...హత్యలు చేయడానికి పూనుకున్న విజాతులను సహస్రాబ్దులపాటు నిరోధించగలిగిన జాతి భరతజాతి. భారత జాతీయ స్వాతంత్య్రానికి భౌగోళిక సమగ్రతకు ఇది వౌలికమైన స్వభావం. ఇదీ యుగాలుగా భారతీయుల జీవనయోగం! అందువల్లనే హైందవజాతి అనాదిగా విశ్వగురువు కాగలిగింది. 1947 వరకు శతాబ్దులపాటు కొడిగట్టిన ఈ కరదీపిక మళ్లీ వెలుగుతోంది. ప్రపంచ ప్రశాంతికి యోగి దర్శనం చేస్తోంది..
పాడిపంటలు సహజమైన ప్రగ తి చిహ్నాలు, ఎందుకంటె మానవునికి కావలసిన సమస్త అవసరాలు పాడిపంటల ద్వారానే నెరవేరుతున్నాయి. అటవీ సంపద పాడిపంటలకు విస్తృతి... ఇదంతా అత్యంత సహజంగా అనాదిగా జరుగుతున్న ప్రక్రియ. ఈ ప్రక్రియకు ఆధారం భూమి, భూమిని ఆవహించి ఉన్న నీరు, నిప్పు, గాలి, నింగీ..అందువల్ల భూమి తల్లి అయింది. మాతృభూమి అయింది. జాతీయ జీవన సర్వస్వానికి మాతృభూమి ఆధారం, వౌలిక ప్రాతిపదిక, ఈ వాస్తవాన్ని గుర్తించడం జాతీయ నిష్ఠ. గుర్తించిన వారు జాతీయతానిష్ఠ కలవారు, గుర్తించలేనివారు, జాతీయతా నిష్ఠలేనివారు. స్వాతంత్య్ర పరిరక్షణకు ఇదీ కొలమానం. ఇదే దేశభక్తి. భూమిని ఇతరులు ఆక్రమించడంతో ఒక జాతి స్వాతంత్య్రాన్ని కోల్పోతుంది. ఇతరుల నుంచి భూమిని విముక్తం చేసుకొనడంతో జాతి మళ్లీ స్వాతంత్య్రం పొందుతోంది. అలా భరతజాతి క్రీస్తుశకం 1947 ఆగస్టు, 15వ తేదీన విముక్తిని పొందింది. ఈ విముక్తి కోసం వందల ఏళ్లపాటు మనం పోరాడ వలసి వచ్చింది. భౌతిక దాస్యం కంటె భావదాస్యం మరింత హేయమైంది, అవమానకరమైనది..
జిహాదీలు క్రీస్తుశకం 712 నుండి మన దేశానికి కబళించడం ఆరంభించారు. సమాంతరంగా మన స్వాతంత్య్రం నిలబెట్టుకొనడానికి పోరాటాన్ని ఆరంభించాము. ఇది మొదటిదశ, రెండవ దశలో మన స్వాతంత్య్రాన్ని హరించి మన జాతీయ సంస్కారాలను మట్టుపెట్టిన వారిపై జరిపిన పోరాటం.
* సృష్టిక్రమంలో సమన్వయం కలిగి ఉండడం మన జాతీయ సంస్కారం.
* వైవిధ్యాలను పరిరక్షించడం పెంపొందించడం మన జాతీయ సంస్కారం.
* భూమిని తల్లిగా భావించడం మన జాతీయ వౌలిక సంస్కారం, పంచభూతముల-నేల, నీరు, నిప్పు, గాలి, నింగి-సమాహారమైన ప్రకృతిని పూజించడం మన జాతీయ సంస్కారం.
* ఆవును అడవిని కాపాడడం ఆరాధించడం మన జాతీయ సంస్కారం..ఈ రెండూ అన్న ప్రదాతలు.
* ప్రపంచానికి అన్నం పెట్టడం, ఆదరించే ప్రవృత్తిని ప్రపంచ ప్రజలకు మప్పడం సనాతన హైందవ జాతీయ సంస్కారం.
విదేశీయుల దురాక్రణ సమయంలో ఈ సంస్కారాలన్నీ అడుగంటాయి. విదేశీయులు ధ్వంసం చేశారు. బ్రిటన్ వారి దురాక్రమణ ఈ విధ్వంసానికి పరాకాష్ఠ. అన్న ప్రదాత ఆకలికి ఆలవాలమైంది.
‘‘పనె్నండు దేశాలు
పండుచున్నాకాని
పట్టెడన్నమె
లోపమండీ
ఉప్పు ముట్టుకుంటే
దోసమండి..అయ్యొ
కుక్కలతో పోరాడి
కూడు తింటామండి..
మాకొద్దీ తెల్లదొరతనము!’’
అన్న గరిమెళ్ల సత్యనారాయణ వివరణ బ్రిటిష్ వారు సాగించిన ఆర్థికపరమైన దోపిడీకి నిదర్శనం. గరిమెళ్ల సత్యనారాయణ బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర యోధుడు, కవి! మన అడవులను నరికివేసి కలపను తరలించుకొని పోయిన గజదొంగలు బ్రిటన్‌వారు. మన సాంస్కృతిక సంపదను బ్రిటన్ దుండగులు చెరచిన తీరు కూడ గరిమెళ్ల సత్యనారాయణ వివరించి ఉన్నాడు..
‘‘మాచూడి ఆవుల కడుపు
వేడివేడి మాంసం
వాడికి బహు ఇష్టమంట
మా పాడి పశువుల
కోస్తాడంట..
మా బతుకు పాడు
చేస్తాడంట..
మా చూడి ఆవుల మంద
సురిగి ఇంటికి రాదు..
మాకొద్దీ తెల్లదొరతనము
దేవ! మాకొద్దీ తెల్లదొరతనము..’’
శతాబ్దుల స్వాతంత్య్ర సమరంలో చివరిఘట్టం ఛత్రపతి శివాజీ నాయకత్వంలో మొదలెత్తిన పోరాటం. సంస్కారాల పునరుద్ధరణ నిజమైన స్వాతంత్య్రం. ఇదీ ఛత్రపతి శివాజీ పోరాటానికి ప్రాతిపదిక. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం చివరి ఘట్టం. ఈ సుదీర్ఘమైన పోరాటంలో అసంఖ్యాక ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు. 1943లో నేతాజీ తొలి స్వతంత్ర భారత ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అందువల్ల సుభాష్ చంద్రబోస్ బ్రిటన్ దాస్యముక్త స్వతంత్ర భారత దేశానికి తొలి ప్రభుత్వ అధినేత, ప్రథమ ప్రధానమంత్రి. మహాకవి గుఱ్ఱం జాషువా వివరించినట్టుగా.. సుభాష్ చంద్రుడు..
‘‘కత్తుల్ పట్టక స్వేచ్ఛరాదెపుడు
చర్ఖా పద్ధతుల్ పూర్తిగా
చితె్తైపోవునటంచు గాంధిమునితో
సిద్ధాంతమున్ చేసి, భూ
భృత్తుల్ తెల్లని చక్రవర్తులు
భయాప్తిన్ క్రుంగి కంగారుగాన్
ఎత్తించెన్ ఎవరెస్టు నెత్తములపై
హిందూ రణ స్తంభమున్..’’
ఈ మన భూమిని బ్రిటన్ దురాక్రమణ దారు లు కాజేయడం దాస్యం. ఈ మన భూమిపై వికసించిన సంస్కారాలను పాశ్చాత్యులు చెరపివేయడం దాస్యం..్భమిని మనం తిరిగి పొం దాము. సంస్కారాలను సైతం పునరుద్ధరించుకొనడం భావదాస్య విముక్తికి మార్గం. భూమి జాతీయ స్వరూపం. మాతృభూమిపై వికసించిన సంస్కృతి జాతీయ స్వభావం.
మనకు స్వరూప స్వాతంత్య్రం సిద్ధించింది. స్వభావ స్వాతంత్య్రం వచ్చిందా? అన్నది జాతీయ ఆత్మ మథనకు హేతువు అవుతున్న ప్రశ్న. మన జాతీయ సంస్కృతి అనాదిగా సంస్కృత భాష మాధ్యమంగా వికసించింది. పరిమళించింది. వైవిధ్యాల భారత్ అనాదిగా ఒకే జాతిగా ఉంది. ఈ వైవిధ్యాల మధ్య నిహితమై ఉన్న ఏకాత్మత ఇందుకు ఏకైక కారణం. భాషలు, మతాలు వేష భూషణాలు ఆహారాలు ఆలోచనలు, ఆచారాలు సంప్రదాయాలు- ఇవన్నీ అనేక వైవిధ్యాలు. ఈ వైవిధ్యాలన్నీ ఒకే సంస్కృతిలో భాగం కావడం మన జాతీయ ఏకాత్మకు ప్రతీక..ఈ అద్వితీయ సంస్కృతి సంస్కృత భాష మాధ్యమంగా ప్రస్ఫుటించింది. అన్ని భారతీయ భాషలకూ తల్లి భాష సంస్కృతం.. బ్రిటన్ నుంచి వచ్చిన దురాక్రమణ దారులు సంస్కృత భాషను తొలగించి ఆంగ్లభాషను ప్రవేశపెట్టారు. సంస్కృతంలో జరిపిన కార్యకలాపాలు మొత్తం ఆంగ్లంలో జరగడం ఆరంభమైంది. భారతీయులు భారతీయ స్వభావాన్ని కోల్పోయారు.. ‘‘జయ్ జయ్’’ అన్న నోళ్లు ‘‘బయ్ బయ్’’ అన్న అర్థం లేని పలుకులను పలికాయి. అందువల్లనే స్వాతంత్య్రం సమగ్రం కావడానికి వీలుగా సంస్కృత భాషను అనుసంధాన భాషగా, ఉన్నత విద్యాబోధనకు మాధ్య మ భాషగా మళ్లీ పునరుద్ధరించాలని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1947, 1950వ సంవత్సరాల మధ్య కోరి ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత చెప్పిన హితవును పాటించి ఉంటే ఈపాటికి మనం స్వభావ స్వాతంత్య్రాన్ని కూడ పొంది ఉండేవారం. ‘‘బయ్ బయ్’’ అంటున్న నోళ్లు ‘‘జయ్ జయ్..’’ అని నినదిస్తూ ఉండేవి. ‘‘మమీ డాడీలు’’ నిష్క్రమించి ‘‘అమ్మానాన్నలు’’ మళ్లీ మన ఇళ్లలో వినపడేవారు, కనబడేవారు. ఈదిశగా ఇప్పుడైనా కృషి మొదలు కావాలి. స్వరూప విముక్తితో పాటు స్వభావ విముక్తి నిజమైన సమగ్ర స్వాతంత్య్రం. మహాకవి కరుణశ్రీ తిలకించిన జాతీయ వైభవం అప్పుడు మళ్లీ సభ తీరుతుంది.
ఆయన తిలకించింది ఇదీ...
‘‘అచ్చపు చీకటిండ్ల పొర
లాడుచు నుండ ప్రపంచమెల్ల, ఈ
పచ్చని తల్లి గుమ్మములపై
వెలిగెన్ మణిదీపముల్, కనన్
వచ్చిన ఖండ ఖండములవారికి
కోరిక తీరునట్టుగా
బిచ్చము పెట్టె ‘్భరత సవిత్రి’
ప్రియంబున రెండు చేతులన్’’

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352