మెయన్ ఫీచర్

‘ప్రపంచీకరణ’ బంధంలో కుక్కపిల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండు దేశాలు
ఎండుచున్నాగాని
పట్టడన్నమె
లోపమండి, ఉప్పు
ముట్టుకుంటె దోషమండి!
నోట మట్టికొట్టి
పోతాడండి, అయ్యో..
కుక్కలతో పోరాడి
కూడు తింటామండి
మాకొద్దీ తెల్ల దొరతనము..
-అని బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరం సాగిన సమయంలో ప్రముఖ కవి గరిమెళ్ల సత్యనారాయణ దేశవాసుల దుస్థితిని వివరించాడు. విదేశీయులు శతాబ్దుల తరబడి దోపిడీ చేసిన ఫలితంగా క్రీస్తుశకం ఇరవయ్యవ శతాబ్ది ఆరంభం నాటికి మనకు ‘కుక్కలతో పోరాడి కూడు తినవలసిన’ గతి పట్టింది. అంటే దారిద్య్రం తాండవించింది. అనాదిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రేమతో ‘బిచ్చము’ పెట్టిన జాతి మనది. అలా పెట్టిన సమయంలో మనం కుక్కలకు ‘బలిహరణం’ పెట్టాము! హైందవ జాతీయ సంస్కృతి నిబద్ధులైన మానవులు ప్రతిరోజూ ‘్భతయజ్ఞం’ చేసిన తరువాతనే తాము భుజించాలి! భూతయజ్ఞమంటే మానవేతర ప్రాణులకు తిండిపెట్టడం. పిచ్చుకలకు కాని, చేపలకు కాని, పావురాలకు గాని, పక్షులకు గాని పిడికెడు బియ్యం, గింజలు వేయడం భూతయజ్ఞం. అయితే రోజూ వండిన పదార్థాలు సృష్టికర్తకు నివేదించిన తరువాత ‘బలిహరణము’గా కుక్కకు కొంత భాగం పెట్టడం భూత యజ్ఞానికి పూర్ణాహుతి! ధర్మశాస్తబ్రద్ధమైన ఈ పరంపర బ్రిటన్ వాణిజ్య బీభత్సకారులు మన దేశాన్ని పూర్తిగా దోచుకునేవరకు కొనసాగింది. బ్రిటన్ దుండగుల ప్రభావం మన సంస్కృతిని ధ్వంసం చేసింది, ఇంకా చేస్తోంది.. దేశంలో సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 17న చేసిన మానవీయ వ్యాఖ్యలకు ఈ దుస్థితి నేపథ్యం..
ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- బ్రిటన్ వాణిజ్య బీభత్సకాండకు విస్తృతమైన కొనసాగింపు. మన జీవన విధానం ప్రతి అంశం వీదేశీయ భావజాలగ్రస్తం అయిపోవడం ప్రపంచీకరణ విషప్రభావం! క్యూబా దేశానికి దశాబ్దుల తరబడి అధినేతగా ఉండిన ఫైడల్ కాస్ట్రో యువకుడిగా ఉన్నప్పుడు గురి చూసి కాల్చడం నేర్చుకునేవాడట! ఆవులను గురిచూసి కాల్చడం ద్వారా అనేక ఆవులను అతగాడు హత్యచేయడం చరిత్ర.. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లోని మానవులను శతాబ్దులపాటు వేటాడి చంపిన ఐరోపావారు ఆవులను, కుక్కలను హత్యచేయడం ఆశ్చర్యం కాదు. ఇపుడు అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లోని అత్యధికులు ఐరోపా సంతతివారు! ‘క్యూబా’ అమెరికా ఖండంలో ఉంది! ‘ప్రపంచీకరణ’ క్రీస్తుశకం పదహైదవ, పదహారవ శతాబ్దుల నుండి సాగిన ‘ఐరోపా జాతుల’ దోపిడీకి మరింత విస్తృతి! ఈ దోపిడీ సాంస్కృతికమైనది, భౌతికమైనది. సాంస్కృతికంగా దోపిడీ గురై మతులను పోగొట్టుకున్న మనవారు ఐరోపాను, అమెరికాను క్షణం క్షణం అనుకరిస్తున్నారు. వీధిలో వెడుతున్న మనకు ఓ కుక్క ఎదురు వస్తూ ఉంటుంది! అది కుక్కా లేక కుక్కపిల్లా లేక చిన్నపాటి తోడేలా, నాలుగు కాళ్ల గుడ్లగూబా అని మనకు సందేహం రాక తప్పదు! ఎందుకంటే పిల్లి, పంది, గాడిద, ఎలుగుబంటి, కోతి వంటి నానా జంతువుల ముఖాలన్నింటి సంకరమైన అత్యంత వికృతమైన ముఖం ఆ కుక్కది! దాని మెడకున్న పట్టెడకు అనుసంధానమై ఉన్న గొలుసును పట్టుకున్న పెద్ద మనిషి అమెరికా జాతీయ పతాకం ముద్రించి ఉన్న పొట్టి చొక్కా వేసుకొని ఉంటాడు. మోకాళ్లకు బర్ముడా తగిలించుకొని కుక్కతోపాటు కులుకుతూ నడుస్తుంటాడు. ఎదురైన వారు-‘ఏమండీ.. ఇది..’ అని మధ్యలో ఆగిపోతారు! కుక్క కామందు మధ్యలోనే అందుకొని- ‘అవునండీ.. ఇది ఫ్రెంచ్ బ్రీడ్..’ అని గర్వంగా చెబుతాడు. అది ఫ్రాన్స్ దేశపు కుక్క కావడం ఆయనకు గర్వకారణం. ‘ఎంతండీ దీని వెల?’ అన్న ప్రశ్నకు ‘35 వేల రూపాయలు..’ అన్నది సమాధానం. ఇలా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఖరీదైన కుక్కలకు రెండు లక్షల రూపాయల వరకూ కూడా ఖర్చుపెట్టి కొనేస్తున్న ‘విశ్వనరులు’ మన దేశంలో ఉన్నారట!
‘ప్రపంచీకరణ’ అంటే మన దేశంలోని ‘సమస్త స్వజాతీయత’ నశించిపోవాలి. సమస్త వస్తువులు, జీవన పద్ధతులు విదేశాల నుంచి దిగుమతి కావాలి! అందువల్ల మన దేశంలోని ‘కుక్కలు’ సైతం మన వారికి నచ్చడంలేదు. ‘కారు’, ‘టాక్సీ’ అన్న ఆంగ్లపదాలు భాషకు సంబంధించినవి. ‘క్యాబ్’ అన్నది ‘ప్రపంచీకరణ’కు సంబంధించిన పదజాలంలో భాగం. ‘ప్రపంచీకరణ’ పేరుతో ‘అమెరికా జాతీయత’ మన నెత్తికెక్కి తొక్కుతోంది! అమెరికా జాతి ఐరోపా సంతతి! ప్రముఖ ఆంగ్ల రచయిత రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ ‘అత్తిలా’ అన్న కుక్క కథ వ్రాశాడు. ఇది 1950వ దశకం నాటి మాట! మైసూరు లేదా ‘మాల్‌గుడి’లోని ఒక కుటుంబంవారు తమ ‘కుక్క’కు ‘అత్తిలా’ అని పేరు పెట్టుకుంటారు. ‘అత్తిలా’ శునక బాలకుడు భారతీయుడు, పేరు మాత్రం విదేశీయమైనది. అదీ మన వారి ‘మోజు’.. క్రీస్తుశకం ఐదవ శతాబ్దినాటి ‘అత్తిలా’ లేదా ‘అట్టిలా’ అనే వాడు పరమ కిరాతకుడు, హూణుడు. తన అన్న ‘మ్లేడా’ అనే వాడితో కలిసి ఐరోపాలోను, మధ్య ఆసియాలోను భయంకర రక్తపాతం సృష్టించాడు. రోము జాతీయులను, జాతీయ నాగరికతను ధ్వంసం చేశాడు. రోము ప్రజలకు ‘అత్తిలా’ అంటే సింహస్వప్నం.. అన్నను సైతం హత్యచేసిన ‘అత్తిలా’ను ఆ తరువాత అతని భార్య స్వయంగా చంపేసింది. ‘అత్తిలా’కుండిన అనేక భార్యలలో ఆ ‘హంతకి’ ఒకతె. పెళ్లాడిన రోజునే శోభనం గదిలోనే ‘అత్తిలా’ను ఆమె తుదముట్టించింది! అలాంటి విదేశీయ రాక్షసుని పేరు తమ ‘కుక్క’కు పెట్టడం 1950వ దశకంలో మనవారికి గొప్ప విషయమైందని ప్రఖ్యాత రచయిత ఆర్.కె.నారాయణ్ ఎద్దేవాచేశాడు! అప్పుడు పేర్లు మాత్రమే విదేశీయమైనవి, ఇపుడు ఏకంగా కుక్కలే విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇదీ ప్రపంచీకరణ...
ఇలా వేలు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి విదేశీయ జాతుల కుక్కలను పోషిస్తున్నవారు వీధికుక్కలను మాత్రం చంపేయాలని వేల నోళ్ళతో ఘోషిస్తున్నారు. కేరళలో వీధి కుక్కలను విచక్షణా రహితంగా హత్యచేస్తుండడం సర్వోన్నత న్యాయస్థానం వారి దృష్టిని ఆకర్షించింది! కేరళలో జరిగిపోతున్న శునక హననం తమకు విస్మయం కలిగిస్తున్నదని సర్వోన్నత న్యాయమూర్తులు ప్రకటించారు. వీధి కుక్కలపై మానవీయమైన, మానవ సహజమైన దయాదాక్షిణ్యాలు చూపాలని గంతంలో సైతం సర్వోన్నత న్యాయస్థానం వారు చెప్పి ఉన్నారు. వీధి కుక్కలను హత్యాకాండ నుండి కాపాడడానికి తెలుగు రాష్ట్రాలలోను, ఇతర రాష్ట్రాలలోను స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ‘్భగ్యనగరం’లో శునక సంరక్షక దళాల వారు తరచూ ప్రదర్శనలు, సహానుభూతి యాత్రలు చేస్తూన్నారు. వీధికుక్కలను తలలపై మోది హింసించి చంపరాదని, వాటికి సంతాన నిరోధక శస్తచ్రికిత్సలు చేసి వదలిపెట్టాలని ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానం అనేకసార్లు స్పష్టంచేశాయి. కానీ, వీధికుక్కలను నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలపాలు చేసి హతమార్చే ప్రక్రియ నగరాలలో, పట్టణాలలో కొనసాగుతూనే ఉంది. కేరళలో పురపాలక, నగర పాలక సంస్థల ఉద్యోగులు మాత్రమే కాక ప్రభుత్వేతర సంస్థలు కూడా రంగప్రవేశం చేసి ‘కుక్క’ కనిపిస్తే చాలు కాల్చివేస్తున్నారట! చిన్నపిల్లలకు సైతం గాలి తుపాకులు- ఎయిర్‌గన్స్‌నిచ్చి వాటితో వీధికుక్కలను వేటాడమని పురికొల్పుతున్నారట!! ఈ సరికొత్త ‘రక్తపాతం’ సర్వోన్నత న్యాయస్థానం వారిని కలవరపరిచింది. హృదయమున్న మానవులను కలవరపరుస్తోంది...
వీధికుక్కలు కరవవు, కేవలం అరుస్తాయి, తరుముతాయి. నిలబడి ఎదిరిస్తే భయపడి తోకముడిచి మొరుగుతూ దూరంగా వెళ్లిపోతాయి. కానీ భయపడి పరిగెత్తినవారు అనేక భ్రమలకు గురై, ఆ భ్రమలను ప్రచారం చేస్తున్నారు! వివేకానంద స్వామి కూడా ఇలాంటి భ్రమలకు లోనుకావద్దని వివరించి ఉన్నాడు! పెంపుడు కుక్కలు మాత్రమే కొత్తవారిని కరుస్తాయి. వీధికుక్కలు ఎవ్వరినీ కరవవు! ఇది శాస్త్ర నిర్థారిత నిజం! ప్రాకృతిక సత్యం! పిచ్చిపట్టిన వీధికుక్క మాత్రమే కరుస్తుంది! కుక్కకు పిచ్చిపట్టేది కేవలం తొలకరి- ముంగారు వానలు కురిసినప్పుడు మాత్రమే! పదివేల పిచ్చికుక్కలలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబయి తొమ్మిది ఇలా ముంగారు వానలలో తడిసినవే! ప్రతి పాకృతిక నియమానికి అవరోధం ఉండవచ్చు! తొలి కంటె ముందు, మకర సంక్రాంతి తరువాత అకాల వర్షం పడితే ఆ వర్షంలో తడిసిన కుక్కలలో కూడా కొన్నిటికి పిచ్చిపడుతుంది! ఏమయినప్పటికీ లక్ష కుక్కలలో ఒకటి, రెండు మాత్రమే ‘పిచ్చి’కి గురి అవుతున్నాయి. ఇతరులు చంపినా, చంపకపోయినా అలాంటి ‘పిచ్చికుక్కలు’ ఎక్కువ కాలం బతకవు! పిచ్చెక్కిన తరువాత వారం రోజులలోనే ఆ కుక్క చనిపోతుంది! ఇలాంటి ఒకటి, రెండు పిచ్చికుక్కల ప్రమాదం పేరుతో నిరపాయకరమైన, వీధులలో ఓ పక్కగా ముచ్చటగా చుట్ట చుట్టుకొని పడుకుని ఉన్న వేలాది కుక్కలను హత్యచేయడం అవసరమా? ‘‘నితతాంతా పారభూతదయ’’ సనాతన సంస్కృతి బద్ధుల ప్రధాన లక్షణం! కుక్కల పట్ల మాత్రం దయ ఎందుకని చూపరాదు?
కవిత్వానికి అర్థం కానిది సృష్టిలో లేదని శతాబ్దుల క్రితం ‘లక్షణగ్రంథ’కర్త ఆనంద వర్థనుడు చెప్పాడు. ఐదువేల ఏళ్ల క్రితం కృష్ణద్వైపాయన వ్యాసుడు తన మహాభారత ఇతిహాస కావ్యాన్ని ‘కుక్కపిల్ల’ కథతో ఆరంభించాడు. ‘కుక్కపిల్ల’ కథతోనే పరిసమాప్తి చేశాడు. ఈ కథను తెలుగులో నన్నయభట్టు వెయ్యేళ్ళకు పూర్వం చెప్పాడు. తరువాత తిక్కన సోమయాజి వివరించాడు. జనమేజయుని యజ్ఞవాటికలో ‘సారమేయుడు’ అన్న శునక బాలకుణ్ని- కుక్క పిల్లను- ఆయన తమ్ములు తాడించారు. ఆ కుక్కపిల్ల వెళ్లి తన తల్లికి ఫిర్యాదు చేయగా, ఆ శునకమాత ‘సరమ’ నేరుగా జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్లి ఆయనను నిలదీసింది! ‘నా కుమారుడిని నీ తమ్ముళ్లు ఎందుకు కొట్టారు..?’ అన్నది తల్లికుక్క అడిగిన ప్రశ్న! నన్నయభట్టు ఈ ‘కంద’ పద్యంలో ‘సరమ’ మాటలను ఇలా చెప్పాడు!
‘తగునిది తగదిది అని యెద
వగవక సాధులకు పేదవారికి నెగ్గుల్
మొగిసేయు దుర్వినీతుల
కగు, అని మిత్తాగమంబులయిన భయంబుల్’
అన్న ‘సరమ’ హెచ్చరికతో ‘మహాభారతం’ మొదలైంది. ధర్మరాజు వెంట కుక్కపిల్ల స్వర్గం వైపుగా నడవడం ‘మహాభారత’ పరిసమాప్తి.. మనం ఈ సంస్కృతికి వారసులం!!

-హెబ్బార్ నాగేశ్వరరావు 99510 38352