రంగారెడ్డి

ప్రతి ఉద్యోగి నిజాయితీగా మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 5: అభివృద్ధి చెందిన దేశాలలో ప్రథమంగా నిలుస్తున్న మన దేశంలో అవినీతి రుగ్మత దేశాభ్యున్నతికి కళంకంగా దాపురించిందని రంగారెడ్డి జిల్లా ఏసిబి డిఎస్పీ ప్రభాకర్ పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో అవినీతి లంచగొండితనం ప్రథమంగా నిలుస్తుందని అన్నారు. ఈనెల 9న ప్రపంచ అవినీతి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 నుంచి రాష్ట్రంలో అవినీతి నిర్మూలన వారోత్సవాలు చేపట్టామన్నారు. దేశంలో అవినీతిని సాధ్యమైనంత వరకు నియంత్రించడం మన కర్తవ్యమని, లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం అంతే నేరమని వివరించారు. దేశంలో ప్రతి శాఖలో లంచాలు లేకుండా పనులు జరగవనే దానిపై యువతలో, ప్రజల్లో చైతన్యం రావాలని, ప్రశ్నించే తత్వం ఏర్పడాలన్నారు. లంచం ఇవ్వనిదే పనులు జరగవనే ఆలోచనను ప్రజలు వదులుకోవాలని ఆయన సూచించారు. సదస్సు 9 వరకు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఏసిబి టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు, తన సెల్ నెం.9440446940కి సమాచారం అందించాలని కోరారు.
అవినీతి నిరోధక శాఖ రాష్టస్థ్రాయిలో ఒక అటామిక్ పవర్ కలిగిన దర్యాప్తు సంస్థ అని ప్రభాకర్ అన్నారు. తమ పరిధిలో రాష్ట్రంలోని అన్ని శాఖలు, విభాగాలు ఉద్యోగుల అవినీతి, లంచగొండితనంపై కేసులు నమోదుచేసి, దర్యాప్తు చేస్తామని ఆయన విలేకరులతో అన్నారు. ప్రభుత్వపరంగా సేవలందించే ప్రతి పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు తమ శాఖ పరిధిలోకి వస్తారని వివరించారు. ఏసిబి రెండు రకాల విధులు నిర్వహిస్తుందని- ఒకటి- లంచాలు డిమాండ్ చేసే ఉద్యోగులు, తీసుకునేవారిపై వ్యక్తులు, బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా నిందితులను ప్రత్యక్షంగా పట్టుకుంటామన్నారు. రెండవ విధానంలో ప్రభుత్వ వేతనాలు పొందుతూ తమ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారిని తమ పరిశీలన, దర్యాప్తుతో పట్టుకుంటామని చెప్పారు.