ఫోకస్

హేతుబద్ధత ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో తలసరి ఆదాయం లెక్కింపులో శాస్ర్తియత లేదు. దీనికి కారణం మన సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులే. నెలకు ఒకరి ఆదాయం వెయ్యి రూపాయలు, మరొకరి ఆదాయం 10 వేలు, ఇంకొకరి ఆదాయం లక్ష రూపాయలు, మరొకరి ఆదాయం కోటి రూపాయలు ఉంటే వీరందరి ఆదాయాన్ని కలిపి తలసరి ఆదాయంగా లెక్కవేస్తున్నారు. లెక్కల వరకు ఇది బాగానే ఉంటుంది. అయితే నెలకు వెయ్యి రూపాయల ఆదాయం ఉండేవారి జీవితం, కోటి రూపాయలు ఉండేవారి జీవితం ఒకే విధంగా ఉంటుందా? లేదు కదా! తలసరి ఆదాయం లెక్కించి, తలసరి ఆదాయం ఏటా లక్ష రూపాయలుగా ఉంది, ప్రజలంతా బాగానే ఉన్నారు.. అందరూ బాగా జీవిస్తున్నారు అని అనుకోవడం తప్పు. ఢిల్లీలోని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (సిఎస్‌ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016-17లో జాతీయ స్థాయి లో తలసరి ఆదాయం 1,03,007 రూపాయలు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. తెలంగాణ విషయానికి వస్తే 2016-17లో తలసరి ఆదాయం 1,58,360 రూపాయలని తేలింది. అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే 55 వేల రూపాయలు ఎక్కువ. అంతకుముందు సంవత్సరం కంటే తెలంగాణలో 2016-17 లో తలసరి ఆదాయం 18వేల రూపాయలు అధికంగా ఉంది. తెలంగాణలో జిఎస్‌డిపి 6,54,294కోట్ల రూపాయలు. వాస్తవంగా ఈ లెక్కలు కళ్లుతిరిగేలా ఉన్నాయి. మరి ఈ సంపద అంతా ఎవరి వద్ద ఉంది? అని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మొత్తం సంపద ధనికుల వద్ద పోగవుతోంది. 1000 రూపాయల పెట్టుబడి పెట్టి చేసే పారిశ్రామిక ఉత్పత్తిని 10వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే రైతు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే 1100 రూపాయలు కూడా రావడం లేదు. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు కావాలంటూ పాలకులు ప్రణాళికలు రూపొందించారు. పారిశ్రామిక, సేవారంగం పెట్టుబడులు ఏడాదిలో రెట్టింపు అవుతుంటే రైతుల ఆదాయం ఐదేళ్ల తర్వాత రెట్టింపు కావాలంటూ ప్రణాళికలు రూపొందించడంలో ఔచిత్యం లేదనిపిస్తోంది. పారిశ్రామికవేత్తలకు కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం దాని గురించి ప్రచారం చేసుకోదు. రైతులకు పదిరూపాయలు ఇస్తే వంద రూపాయల ప్రచారం చేసుకుంటోంది. ఇది సరైన విధానం కాదు. ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మనం సాధించింది ఏమిటీ అని ప్రశ్నించుకుంటే, ధనికులు మరింత ధనికులు అయ్యారు.. పేదలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇక్కడ కార్మికులు, కర్షకుల (రైతుల) దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీని అరికట్టాలి. పంటలకు ప్రభుత్వం ఏ విధంగా ధర నిర్ణయిస్తుందో పారిశ్రామిక ఉత్పత్తులకు, సేవారంగాలకు కూడా అదే విధంగా ధరలు నిర్ణయించాలి. అప్పుడే సమానత్వం సాధించేందుకు వీలవుతుంది.
- కె. శ్రీనివాసరావు ఆర్థిక విశే్లషకుడు