మీకు తెలుసా ?

ఫుట్‌బాల్ సైజులో ఉండే కళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఇప్పటికీ మిస్టరీగా ఉన్న జెయింట్ స్క్విడ్స్ సజీవంగా కన్పించినది 2004లో మాత్రమే. తొలిసారి దానిని జపాన్ పరిశోధకులు చూశారు. 2006లో తొలిసారిగా దాని కదలికలను వీడియో తీయగలిగారు. అంతకుమించి దాని గురించి వారికి తెలిసింది చాలా తక్కువే. వాటి కళేబరాలు, మృతదేహాలు, శిలాజాల ఆధారంగా మాత్రమే కొన్ని విషయాలను కనుగొన్నారు. వీటి పొడవు కనీసం 50 అడుగులు ఉంటుంది. దాదాపు టన్ను బరువుంటుంది. వీటి కళ్లు 11 అంగుళాల వ్యాసార్థంతో భయపెట్టేవిగా ఉంటాయి. వీటి కళ్లలో కనుపాప నల్లగా ఉన్నా చుట్టూ ఉండే తెల్లటిగుడ్డులో అంతా నీరే ఉంటుంది. అవి మరణించాక ఆ నీళ్లు బయటికి వచ్చి, కళ్లు ప్లాస్టిక్ బ్యాగ్స్ మాదిరిగా కుచించుకుపోయి, శరీరంనుంచి విడిపోయి బయటకు వచ్చేస్తాయి. వీటికి పది టెంటకిల్స్ ఉంటాయి. ఇవి వాటి శరీరంకన్నా పొడవుగా ఉంటాయి. వాటిలో రెండు ఆహారాన్ని పట్టుకుని ముక్కులాంటి నోటికి అందిస్తాయి. వీటి ముక్కు చిలకముక్కులా గట్టిగా, వంకర తిరిగి ఉంటుంది. అన్నట్లు వీటికి మూడు గుండెలుంటాయి. ఇది వెనక్కు, ముందుకు ఈదగలదు. సముద్ర అడుగున ఇవి ఉండటంవల్ల వీటిగురించి ఏమీ తెలియడం లేదు.

కళ్లతో భయపెట్టే కప్పలు
జీవితాంతం చెట్లపై జీవించే ఈ ఎర్రకళ్ల ట్రీ ఫ్రాగ్స్ శత్రువులను భలే ఏమారుస్తాయి. పగలంతా ఆకుల అడుగున, కొమ్మలమాటున నక్కి ఉంటాయి. వీటి కళ్లు ఎర్రగాను, శరీరం పైభాగం ఆకుపచ్చగానూ, కాళ్లు, తొడలు, ఉదరం నీలంగాను, పాదాలు ఎర్రగాను ఉంటాయి. పగటిపూట కళ్లు మూసుకుని, కాళ్లు ముడుచుకుని ఆకుల్లో ఆకుగా మారిపోయి ఉంటాయి. ఒకవేళ ప్రమాదం పొంచి ఉందని, శత్రువు దగ్గర్లో ఉన్నట్లు అనుమానం వస్తే ఒక్కసారి ఎర్రటి కళ్లను తెరిచి, మిటకరించి చూస్తూ శరీరాన్ని ఉబ్బరించి, కాళ్లు చాపి నిల్చుంటాయి. హఠాత్తుగా ఇలా కన్పించేసరికి శత్రువు కొద్దిసేపు తత్తరపడుతుంది. ఈలోగా ఆ కప్ప చటుక్కున వేరే ప్రాంతానికి గెంతి తప్పించుకుంటుంది. అమెరికాలో ఇవి కన్పిస్తున్నా భూమీదకు ఇవి వచ్చి పదికోట్ల సంవత్సరాలపైనే అయింది.

ప్రేమకు..కోక్‌కు లింక్ ఉందా?
చాక్‌లెట్ తయారీకి కావలసిన కోక్ కాయలకు, ప్రేమకు సంబంధం ఉందా అంటే ప్రత్యక్షసంబంధం లేదనే చెప్పాలి. కానీ మనిషి ప్రేమలో పడ్డప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనం ‘్ఫనైలథిలోమైన్’ కోకా బీన్స్‌లోనూ ఉంది. చెట్టు బెరడు, కాండానికి వేళ్లాడుతూ అందమైన రంగుల్లో కన్పించే కోక్ కాయలు విప్పితే సీతాఫలం గుజ్జులాంటి గుజ్జు, అందులో కోక్‌బీన్స్ కన్పిస్తాయి. ఈ గుజ్జు తియ్యగా ఉంటుంది. గింజలుమాత్రం చేదుగా ఉంటాయి. వీటిని వేయించి పొడి చేసి చాక్‌లెట్స్ తయారీకి వినియోగిస్తారు. ఒక కోక్‌కాయలో దాదాపు 40నుంచి 50 కోక్‌బీన్స్ ఉంటాయి. వీటితో 6 మిల్క్ చాక్‌లెట్స్ లేదా 2 డార్క్ చాక్‌లెట్స్ తయారు చేయవచ్చట. చాక్‌లెట్స్ వినియోగంలో యుకెదే అగ్రస్థానం. ఇక కోక్ కాయల రవాణాకు అమెస్టర్‌డామ్ పోర్టు ప్రధమస్థానంలో ఉంది. ఇక్కడ రోజూ లక్ష టన్నుల కోక్‌కాయల రవాణా జరుగుతుంది. అన్నట్లు వీటి ఫలదీకరణానికి తేనెటీగల అవసరం ఉండదు. ఈగలు లేదా ఆ జాతికి చెందిన జీవులు పరపరాగ సంపర్కానికి సహకరిస్తాయి.

ఎక్కువగా తింటే మూత్రం ఎరుపెక్కుతుంది
విభిన్నంగా కన్పిస్తున్న ఈ పండు పేరు డ్రాగన్ ఫ్రూట్. ఇది ఎడారిమొక్కల జాతికి చెందినది. వీటి పూలు ఒక్కపూటే వికసించి ఉంటాయి. సీతాకోక చిలుకల్లాంటి జీవులు పరపరాగసంపర్కాని సహకరిస్తాయి. ఈ పళ్లు గులాబీవర్ణంలో ఉన్నా లోపల తియ్యని తెల్లటి గుజ్జు ఉంటుంది. నల్లటి గింజలు కన్పిస్తాయి. టమోటాల్లో ఉండే విటమిన్లు ఇందులో ఉంటాయి. తైవాన్‌లో మధుమేహ నివారణకు ఈ పండును వినియోగిస్తారు. ఇక నికరగ్వాలో అయితే వీటితో మద్యం తయారు చేసుకుని తాగుతారు. ఇది ఖరీదైన ఫలం. అన్నట్లు వీటిని ఎక్కువగా తింటే పెద్ద ప్రమాదం ఉండదుకానీ మూత్రం మాత్రం ఎర్రగా వస్తుంది. అది చూసి భయపడాల్సిన అవసరం లేదటలెండి.

-ఎస్.కె.కె.రవళి