Others

జ్ఞానమిచ్చే ప్రతి వస్తువూ గురువే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్ష భూమియైన ఈ పుడమిపై వేద కాలంనుంచి ఎందరో జగద్గురువులు, సద్గురువులు అవతరించి లోకోద్ధరణ గావించారు. శ్రీరామకృష్ణ, వివేకానందులు, శ్రీరామతీర్థులు, శ్రీ అరవిందయోగి ఇత్యాదిగా ఆధునిక కాలంలో ప్రసిద్ధి పొందేరు. ఆ గురుపరంపరని కొనసాగిస్తూ మనమధ్య అవతరించిన సద్గురువు భగవాన్ శ్రీరమణ మహర్షి.
సద్గురు కృప హృదయంలో వర్షించి, జ్ఞానబోధ రసం అంతరంగంలో ప్రవహిస్తే ఆ దీప్తి హృదయ ఫలకంపై ప్రతిఫలిస్తుంది. అద్వైత పరంపరలో తమ అనుభవాన్ని సుస్థిరంగా నిలిపి, భక్తులకు బోధించిన సద్గురువు శ్రీరమణ మహర్షి.
పాండిత్యము, అనుభవము సమపాళ్ళుగా, ఉష్ణకుండపు నీళ్ళలా శ్రీ శంకరాచార్యులవారి బోధనలు సాగితే, పాండిత్యం లేకపోయినా అనుభవానే్న బలంగా సంతరింపజేసుకుని, జ్ఞాన భాస్కరునిగా, సద్గురువుగా ఆత్మజ్ఞానాన్ని బోధించారు శ్రీరమణమహర్షి.
గురువులను దివిటీలతోను, సద్గురువును సూర్యునితోను పోలిక చేసేరు పండితులు.
ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ప్రథమ గురువులు. పాఠశాలలో ఉపాధ్యాయుడు మలి గురువు. నిత్యజీవితంలో హితులు, సన్నిహితులు ఎవరైనాసరే వారినుంచి ‘హితం’ గ్రహించినప్పుడు ‘గురువు’గా స్వీకరించడంలో తప్పులేదు. ఈ సృష్టిలో ప్రతి వస్తువులోను గురువును దర్శించవచ్చు. ‘‘గురువు మానవాకారంలోనే ఉండాలన్న నియమం లేదు. దత్తాత్రేయుల వారికి ఇరవై నలుగురు గురువులున్నారు. పంచభూతాలు, భూజల చరాలలో కూడ ఆయన గురువును దర్శించారు. గురువు చూపే మార్గమును శిష్యుడు లేదా సాధకుడు అనుసరించవల్సి ఉంటుంది.
సత్యానే్వషకులైన వారిని చూసి వారికి ఏమార్గం సరిపోతుందో తెలుసుకుని వారిని ఆ మార్గంలో నడిచే స్వేచ్ఛ కల్పించాలి. ఆ విధంగా గురువు శిష్యునితో కలసి నడుస్తూ తన మార్గంలోనికి మెల్లమెల్లిగా తీసుకుని రాగలవాడే నిజమైన గురువు. శ్రీరమణుని బోధనలు అవగాహన చేసుకుంటే ఈ నిజం తెలుస్తుంది. జీవులను ఆత్మస్వరూపంవైపు తీసుకెళ్ళి పరమాత్మ బోధనను అనుగ్రహించేవాడే సద్గురువు అంటారు శ్రీరమణ మహర్షి. సద్గురువు తన శిష్యుని కర్మ, ధర్మ, యోగానుష్ఠానాలలో పడకుండా ‘‘ఊరక ఉండు’’అని ఉపదేశించి అభయమిస్తున్నాడు. అలా ఆత్మమార్గాన్ని అనుసరించమని చెబుతాడు. దానిననుసరించి తపనతో హృదయంలో మునగటమే ఉపదేశాన్ని విడమంటే. వినలేని వారికి ఒక గురువుకావాలి. నిజమైన సద్గురువును సాధకులే అనే్వషించి తెలుసుకోవాలంటారు మహర్షి.
గురువు నిజానికి మానవ రూపి కాదు నామరూప రహితుడైనవాడు గురువు. అసత్య దేహాది ప్రపంచాన్ని నిత్యమని నమ్మే జీవులకు అంతా భ్రాంతియేనని గ్రహింపజేసే ఆత్మజ్యోతి స్వరూపుడైనవారే సద్గురువులు. వాదనలలో ఓడినవారు మానసికంగా కృంగిపోతారు. కాని సద్గురువు తన వౌనంతో- దక్షిణామూర్తివలె- విజయం సాధించినా వారి హృదయంలో ప్రేమ, జ్ఞానం నిండుగా ఉంటాయి. శ్రీరమణ మహర్షి 1907వరకు జిజ్ఞాసువులను వౌనం చేతనే ఉపదేశించిన సద్గురువులు. స్వామి చిన్మయానంద (పూర్వనామం బాలకృష్ణన్), సత్యానందతీర్థస్వామి (సత్యానందాశ్రమ వ్యవస్థాపకులు) ఆదిగా ఎందరో అలా ఉపదేశం పొంది ప్రసిద్ధిపొందేరు. సద్గురువుల అనుగ్రహంతో తెలుసుకునే వేదాంతసారం, నిర్మలమైన విశుద్ధవౌనంలో గోచరించే బ్రహ్మజ్ఞాన సద్వస్తువు తనంతట తానుగానే హృదయంలో ‘నేను-నేను’అనే స్మరణానుభవంగా ప్రకాశిస్తుందని అంటారు జ్ఞానులు.
‘‘్భగవంతుడే జ్ఞానగురువు. ఆయన విద్యబోధలనెడి జ్ఞానాగ్నిలో ద్వంద్వ భావాలు నశిస్తాయం’’టారు శ్రీరమణమహర్షి. శ్రీకృష్ణుడు అర్జునుని ముందుంచుకుని చెప్పే నెపంతో మనకిచ్చిన ఉపదేశమిదే. సద్గురు చరణాలనాశ్రయిస్తే అన్ని బంధాలనుండి విముక్తిపొంది ఆత్మసాక్షాత్కారం పొందగలర’’ని అభయమిచ్చారు శ్రీరమణ భగవానులు.
ఆధ్యాత్మిక మార్గంలో గురువు అవసరం గురించి చెబుతూ ‘‘సత్యానే్వషికి మార్గదర్శనం చేస్తాడు గురువు. అంతకుముందే గురువు సహజానందస్థితిని పొందిన అనుభవం కలిగి ఉన్నాడు కనుక. రోగికి సరైన ఔషధం నిర్ణయించు వైద్యుని వంటిది గురువు పాత్ర’’అంటారు మహర్షి.
‘‘ప్రతిఒక్కరికీ గురువు అవుసరం ఉంది’’అన్న మహర్షి ‘‘నాకూ ఎప్పుడో ఒకప్పుడు గురువు ఉండి ఉంటాడు. నేను అరుణాచలేశ్వరుని కీర్తించలేదా? గురువు అంటే ఏమిటి? గురువేదైవం లేక ఆత్మ. మాయనుంచి మానవుని దాటించడం గురువుకే సాధ్యం. మరి ఎవరి తరమూ కాదు అంటున్నాయి ఉపనిషత్తులు. కాబట్టి గురువుఉండి తీరవల్సిందే’’ అంటారు మహర్షి.
నిరంతర ఆత్మనిష్ఠ, సమదృష్టి, సమదర్శనం, సర్వకాల సర్వావస్థల్లో అచంచల ధైర్యం- ఇవే సద్గురు లక్షణాలు.అలలు సముద్రంలో లీనమైనట్లు సద్గురువు వ్యక్తిత్వం ఆత్మలో లీనమై ఉంటుంది. కాబట్టి అతడే ఆత్మ, గురువు, దైవం అనంతమైన చైతన్యం నుండి వేరుకాదు. సర్వవ్యాపక సర్వజ్ఞత గుణాలు వారిద్దరికీ (దైవం, గురువు) సమానమే. ఇద్దరూ ఒక్కటే. అనంత శక్తిస్వరూపం, సర్వవ్యాపకం, శాంతి నివాసం, శక్తినిలయం అనేవి దైవంనుండి వేరుకావు. ఆ గుణాలు సద్గురువుకు కూడా ఉన్నాయి’’అంటారు మహర్షి.
శ్రీ రమణమహర్షి ‘‘ఎవరినీ తమ విశ్వాసాలను, నమ్మకాలను, మార్గాలను వదులుకోమనలేదు. శాస్త్రగ్రంథపఠనం కూడా వద్దనలేదు. ఎవరు ఏ మార్గంలో నడచినా అన్ని నదులు సముద్రంలో సంగమించినట్లు, ఆయా పద్ధతులు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. చిత్తశుద్ధి అంతర్వీక్షణానికి దారితీస్తుంది. సత్య వస్తువును తెలుసుకునే మార్గాన్ని చూపుతుంది. ‘నేను’ఎఱుకను కలిగిస్తుంది అంటారు భగవాన్.

- ఎ.సీతారామారావు