భక్తి కథలు

హరివంశం 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్లా కాలం గడుస్తుండగా ఒకసారి వసంత రుతువు ముగిసి గ్రీష్మం వచ్చింది. ఇక అపుడు గోప సుందరులు వాసంతికా పుష్పాలు కర్ణాలంకారాలుగా ధరించటం మానుకుని పాటలీ కుసుమాలు సింగారించుకోవటం మొదలెట్టారు. మల్లెలు కొల్లలుగా పూశాయి. ఎండలు ముదిరిపోయినాయి. రోజంతా శరీరాలు చెమటలు కమ్మి చీకాకు కలగజేస్తున్నాయి. రోజు రోజుకూ మడుగులలో నీరు తగ్గిపోతూ వచ్చింది. అదివరలోలాగా కాకండా ఎటువంటి ప్రవాహమైనా సులభంగా ప్రజలు దాటిపోగలుగుతున్నారు. వడగాడ్పులు దుస్సహంగా ప్రారంభమైనాయి.
పోను పోను ఎండలు భరించరానంత మెండైనాయి. ఇంతటి తీవమైన గ్రీష్మపు వెట్ట భరించలేకనే కమలాక్షుడు కడలి శయనుడై ఉంటాడు. శివుడు హైమవతితో మంచు మలనాశ్రయించి ఉంటాడు. బ్రహ్మదేవుడు పంకజాన్ని నివాసం చేసుకొని ఉంటాడు. ఇటువంటి గ్రీష్మం ముందు ముందు లోకాలను తల్లడిల్లబోతుందనే వాళ్ళు ముందుజాగ్రత్తపడ్డారు. లేకపోతే ఆ ఆవాస స్థలాలు ఎంచుకోవటం దేనికి? వాళ్ళనే భయపడేట్లు చేసిన ఈ తీవ్రమైన గ్రీష్మం లోకాలను ఎంతగానో క్షోభింపజేసిందో ఎవరు చెప్పగలరు? సముద్రంలో వుండే బడబానలం నీళ్ళు తాగి తాగి విసిగిపోయి లోకాలను భక్షించటానికి విజృంభించిందేమో అనిపింపజేసింది ఈ గ్రీష్మ ఉష్మలం.
శంకరుడు గళంలో నిలుపుకోవటం సాధ్యం కాక బయటకు కక్కివేశాడో అన్నట్లు గరళార్చులు నాలుగు దిక్కులా వ్యాపిస్తన్నాయేమో అనిపించింది ఈ తీవ్ర గ్రీష్మతాపం. కల్పాంతాగ్నిలాగా ఈ గ్రీష్మం సమస్త లోకాలను తల్లడిల్లజేస్తున్నది అనుకున్నారు జనులు. లోకాలన్నింటినీ లయం చేసుకుంటూ వ్యాపిస్తున్నది. కల్పాంతాన బ్రహ్మదేవుడు ఉపశమింపజేసేదాకా దీని ప్రతాపం చల్లారదు. సృష్టి తత్త్వాలన్నీ అణిగిపోయి ఒక్క అగ్ని తత్త్వమే సకల లోకాలను కమ్ముకుంటున్నదేమో అన్నంత భయంకరంగా గ్రీష్మం నలుగడలా వ్యాపించింది. అడవులలో చెలరేగి ఆకాసం ఎత్తున ఎగస్తున్న జ్వాలలనుంచి వెలువడే పొగలు మెరుపులతో కూడిన మేఘాలా అనేట్లున్నాయి. దూర దూరాల ఎండమావులు అక్కడ వర్షం బాగా కురిసినట్లున్నదనే హర్షాన్ని రేకెత్తిస్తూ, అమ్మయ్యా! బతికాం కారు మబ్బులు కమ్ముకుని వర్షరుతువు కూడా ఇంతలో అంతలో రాబోతున్నదనే ఆశ్వాసం ప్రజల హృదయాలలో కలిగిస్తున్నది. కుండ పొదుగుల నుంచి సమృద్ధిగా లభించే ఆవుపాలు, గోవర్థనగిరి సెలయేళ్ళ విహారాలు, రాత్రిళ్ళు తరుణ గోపికల బిగి కౌగిలింతలు, తమ వాడైన గోవింద దరహాస చంద్రికలు బృందావన వాసుల వేసవి తాపాన్ని ఉపశమింపజేస్తూ వచ్చాయి. దావాగ్నులు చల్లారిపోయినాయి అనుకుంటూ ఉండగా మోదుగ పొదలు, లతలు నిండా పూజి ఇంకా కార్చిచ్చు పూర్తిగా సమసిపోలేదు అని భ్రమింపజేస్తున్నాయి. ఇట్లా గ్రీష్మం ఇక పరిసమాప్తి కాబోతున్నదనుకుంటూ ఉండగా బృందావనాన్ని ఒక గొప్ప ఉపద్రవం చుట్టుముట్టింది. ఎక్కడ చూసినా పశువులకు రోగాలు ప్రబలాయి. ఎన్ని మందులు మాకులు చికిత్సలు ప్రయోగించినా పశువుల రోగాలు రోజురోజుకు దుస్సహమైపోతూ వచ్చాయి.
గోవులు రోజురోజుకు దుర్భరమైన రోగ వేదనల పాలైనాయి. శల్యావశిష్టములవుతూ వచ్చాయి. నిరంతరం కన్నుల నిండా కన్నీరు కారుస్తున్నాయి. గిట్టలనిండా క్రిములు పట్టి నిలుచోలేకపోతున్నాయి. నోటినిండా ఆగకుండా చొంగలు కారుస్తున్నాయి. వాటి శరీరాలలో పుండ్లు పడి చీము నెత్తురులతో దుర్గంధపూరితమై పోతున్నాయి.

ఇంకాఉంది