భక్తి కథలు

హరివంశం -74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుద్ధతుడై చాలా ఆటోపంతో అశ్వరూపుడై బృందారణ్య తరు ప్రదేశాలకు చేరుకున్నాడు కేశి రాక్షసుడు. అక్కడి పశువుల మందలో బీభత్సం సృష్టించాడు. మదమెక్కి దయ్యం పట్టి ఉన్మత్త తీవ్రతతో భయంకరంగా ప్రవర్తించాడు. వెనక కాళ్ళు ఉద్ధతితో ఎత్తి కొన్ని పశువులను వాటి గుండెలు పగిలిపోయేట్లు తాటించాడు.
కొన్ని పశువుల కండలు బయటకు వచ్చేట్లు భీకరంగా వాటిని కరచాడు. కొన్ని పశువులను, లేగలను గిట్టలతో రాపాడి మట్టుబెట్టాడు కొన్నిటిని. కొన్నిటిని మహావేగంతో వచ్చి ఢీకొని వాటి శరీరాలు చీల్చివేశాడు. భయంకరంగా జూలు విదిల్చాడు. కళ్ళ వెంబడి నిప్పులు రాల్చాడు. చెవులలో పిడుగుపాటు ధ్వని పుట్టేట్లు సకిలించాడు. ఈ విధంగా ఆలమందలలో స్వైర విహారం చేసి వాటిని కకావికలం చేశాడు.
గోపాలురంతా ఈ గుప్రు రాక్షసుడు ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ మందపైకి ఉరికివస్తాడోనని తల్లడిల్లిపోయినారు. కేశి రాక్షసుడు పసులను చంపి రక్తపానం చేశాడు. మనుష్యులను కూడా చంపి తిన్నాడు. ఊరు విడిచి అడవిలోకి అడుగుపెట్టటానికి పశువులూ, గోపాలురు కూడా హడలిపోయినారు. అరణ్యాన్నంతా శ్మశానం చేశాడు వచ్చీ రాగానే కొద్ది రోజులలోనే. ఇక అడవి వైపు వచ్చే నరుడు కాని, పశువు కాని కనపడకపోవడంతో ఊరిమీదికి వచ్చి పడ్డాడు.
ఆకాశం దద్దరిల్లేట్లు హ్రేషలు (గుర్రపు అరుపులు) సృష్టించాడు. భూమి మీద గిట్టలు మాటిమాటికి దట్టించి పెనుధూళులు ఎగజిమ్మాడు. ఇట్లా కేశి రాక్షసుడు ఊళ్ళోకి వచ్చి చెలరేగగానే ‘కృష్ణ కృష్ణ’ రక్షించు రక్షించు అనే ఆర్త్ధ్వనులు మిన్నుముట్టాయి. గోపాలురు, గోపికలు అంతా పరుగు తీసి కృష్ణుడి మరుగుజొచ్చి శరణు వేడారు. ‘మీరేమీ భయపడవద్దు. వీణి పీచమిప్పుడే అణచివేస్తాను’ అనివాళ్ళకు ధైర్యం కలిగించాడు. ఆ రాక్షసాశ్వాన్ని ఎదుర్కొని తన భుజం చరిచి, ‘ఏదీ ఇటు రారా, నేనిక్కడ ఉన్నాను’ అని పెద్దగా హుంకరించాడు కృష్ణుడు. దీనితో మరింత రెచ్చిపోయినాడు కేశిరాక్షసుడు. కృష్ణుడు తననుద్దేశించి చప్పట్లు చరచటం ఎంత మాత్రం సహించలేక ఆయన మీద ఒక్క పెట్టున దూకాడు.
కత్తులవంటి తన దంతలతో ఆయనను కరవ వచ్చాడు. ప్రళయార్కుణ్ణి రాహువు మింగాలనుకున్నట్లున్నది వాడి సంరంభం. అప్పుడాకాశ చారులంతా ససంభ్రంగా ఆ దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నారు. హరి చేతులలో ఏమీ ఆయుధాలు లేవు. పళ్ళు తెరచి కళ్ళ నిప్పుల రాలుస్తూ మహోద్వేగకరంగా కేశి రాక్షసుడు శ్రీకృష్ణుడితో తలపడటానికి రావటంతో గోపాలురు, గోపికలు హాహారవాలు చేశారు.
వీడు మామూలు అశ్వం కాడు. మహారాక్షసుడు. కంసుడు ప్రేరేపించగా నీకు హాని తలపెట్టి వచ్చాడు. నీవు తొందరపడవద్దు, ఒడుపుగా వీడిని మట్టి కరిపించాలి అని వాళ్ళను మానుష బుద్ధి వశం చేసుకోవడంవల్ల ఆందోళనతో హెచ్చరికలు పలకటం చూసి కృష్ణుడికి నవ్వొచ్చింది.
‘మీరేమీ కలత చెందవద్దు. చూస్తూ ఉండండి. వీణ్ణి అశ్రమంగా నేల కూలుస్తాను’ అంటూ ఆయన కుడి ఎడమలకు నాలుగడుగులు జరుగుతూ ఒరుగుతూ వాణ్ణిచావు దెబ్బ కొట్టటానికి ఉద్యుక్తుడైనాడు. ఈ ఊపులో ఆయన ధరించి ఉన్న నెమిలి పింఛం తళతళ కాంతులు ప్రసరింపజేసి, పసుపు పచ్చని పట్టు ఉత్తరీయం సుందరంగా ఆయన భుజాలమీద కదలాడింది. వక్షస్థలంలోని వనమాల అటూ ఇటూ ఊగులాడింది. శరీరం కుంచించి కుడివైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి కుప్పించి వాణ్ణి కవ్విస్తున్నాడు.
-ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు