భక్తి కథలు

హరివంశం - 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహోద్రేకంతో ముందు రెండు కాళ్ళు పైకెత్తి శ్రీకృష్ణుడి వక్షస్థలాన్ని తాటించాలని ఆ చెనటి అశ్వం ఆయన మీదకు ఉరికింది. ఆయన ఒడుపుగా తన శరీరాన్ని కుంచించి ఒక పక్కకు తప్పుకోవటంతో ఆ కేశి రాక్షసుడి రెండు కాళ్ళు అవతల పక్కకు మెలిపిడి భూమివైపు ఒరిగిపోయినాయి. తన పూనిక ఘోరంగా విఫలం కావటంతో కేశిదనుడు తన వక్త్రాన్ని భయంకరంగా తెరచి ఆయనను కరవ వచ్చాడు.
అపుడు శ్రీకృష్ణుడు వాడి తెరచిన వక్త్రంలోకి తన చేయిని గట్టిగా జొనిపాడు. వాడి జిహ్వామూలందాకా తన బాహువును ఇంకా ఇంకా ముందుకు పోయేట్లు చేశాడు. నాలిక పెరికిపారేశాడు. వాడి మొసలి కోరల వంటి పళ్లన్నీ డుల్లిపొయినాయి.
వాడు గిల గిల తన్నుకున్నాడు. నిలుచో లేకపోయినాడు. నేలమీదకు ఒరిగిపోతుండగా ఇంకా ముందుకు తన చేయి జొనిపి వాడి పేగులు తెంపివేశాడు. ఇంకొక చేతితో వాడి ముచ్చెను పగిలిపోయేట్లు చీల్చాడు. ఈ విధంగా కేశి రాక్షసుడు నేలమీద పడి తన్నుకొని ప్రాణాలు వదిలాడు. వజ్రాయుధంతో కూలిపోయిన కొండ శిఖరంలా అయిపోయింది ఆ రాక్షసుడి శరీరం.
అపుడు గోపికలంతా ఆయన సమక్షానికి వచ్చి తమ విశాల లోల నయనాల వీక్షణ పూలమాలలు ఆయనకు అలంకరించారు. వృద్ధ గోపకులు ఆయనను స్తుతించారు.
ఇట్లా కేశి రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించటం గగనతలం నుంచి వీక్షించి అదృశ్యడై ఉండి హరిని ఉద్దేశళించి నారదుడు ఇట్లా స్తుతించాడు గోగోపీ జనరక్షకుణ్ణి. లోకంలో ఎవరు ఎక్కడ కలహమగ్నులై ఉంటారా అని నేను అత్యంత కౌతుకంతో లోకాలన్నీ సంచరిస్తూ ఉంటాను. నీ శత్రు నిర్మూలన పరాక్రమం అత్యంతస్తుత్యం. దుర్మార్గ చరాధములను నీ వలె పరిమార్చగలవారు ఎవరూ ఉండరు. ఈ పరమోత్సవం చూదామనే పని గగట్టుకొని వచ్చి చూశాను నీదైన విజృంభణం. ఇంతటి దుష్కర కార్యాలు నిర్వహించటంలో లోక రక్షణం చేయటంలో నీవున్నూ త్రిపురాంతకుడున్నూ తప్ప మరెవరూ పూనుకోలేరు. ఈ కేశి రాక్షసుణ్ణి ఇంద్రుడు కూడా ఎదుర్కొని నిలవలేడు.
అటువంటి పరమ భయంకరుణ్ణి అలవోకగా రూపుమాపావు. ఇక నీవు లోకంలో కేశవుడిగా ప్రస్తుతి పొందుతావు. నీవు పూతనను చంపివేసిప్పటినుంచీ నీ మహాద్భుత కార్యాలు చూస్తూనే ఉన్నాను. ఇక అసలు నీ దివ్యాతారతత్త్వం భూలోకంలో ప్రకటితమయ్యే సమయం ఎంతో సమీపంలో వుంది. అందుకే గదా ఇలపై జన్మించావు నీవు వాసుదేవా! కంస వధకాగానే ధరణిలో రాజులంతా నీవు వచ్చిన పనికి సహకరిస్తారు. ఇరువర్గాలుగా చీలి నిహతులవుతారు.
తమ తమ దుష్కర్మలనుభవిస్తారు. శ్రుతులు, పురాణాలు నీ చరితం గానం చేస్తాయి. విప్ర రక్షకుడివి నీవు. కమలనాభ! వాళ్ళకు నీవు నిరతాశ్రయుడివి. వాళ్ళు సతతం నిన్ను స్తుతిస్తారు. నీవే దిక్కుగా సమాశ్రయణం పొందుతారు. నీవు ఆద్యుడివి, ఆదిదేవుడివి, అనంతుడివి. ఉత్తమ బోధకుడివి. లోక సృష్టి స్థితిలయకారుడివి నీవే. నీవే జగత్తులకంతా మూలాధారం. నిన్ను స్తుతించటమే నాకు పరమానందం. ననె్నపుడూ కరుణించు అని హరి పరాక్రమం గానం చేసి దివ్యలోక సంచారానికి తరలిపోయినాడు నారదుడు. తన సఖా, సఖీజన పరివృతుడై శ్రీకృష్ణచంద్రుడప్పుడు వ్రేపల్లెలో ప్రవేశించాడు.
ఇక మధురానగరం నుంచి అక్రూరుడి ప్రయాణం ఎక్కడా ఆగకుండా సత్వర కృష్ణ దర్శన లాలసోత్సుకంగా సాగించాడు అక్రూరుడు. ఆయన వ్రేపల్లె చెరేప్పటికి సాయం సంజ వేళ అవుతున్నది.
- ఇంకా ఉంది

అక్కిరాజు రమాపతిరావు