భక్తి కథలు

హరివంశం - 80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ మాయ తెలియ ఎవరి వశము? ఆ బ్రహ్మాదులకు కూడ నీకల రూపు గ్రహించటం అసాధ్యం. నీ అనుగ్రహం నాపట్ల ఇట్లానే ప్రసరింపజేయి. నాకదే చాలు’ అని నమస్కరించి, మనం ఎంత త్వరగా మధుర చేరితే అంత ప్రసన్నుడవుతాడు కంసుడు. మసలితే కోపిస్తాడు. ఇక బయలుదేరుదాము అని విన్నవించాడు.
‘మాదేముంది? మేము నీ అధీనులం. నీవు ఎట్లా చెపితే అట్లా వినవలసిన వాళ్లం కదా! మాకు దారి కూడా చూపవలసినవాడివి నీవే’ అని కృష్ణుడు నవ్వుతూ పలికాడు. అక్రూరుడు వెంటనే గుర్రాలను తీసుకొని వచ్చి రథానికి పూన్చాడు. రథం వడివడిగా ప్రయాణించింది. పొద్దు వాట వాలుతుండగా వాళ్ళు మధురానగరంలో ప్రవేశించారు. అపుడు కృష్ణుడు ‘మేమింతవరకు నగర వైభవం ఎటువంటిదో తెలిసినవాళ్ళం కాము. కాబట్టి ఈ నగరపు సొబగు వీక్షించాలని ఉంది.
మనం నాలుగు వీధులూ చూసి కొంత వ్యవథానం తర్వాత కంస భవనానికి పోదాము’ అని అక్రూరుడితో అన్నాడు. ‘అట్లా వద్దు. కంసుడు మీ కోసం పొద్దుటి నుంచీ ఎదురుచూస్తూ ఉండి ఉంటాడు. మీరు మధుర చేరగానే మీ తండ్రి ఇంటికి వెళితే మరింత మండి పడతాడు. వసుదేవుడిపట్ల కంసుడు రోజురోజుకూ విరోధం పెంచుకుంటున్నాడు.
తనకు కనపడకుండా మీరు వసుదేవుడి మందిరానికి వెళ్లటం తనకు అవజ్ఞగా భావించుకుంటాడు. కాబట్టి ఈ పుర వీధులు కాసేపు చూసి మీరు నేరుగా రాజభవనానికి రండి. నేనిప్పుడు వెళ్లి మిమ్మల్ని తీసుకొని వచ్చానని కంసుడికి తెలియజేస్తాను అని కృష్ణుణ్ణీ, బలరాముణ్ణీ రథం దింపి తాను రథం నడుపుకుంటూ అక్రూరుడు కంస భవనం వైపు వెళ్లాడు.
ఇక కృష్ణ బలరాములు కాలి గొలుసులు విడిపించిన గున్న ఏనుగులు ఎంత ఉల్లాసంగా విహరిస్తాయో అట్లా పట్టణ రాజమార్గంలో ప్రవేశించారు. ఎంతో వేడుక, ఎంతో ఉత్కంఠ, ఎంతో కుతుకం, ఎంతో ఉత్సాహం చూపుతూ ఆ ప్రధాన రథ్యలో ముందుకు సాగారు. ఎంత సుందర నగరం ఇది అని ఆశ్చర్యమనస్కులైనారు. ఇది ఇట్లా ఉండగా పౌరులు వీరిని చూసి అత్యంతాశ్చర్యానంద భరితులైనారు.
సర్వజ్ఞులు, సకల విషయ జ్ఞాతులై కూడా లీలా మనుష్యత్వం ధరించారు కాబట్టి ఆ పురవీధుల సౌందర్యాన్ని, సంపదను అక్కజంగా తిలకిస్తూ వారు ఆగుతూ సాగుతూ వుంటే గృహిణులు, వ్వనవతలైన పుర స్ర్తిలు వీళ్ళనే కళ్ళప్పగించి చూడసాగారు. అబ్బ! ఇంత అందమైన యువకులను మనం ఎప్పుడూ చూడలేదు, వీళ్ళు ఎవరో! ఎక్కడ నుంచి వచ్చారో! ఏ దేశం వారో! వీళ్ళను కన్న తల్లిదండ్రులెంత ధన్యాత్ములో! ఈ నగరానికి వీళ్ళు ఏమి పనిమీద వచ్చారబ్బా! అని గుజగుజలు పోయినారు.
ఒకరికొకరు చూపుకున్నారు. ముగ్ధ విలోకన నయనార్చితులను చేశారు వారిద్దరినీ పురభామలు. వారి నుంచి చూపు మరల్చుకోలేకపోయినారు. ఇక బలరామకృష్ణుల సమాన వయస్కులైన నగర యువకులు ఉత్సుకతతో వారి వెంట నడిచారు. ఆ సమయంలో మధురానగరమంతా వాళ్ళిద్దరినీ చూస్తూ రిచ్చపాటుననుభవించింది.
ఇంతలో వారికి కంస భవనానికి చలువ బట్టలు మూటలో తీసుకొని పోతున్న ఒక రజకుడు తారసిల్లాడు. అతడు రాచ భవనపు కొలువుకాడు అని వాళ్ళు గ్రహించారు. ‘ఓ మడివాలూ! మేము కూడా ఇపుడు రాజును దర్శించటానికి పోతున్నాము. మాకు రాజ దర్శనోచితమైన విలువైన, సుందరమైన వస్త్రాలు కావాలి కదా!
ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు