భక్తి కథలు

హరివంశం 133

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారీ దంపతులను చూసి బహు మెచ్చుకున్నారు. ఆనంద పులకిత తధులైనారు.
అపుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు ఎనిమిది వేల రథాలను దానమిచ్చాడు. ఇవికాక పదకొండు వేల ఐదు వందల గజాలను బహూకరించారు. వేల గుర్రాలనిచ్చాడు. అసంఖ్యకమైన ఆల మందలను ఇచ్చాడు. మణికాంచన ఆభరణాలు అమూల్యమైన పట్టుదుకూలాలు చదివించాడు. సూత మాగధ గాయక నర్తక వంది వైతాళికులకు కొల్లలుగా ధనమిచ్చాడు. అనురాగపూర్వకంగా అనేకమైన కానుకలు వాళ్ళకు చదివించాడు. షడ్రసోపేతమైన భోజనాలు అభీష్ట సిద్ధిగా ఏర్పాటుచేశాడు.
మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. సంతోషంగా కోరుకోండి అని ప్రియంగా అందరికీ చెప్పాడు పెళ్లికి వచ్చిన వారందరికీ. ఇట్లా రుక్మిణీ కృష్ణుల వివాహ క్రతు కలాపం నాలుగు రోజులు జరిగింది. బంధువులు, రాజులు తనకు ఇచ్చిన కట్నాలు, కానుకలు ప్రీతిపూర్వకంగా తాను స్వీకరించాడు. తాను వాళ్ళందరికీ కట్న కానుకలు చదివించాడు. పెళ్లికి వచ్చిన మునులందరినీ అర్చించి వీడు కొలిపాడు.
ఆ తరువాత రుక్మిణీ కృష్ణులు అనురాగ కేళీ లోలురైనారు. పరస్పర వశీకర చాతుర్యధుర్యులైనారు. భర్మ్యహర్మ్యాలలో విహరించారు. ఉద్యానవనాలలో రాగడోలికలలో ఊయలలూగారు. రైవతాకాద్రి కందరాలలో ఊసులు చెప్పుకున్నారు. సాగర తీర విహారం చేశారు. కమల వనలతా కుటీరాలలో సంచరించారు చేయి చేయి కలుపుకుని భుజం భుజం ఒరుసుకొని. ఒకరికొకరు మనసిచ్చిపుచ్చుకున్నారు.
ఆ తరువాత క్రమంగా కృష్ణుడు మిత్రవింతను, జాంబవతిని, సత్యభామను, కాళిందిని, లక్షణను, సుదంతను ఆయా సందర్భాలను పురస్కరించుకొని పెళ్లాడి అష్ట మహిషీ కల్యాణుడైనాడు.
తరువాత కొంతకాలానికి రుక్మిణీదేవి గర్భం ధరించి అందాల బాలుణ్ణి కన్నది. ముక్కంటి కంటి మంటకు అనంగుడైన మన్మథుడు ఏ తల్లి కడుపున మళ్లీ పుట్టి తన రూపు తాను ధరించాలా? అని నిరీక్షిస్తూ రుక్మిణికి జన్మించాడని ఆకాశవాణి తెలియజేసి ఈ పిల్లవాడికి ప్రద్యుమ్నుడని కూడా నామకరణం చేసింది. అందువల్ల ప్రద్యుమ్నుడు మన్మథ సుందరుడుగా పుట్టాడు.
కృష్ణుడి తొలి సంతానం తనను చంపుతాడని శంబరాసురుడనే మహామాయావిని దేవతలు పూర్వం శపించారు కాబట్టి రుక్మిణి కన్న శిశువును చూసి శంబరాసురుడు ప్రాణభీతి చెందాడు. మాయలలో శంబరాసురుణ్ణి మించినవాడు ఏడేడు లోకాలలో ఎవడూ లేడు. తన మాయాజాలం పన్ని ఏడో నాటి పురిటి శిశువును తీసుకొని వెళ్లి సముద్రంలో గిరవాటు పెట్టాడు శంబరాసురుడు. ఈ పురిటి పసికందును ఆమిషమని భ్రమసి ఒక పెద్ద మత్స్యం మింగివేసింది.
చాలా నేర్పరియైన ఒక మత్స్యకారుడు ఈ మహామీనాన్ని వలవేసి పట్టుకున్నాడు. ఈ జాలరి శంబరాసుడి పట్టణమైన ఇక్షుమతీ నగరంవాడే. ఇంత పెద్ద చాపను చూసి ఎంతో సంతోషిస్తుంది గదా అని ఆ జాలరి శంబరాసుడి ఇల్లాలికి దానిని తీసుకొని పోయి ఇచ్చాడు. ఆమె పేరు మాయావతి. ఆ చాపను కోయగా మాయావతికి అందాలొలికే శిశువు కన్పించాడు. ఆ శిశువును చూసి ఆమె ఎంతో మోహపడింది. శంబరాసురుడు కూడా తనకు సంతానం లేదు కాబట్టి ఈ శిశువును పెంచటానికి ఆనందంతో అంగీకరించాడు. ఆ తరువాత వాడి మాయలతో వాడుండిపోయినాడు. ఎప్పుడైతే శంబరుడింటికి ప్రద్యుమ్నుడు చేరాడో అప్పుడు కృష్ణపుత్రుడు సద్యోవనడైనాడు.

ఇంకా ఉంది