భక్తి కథలు

హరివంశం 153

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భళాలే! నీ అంతటి అద్భుత శక్తి సంపన్న ఈ విశాల ప్రపంచంలో ఇంకెవరున్నారు తల్లీ! వింతలలో వింత అంటే నీవే కదా! అన్నాను ఆమెతో. అపుడు గంగాదేవి ‘నన్ను తేరిపార చూసి’ తండ్రీ! నేనెంత? నా శక్తి సామర్థ్యాలేపాటివి? నా గొప్ప ఏమి గొప్ప! నా వంటి అసంఖ్యాక, సంఖ్యాతీత ప్రవాహాలు ఎన్ని వచ్చినా కాదనక చోటిస్తాడు కదా సాగరుడు! అయినా ఉద్ధతుడు కాడే! ఆయన మహాత్మ్యం, ఇటువంటిది అని ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడూ పరమ హర్షంతో నింగిదాకా నవ్వు కెరటాలను వ్యాపింపచేస్తాడు. ఆయన తత్త్వం ఏమిటో ఎవరూ నిరూపించలేరు కదా! ఆశ్చర్యాలలో పరమాశ్చర్యం అంటే ఆ మహానుభావుడికే అది యోగ్యమవుతుంది అన్నది. ఇదేదో తప్పక తెలుసుకోవాలని నేను సముద్రుణ్ణి అడిగాను. సృష్టి అద్భుతాలలో సాగరా! నిన్ను మించిన పరమ విస్మయావహమైన దృష్టాంతం ఇంకొకటి లేదు కదా! అని జిజ్ఞాస కనపరచాను.
ఆయన ఒక చిన్న నవ్వు నవ్వాడు. నారదా! నన్ను చూసి ఇంత ఆశ్చర్యపడటానికి హేతువేముంది? నీ విస్మయం అకారణం. నన్ను భరిస్తున్నదీ, ధరిస్తున్నదీ ధాత్రీదేవి కదా! ఆ అమ్మ లేకపోతే నాకు ఉనికి ఎక్కడనుంచి వస్తుందయ్య! మావంటివారిని కాచి రక్షిస్తున్నది ఆ తల్లే కదా! మమ్నుల్నే కాదు, త్రిలోకాలకూ ఆధారం భూదేవే కదా! కాబట్టి నీవు ప్రస్తావిస్తున్న ఆ ధన్యత ఏదో, ఆ విస్మయావహ స్థితి సంభూత ఎవరో తెలుసుకో! ఈ వసుంధర లేకపోతే ఎవరు మాత్రం ఎక్కడ మనగలరు? ఆనగలరు? అన్నాడు సముద్రుడు. ఈ విషయమేదో నిస్సందేహంగా, కట్టకడపాటిదాకా తెలసుకోవాలని భూదేవిని పెక్కు విధాలుగా సంస్తుతించాను, కనపడి నాకు సందేహ నివృత్తి చేయవలసిందిగా వేడుకున్నాను. నీవు లోక జననివి కదా అమ్మా! అని పొగిడాను. లోకాన్ని ధరించే దానవు నీవే. అందుకే నీవు ధరిత్రివి అయినావు అన్నాను. క్షమఅనే మాటకు అర్థం నీవే. తాత్పర్యమూ నీవే. క్షమ విషయంలో నీకు సాటి గలవారెవ్వరూ లేరన్న ప్రశంస నీకు మాత్రమే చెల్లగలదు అని ఆమె కనపడగానే ప్రశంసించాను.
అప్పుడామె మొగమంతా నవ్వు పులుముకొని ‘నాయనా! నీవు చెప్పింది బాగానే ఉంది. నాకు కూడా ఇంపుగానే ఉన్నది అనిపిస్తున్నది. అయితే ఒక విషయం నీవు ఎందుకు మరచిపోతున్నావయ్యా! నేనిట్లా మనగలగుతున్నానంటే, అస్తిత్వం కాపాడుకుంటున్నానంటే అందుకు పర్వతాలు, కొండలు కదా కారణం. నా స్థితి హేతుభూతమైన మహాసత్త్వులు కుల పర్వతాలు, భూమిమీద కనపడే కొండలు. నేను వివిధ ప్రాంతాలుగా, వివిధ జనావాసాలుగా ఉండటానికి కారణం ఈ కొండలే. కొన్ని మేరలుగా నన్ను లెక్కించటం కూడా వీళ్లవల్లనే సాధ్యమవుతుంది. (్భధరం, మహీధరం, ధరణీధరం, కుథరం అని కొండలను గూర్చి ప్రస్తావనలు) పొగడవలసిన, ఆశ్చర్య కారణ సృష్టిని సంభావించవలసిన అగత్యం ఏదైనా ఉంటే అది కులగిరులకే చెల్లుతుంది అంది భూదేవి. అప్పుడు నేను కులగిరులను అడిగాను. ‘ఓహో! మీ కల రూపు ప్రపంచంలో అద్భుతాద్భుత సంధాయకం కదా? వెండి బంగారాలకు వివిధ రత్నాలకు మీరు నెలవులు. మీరు ధన్యమూర్తులు. ఈ భువనాధారులు’ అన్నాను. ‘అయ్యా! అట్లా అనవద్దు. ఈ విశ్వానికంతా మేము ఆధారమేమిటి? అది ఒప్పుకోవలసిన మాట కాదు. మేమెవరమయ్యా భూమిని ధరించటానికి? భరించటానికి. సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా! ఆయన సృష్టిలో మేము పరమాణువులం. మమ్ములను గొప్ప చేసి పొగడటం మాకు లజ్జాకరం. ఈ సమస్త సకల సృష్టికి ఆ నాలుగు మోములవాడే ధాత. విధాత. కాబట్టి పోయి ఆయనను స్తుతించి సకలాశ్చర్య నిధానం ఆయనే అని నిర్థరించు’ అని చెప్పాయి కొండలు.

ఇంకా ఉంది