భక్తి కథలు

హరివంశం 155

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చెప్పాను. ఇక మీ దగ్గర శెలవు తీసకుంటాను అని ఆ రాజన్యులను కోరాడు నారద మహర్షి. అప్పుడక్కడి రాజులందరూ హృష్టులైనారు. తుష్టులైనారు. నారదుణ్ణి అర్చించారు. సత్కరించారు. శ్రీకృష్ణుడు కూడా నారద మహర్షిని సంభావించి, ఆదరించి వీడ్కోలు చెప్పాడు.
విష్ణుమాహాత్మ్య కథను విని కృష్ణుణ్ణి దర్శించి, ద్వారకను చూసి పోదామని వచ్చిన రాజు సమూహమంతా విస్మయ చకిత మనస్కులైనారు. ఈయన ఆశ్రయ విధేయులైనవారికి సర్వశుభాలు, సకల కల్యాణాలు సంప్రాప్తిస్తాయి గదా! అని తలపోశారు. మనం పుణ్య భజనులమైనామని ఆనందించారు. మనం వచ్చిన పని ఇబ్బడి ముబ్బడిగా ఫలించిందని పొంగిపోయినారు. సుకృతాత్ములమైనామని సంతృప్తి చెందారు. కాని కొందరు ఈ ఆకాశ పురాణమంతా మనకెందుకు? పుణ్యమా, పురుషార్థమా? అని మాత్సర్యం వదులుకోలేదు. అతిశయం విసర్జించలేదు. అహంకారం అణగనీయలేదు. ఎందుకంటే సదోషమైన బుద్ధి వినయవర్తనకు అంగీకరించదు. చర్మచక్షువులతో చూస్తారే కాని అటువంటి వారికి జ్ఞానోదయం కలగదు. పరమార్థం బోధపడదు.
ధర్మరాజు వంటి సత్కర్మ నిరతుడికి, ధర్మ దయార్ద్ర నిబద్ధ బుద్ధికి, సదాచార పరాయణుడికి, యజ్ఞ కర్మ కాబోతున్నవాడికి మాత్రమే పుణ్య కథలపట్ల పూజ్యభావమూ, పరమార్థ వివేచన గుణశాలిత ఉంటాయి. అటువంటి మహానుభావులలోనే అవి శోభిస్తాయి. అటువంటి మాహాత్మ్య కథనంపట్ల వారు ఆకర్షితులవుతారు. ఒకసారి ధర్మరాజు తన తమ్ముడైన అర్జునుణ్ణి ‘తండ్రీ! నీవు కృష్ణుడికి ఎంతో ప్రేమ పాత్రుడివి, సన్నిహితుడివి, ఆయనను గూర్చి నీకు తెలియనిది లేదు. అందువల్ల నాకు శ్రీకృష్ణ మహాత్మ్యం తెలుసుకోవాలని ఉంది, చెప్పవలసింది’ అని అడిగాడు. అసలు ఈ ప్రేరణ ధర్మనందుడికి ఎట్లా కలిగిందంటే భారత యుద్ధానంతరం శరతల్పగతుడై పాండవులకు దేవవ్రతుడు అనేక నీతులు, ధర్మాలు, పుణ్యకథలు చెపుతున్న సందర్భంగా శ్రీకృష్ణ మహాత్మ్యం తమ్ముడి ద్వారా వినాలని ఆయనకు అనిపించింది. ఆ సమయంలో ధర్మరాజు సమక్షంలో ఎందరో మునులు, తపస్యులు, రాజ వంశప్రవర్తకులు కూడా ఉన్నారు.
అప్పుడర్జునుడు అన్నగారికిట్లా చెప్పసాగాడు.
‘అన్నా! ఒకసారి నీ ఆజ్ఞానువర్తినై సకల రాజులను, శ్రీకృష్ణుణ్ణి దర్శించటానికి వెళ్ళాను కదా! అపుడు యాదవులంతా ననె్నంతో ఆదరించారు. అప్పుడు నేను ద్వారకలో కొన్నాళ్ళున్నాను. ద్వారకాపురిని విడిచి రావటం నాకు ఇష్టం లేక అక్కడ చాలా రోజులుండిపోయినాను. నేనక్కడ ఉన్న రోజులలోనే శ్రీకృష్ణుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. అందువల్ల ఆ యజ్ఞ సమాప్తివరకు ఉండటానికి నాకు మరింత ప్రేరణ కలిగించింది. ఆ యజ్ఞ నిర్వహణకు మహాత్ములైన బ్రాహ్మణులెందరో వచ్చారు.
యజ్ఞమూ యజ్ఞకర్త యజ్ఞ ఫలప్రదుడూ కూడా మాధవుడే కదా! ఇక ఆ యజ్ఞం ఎంత శోభస్కరం ఉన్నదో చెప్పలేను. అటువంటి యజ్ఞం పూర్వకాలంలో కూడా ఎక్కడా జరగలేదు అన్నంత మహాద్భుతంగా జరిగింది. ఆ యదుకులాబ్ధి చంద్రుడి యజ్ఞంలో మృష్టాన్న వితరణ చూసి తీరవలసిందే కాని చెప్పనలవి కానిది.
ఆ యజ్ఞం జరుగుతున్న రోజులలో ఒక రోజున రాజీవ లోచనుడు యజ్ఞ దీక్షితుడై ఉండగా జనపద ప్రదేశం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణుడు దీనాననుడై ఆయనకు ఇట్లా మొరపెట్టుకున్నాడు.
దేవదేవా! ఒక విన్నపం! నా ఇల్లాలికి పురిటి రోజులు సమీపించాయంటే నా ప్రాణాలు గడగడలాడతాయి. ప్రాణం నిలవదు.

ఇంకాఉంది