భక్తి కథలు

హరివంశం 157

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద పోటు బంటువులాగా కమలాక్షుడి ముందు బీరాలు పలికావు. మహావీరుడిలాగా ఆయన అనుమతి కోరావు. పురుషోత్తముడు సాధించగల మహత్కార్యం ఇంకెవరైనా సాధించగలరా నీవల్ల ధర్మ హాని సంభవించింది. ధర్మ రక్ష చేసినవారికి అందులో నాలుగో వంతు పుణ్యం ఎట్లా వస్తుందో, ధర్మహాని చేసినవారికి కూడా అందులో నాలుగో వంతు పాపం చుట్టుకుంటుంది అని ఆ విప్రుడు నన్ను ఆక్షేపించాడు. ఇకనైనా ఆత్మ శ్లాఘకు పాలు కావద్దు. గాండీవం గొప్పలు చెప్పుకోవద్దు, నా బాణానికి ఎదురు లేని డంబాలు పలకవద్దు అని మొగం దించుకునేలా ఛీత్కారాలు చేశాడు. మళ్ళీ వెంటనే ఆర్తత్రాణ పరాయణుడైన కృష్ణుణ్ణి దర్శించటానికి బయలుదేరాడు విప్రుడు. మేము కూడా ఆయన వెంట ద్వారకా నగరం చేరాము. నేను విచార విషణ్ణ హృదయుడనై శ్రీకృష్ణ ప్రభువు మ్రోల తలవంచుకున్నాను.
ఇంత విచారపడటానికి అవసరమేముంది? దీనికి ఇంకొక మార్గముంది అని గోవిందుడు దారుకుణ్ణి పిలిపించుకొని రథం సిద్ధం చేయవలసిందిగా చెప్పాడు. వెంటనే దారుకుడు శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకాలనే నాలుగు దివ్య తురగాలను కట్టిన రథాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు నాకు సారథ్యం చేయి అని పదాక్షుడు నన్నాజ్ఞాపించి ఆ బ్రాహ్మణుణ్ణి కూడా రథం ఎక్కించుకొని బయలుదేరు అని నాకు చెప్పాడు. మేము ఉత్తర దిక్కు ప్రయాణం చేశాము. అట్లా అరణ్యాలు, పర్వతాలు, నదులు గడచి సుముద్ర తీరం చేరాము. సాగరుడప్పుడు సాకారంగా వచ్చి ఆయనను అర్చించాడు. ‘దేవా! ఏమి మీ ఆనతి’ అని సాగరుడాయనకు శిరసొగ్గాడు. శ్రీకృష్ణుడు తన మార్గం సుగమం చేయవలసిందిగా సముద్రుణ్ణి కోరాడు. అపుడు సముద్రుడు వినయ వినమితోత్తాంగుడై ‘దేవా! మీకు నేను దారి ఇస్తే, ఇట్లా ఎవరైనా తమ ఔద్ధత్యం ప్రదర్శించుకోవటానికి దారి ఇవ్వలసిందని నిర్బంధిస్తారేమో! స్వామీ మీరు నన్ను ఎవ్వరూ దాటిపోవటానికి వీలు లేకుండా ప్రతిష్ఠించారు కదా! మీ ఆజ్ఞను నేను ఎట్లా నెరవేర్చగలను? అని విన్నవించుకున్నాడు. అపుడు పద్మనాభుడు, ఆ సందేహం నీకెందుకు? నాలాగా నినె్నవరైనా కోరగలరా? ఈ బ్రాహ్మణుడి కోరికా సిద్ధింపజేసిన వాడివుతావు. నన్నూ మర్యాద చేసినవాడివవుతావు. కాబట్టి నా కోరిక తీర్చు అన్నాడు. సముద్రుడు ఆయన రథానికి మార్గం ఇచ్చాడు. ఇట్లా ఉత్తర కురుభూములు దాటి గంధమాధన శైల ప్రదేశానికి చేరాము మేము.
ఈ శైలాన్ని సమీపిస్తూ ఉండగా జయంతం, వైజయంతం, నీలం, శే్వతం, ఇంద్రకూటం, కైలాసం పేరులు గల పర్వతాలు ఆరు, మహామేరు పర్వతాన్ని ముందుంచుకొని స్వామిని దర్శించటానికి వచ్చాయి. దేవా! మమ్ముల్ని ఆజ్ఞాపించండి, మీ కోసం మేము ఏ సేవ చేయాలి? అని అర్థించాయి. మీ ఆజ్ఞను వెంటనే నెరవేరుస్తాము అని చెప్పాయి. పరంధాముడప్పుడు ‘మీరు నాకు చేయవలసిన సేవ ఏమీ లేదు. మా రథం ఎటువంటి అవరోధం లేకుండా సకరంగా ముందుకు సాగేట్లు తోడ్పడింది, అది చాలు అన్నాడు. అవి ఒదిగి ఆయనకు నమస్కరించాయి. మా రథం సునాయాసంగా సాగింది. మేఘ సమూహంలో ఆదిత్య మండలంలాగా ఆ మహా పర్వతాల మధ్య మా రథం నిర్నిరోధంగా సాగిపోయింది. ఈ మహా విష్ణువు రథం చూసి దేవతాగణాలన్నీ అక్కజపడి ప్రస్తుతించాయి. మొక్కులు చెల్లించాయి. అట్లా మేము పోగా పోగా వెలుగు ఏమైపోయిందో ఎటు పోయిందో తెలియదు. గాడాంధకారం, సాంద్ర నిశి మమ్ములను కమ్ముకుంది. అడుగు కదల్చటానికి వీలులేని రొంపిలో దిగబడిపోయినట్లైంది నా స్థితి. పెద్ద కొండ అడ్డగిస్తే ఎటు పోవాలో తెలియని పరిస్థితి నాకెదురైంది.

ఇంకా ఉంది