భక్తి కథలు

హరివంశం 171

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరదీపికలు విసిరేసి వాళ్ళు పారిపోయినారు. ఇది చూసి పౌండ్రుడు అట్టహాసంగా తన విజయం ప్రకటించుకున్నాడు. తన పక్షం వారిని కోటమీదికి పాకి యాదవుల యుద్ధ యంత్రాలను, బురుజులను విధ్వంసం చేసి కూల్చివేయవలసిందిగా పురికొల్పాడు. ఎవరికి ఏది కనపడితే దానిని దోచుకొన్నారు. స్ర్తిలను చెరచవలసిందిగా ప్రోత్సాహ వాక్యాలు పలికాడు. ధన సంచయాలను, వెలయాండ్రను వదలిపెట్టవద్దన్నాడు. ఎవడి చేతిలోనైనా ఆయుధం కనపడితే వాణ్ణి వెంటనే చంపివేయవలసిందిగా ప్రకటించాడు. వృష్ణికులమంటూ ఇక భూమిమీద ఉండకుండా నిశే్శషం చేయాలని బీరాలు పలికాడు.
అప్పుడు సాత్యకి ‘అయ్యో! నళిన దళాక్షుడు నాపైన సకల భారం మోసి నిశ్శశయంగా తపస్సుకు వెళ్ళాడే- ఆయనే నాకు ఏడుగడ, నా సైన్యం వాళ్ళు ఎందుకు బెదిరిపోతున్నారు? చెదరిపోతున్నారు అని తన సైన్యానికి ధైర్యం చెప్పి మహావీరులందరినీ నిలువరించి సింహనాదం చేసి, కోటలగ్గలు సాధిద్దామని పాకుతున్నా పౌండ్రుడి సేనలపై అనిలాస్త్రం ప్రయోగించగా పౌండ్రుడి సేనలన్నీ మహావాతూలానికి ఎండుటాకులు కొట్టుకొనిపోయినట్లు చెల్లాచెదరైనారు.
మళ్లీ కరదీపికా సహస్రంతో యాదవులు యుద్ధరంగాన నిలిచారు. సాత్యకి పౌండ్రుణ్ణి ముఖాముఖి ఎదుర్కొని ‘దొంగలాగా అర్థరాత్రి దండెత్తి వచ్చావు? నీవు క్షత్రియుడివేనా? నీచుడా?’ అని ఆక్షేపించాడు. పౌండ్రుడు కూడా సాత్యకినుద్దేశించి ‘నేను వస్తున్నాని మీ కృష్ణుడు పారిపోయి దాక్కున్నాడు కాబోలు! నీవు యుద్ధానికి వచ్చావు. నా పరాక్రమం ముందు నీవెంత? నీ రణ కౌశలమెంత? అని అహంకారపు గేలి పలుకులు పలికాడు. ఇంకా కృష్ణుణ్ణి ఉద్దేశించి ‘పసులను కావటానికి పోయినాడా?’ అని పరిహరించాడు. ‘మీ కృష్ణుడేం చేశాడు? స్ర్తివధ చేయలేదా?
ఆయన మహావీరుడా? ధనుకుడు, అరిష్టుడు, కేశి మొదలైన పశువులను చంపితే మీరంతా ఆయనను స్తుతిస్తున్నారు! మీరంతా క్షత్రియులు కాబోలు. నరకుడు నాకు ప్రియమిత్రుడు. అతణ్ణి చంపాడు కృష్ణుడు. ఆ పగ తీర్చుకోవటానికే నేనిప్పుడు వచ్చాను. పౌరుషముంటే నాతో తలపడాలి కాని, ఈ వ్యర్థాలాపాలెందుకు?’ అని వదిరాడు పౌండ్రుడు. ‘నిజానికి నీతో యుద్ధం చేయటం నాకు తలవంపులు కాదా?
పశుల మందను కాపాడుకుంటూ చల్ల చిలుకుకుంటూ, చల్లగా ఉండక నాతో యుద్ధానికి తలపడటం కూడానా నీ బతుకుకు! ఆ కృష్ణుడు వచ్చినపుడు నా బల పరాక్రమాటోపం చూపుతాను. నీవిప్పుడు నీ ఏలిక పక్షాన వచ్చావు. ముందు నిన్ను పరిమారుస్తాను’ అన్నాడు పౌండ్రుడు. సాత్యకి ఈ మాటలు విని చాలా ఆగ్రహించాడు. ‘ఓరి! తులువా! జగత్పతిని, త్రిభువనారాధితుణ్ణి నిందించే సాహసమా? నీవు కాచుకో అని పౌండ్రుణ్ణి శర పరంపరతో కప్పివేశాడు. అపుడు మహాభంకరమైన యుద్ధం వాళ్ళిద్దరిమధ్యా జరిగింది.
ఒకరి రథాలు మరొకరు కూల్చుకున్నారు. సారథులను చంపుకున్నారు. అపుడు ఇద్దరూ గదలు పూని ఎక్కటి కయ్యానికి పూనుకున్నారు. గదలు శిథిలమైపోగా ద్వందయుద్ధం చేశారు. కేశాకేశి కచా కచి బాహాబాహి పెనుగులాడారు. పిడికిళ్ళతో ఒకరినొకరు తాడించుకున్నారు.
ఈ ద్వంద్వ యద్ధాన్ని ఇరువాహులవారూ పోరు మాని ఆశ్చర్యంతో చూశారు. అపుడు ఇరుపక్షాల రథికులు అక్కడకు వచ్చి కోలాహలంగా ఇద్దరినీ రథారోహణం చేసి పోరాడవలసిందిగా గొప్ప సందడి సృష్టించారు. దానితో వాళ్ళు ద్వంద్వ యుద్ధం నిలిపి సన్నద్ధులై రావటానికి పోరు నిలిపారు.

ఇంకా ఉంది