భక్తి కథలు

హరివంశం - 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే తన ఉద్వేగం ఉపసంహరించుకొని మానుషాకారంతో నురగ వస్త్రాలతో అరుత నిండా ఆణిముత్యాల మణిహారాలతో తరంగ భుజ కంకణాలతో (కేయూరాలతో) నా ముందు ప్రత్యక్షమైనాడు. నా మన్ననలు వేడుకోవటానికి అట్లా వచ్చాడు. అప్పుడాయన ఒక గొప్ప రాజులాగా నాకు కనపడ్డాడు. ఇంతలో కాగల దేవ కార్యం నా మనసులో తళుక్కున స్ఫురించింది.
‘ఒక మహారాజుకుండే పరమోత్సాహతిశయంతో, రాజువంటి ఆకృతితో, మహాదధిరాజా! నీవిప్పుడు రాజదర్పం ప్రదర్శించావు. కాబట్టి భూలోకంలో గొప్ప రాజుగా పుడితే మేలు కదా! అది సమంజసం కదా’ అన్నాను. అంతేకాక, శాంతచిత్తుడివి కావయ్యా అని నేననగానే ఈ ఆకారం ధరించి నాకు కనపడ్డావు కాబట్టి శంతనుడనే పేరుతో నీవు పృథివిలో ప్రఖ్యాతి వహిస్తావు.
శాంతమైన తనుత్వం పొందావు కాబట్టి నీవు శంతనుడనే పేరుతో పుడమిపై జన్మిస్తావు. గంగాదేవి నీకు పత్ని కాబట్టి ఆమె కూడా భూలోకంలో నీకు భార్య అవుతుంది అనటంలో సముద్రరాజు భయపడిపోయినాడు. గంగాసహితుడై నాకు ప్రణమిల్లాడు. ‘పర్వదినాలలో నాకు ఉత్సాహం అతిశయిస్తుంది. ఆకాశంలో మేఘాలు వడివడిగా పరుగులిడుతుంటే గాలి చెలరేగినపుడు నా తరంగాలలో గొప్ప సంచలనం కలుగుతుంది.
అదీకాక పూర్ణచంద్రుడి దర్శనంతో నా మనసూ తనువూ ఉప్పొంగుతాయి. అందువల్ల అలలు ఉవ్వెత్తుగా ఉరవడిస్తాయి. ఈ లక్షణాలన్నీ నాకు ప్రకృతి సహజమైనవి. స్వభావ సముపేతమైనవి. అంతేకాని గర్వోద్రేక అవినయ ప్రవర్తన కాదు కదా దేవా! నీవెందుకు నాకీ శాపమిచ్చినట్లు? అని ఖిన్నుడైనాడు. ‘నీవు మా పట్ల ప్రసన్నుడవు కావల్సింది’ అని ప్రార్థించాడు. అపుడు నేను అతడితో ఇట్లా చెప్పాను. ఇది శాపం కాదు. లోకహితం కోసం నాకొక ఆలోచన మెదిలి ఈ విధంగా సంఘటించాను. అపోహపడవద్దు అని సముద్రుణ్ణి ఓదార్చాను. ఇలలో పరమ పవిత్రమైనది భరతఖండం. అంత పవిత్రమైనది భరత వంశం. నీవు ఆ భరత వంశంలో జన్మిస్తావు. ఇంకొక సంగతి కూడా ఉంది. వసిష్ఠ మహర్షి అష్టవసువులకు శాపం పెట్టాడు కదా! వాళ్ళు భూలోకంలో జన్మించవలసి వుంటుంది. వాళ్ళు గంగకు పుత్రులై పుడతామని ఆమెను వేడుకున్నారు. కాబట్టి జాహ్నవి నీకు ఇల్లాలవుతుంది.
ఆ వసువులు నీకు సంతానమవుతారు. ఇది అట్లా ఉంచి సత్యవతి అనే పరమ పుణ్యవతి నీకు భార్య అవుతుంది. ఆమెకు నీవల్ల ఇద్దరు కొడుకులు పుడతారు. నీవు మళ్లీ నీ నిజ ప్రకృతి పొందుతావు. ఇది దైవకార్యం అని చెప్పి సమ్మతింపజేశాను. ఆ తరువాత ఏం జరగబోతున్నదో వినండి. శంతనుడి కుమారుడైన విచిత్ర వీర్యుడికి ధృతరాష్ట్రుడు, పాండు రాజు అనే ఇద్దరు కుమారులు ప్రభవిస్తారు. ఇక పెద్దవాడికి నూరుగురు కొడుకులు.
చిన్నవాడికి ఐదుగురు కుమారులు జన్మిస్తారు. వీళ్ళమధ్య రాజ్యాధిపత్యం నిమిత్తంగా ఘోరాతి ఘోర కలహం సంభవిస్తుంది. ఆ ఘోర యుద్ధం యుగాంతానికి కారణమవుతుంది. ఈ మహా భయంకర యుద్ధంలో ఉర్విలో వున్న రాజులంతా ఆయా పక్షాలకు సాయపడి అందరూ నశిస్తారు. రోష భీకరమైన ఈ ప్రచండ యుద్ధంలో రాజులు ఒకరినొకరు చంపుకుంటారు.
ప్రబలమైన రాజ్యాలు నశించిపోతాయి. ఎక్కడ చూసినా పీనుగు పెంటలు కానవస్తాయి. ఏనుగులూ, గుర్రాలూ అధిక సంఖ్యలో క్షయమవుతాయి. నగరాలు, దుర్గాలు, రాష్ట్రాలు నిర్మానుష్యమైపోతాయి. భూభారమంతా తీరిపోతుంది. అంతటితో మూడో యుగం ముగిసిపోతుంది.
- ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు