భక్తి కథలు

హరివంశం 209

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు ఆయన ప్రజలు ఆయనను పరిత్యజించారు. పౌరజానపదులు ఆయనకు రాజార్హత లేకుండా చేశారు. ఆయన అడవులలో సంచరిస్తూ శౌనకుడనే మహామునిని ఆశ్రయించాడు. ఆ మహర్షి జనమేజయుణ్ణి కనికరించి అశ్వమేథం చేయించాడు. దానితో ఆయన పాపం పరిహారమైంది. మళ్ళీ రాజ్యం స్వీకరించాడు.
కాని ఆయన పాపచారి అయి అటవీ సంచారం చేస్తున్న రోజులలో యయాతి మహారాజుకు పూర్వమెప్పుడో ఇంద్రుడిచ్చిన దివ్యరథం, ఆ తరువాత పూరు వంశజులందరికీ దివ్యత్వం నిలిపిన ఆ రథం జనమేజయుడి దగ్గర ఉండటానికి ఇష్టపడక మళ్లీ స్వర్గలోకానికి వెళ్లిపోయింది.
ఆ తరువాత ఆ దివ్యరథాన్ని మహేంద్రుడు తన మిత్రుడైన చేది భూపతి ఉపరిచర వసువుకు కానుకగా ఇచ్చాడు. ఆయన ఆ రథాన్ని తన స్నేహితుడైన మగథ భూనాథుడు బృహద్రధుడికి ఇచ్చాడు. ఈ బృహద్రథుడి తర్వాత ఆయన కుమారుడైన జరాసంధుడికి ఈ తేరు సంక్రమించింది. ఈ జరాసంధుణ్ణి భీమసేనుడు పరిమార్చి ఈ దివ్య రథాన్ని వాసుదేవుడికి పసదనంగా ఇచ్చాడు భీముడు.
ఇది యయాతి మహారాజు వంశక్రమ చరిత్ర. యయాతి మహారాజు బహుకాలం రాజ్యం పరిపాలించాడు. ఆయన తన ఐదుగురు కొడుకులకు భూవలయాన్నంతా పంచిపెట్టి వాళ్ళకు స్వయంగా పట్ట్భాషేకం చేశాడు. పూర్వోత్తర ధరాతలానికి పెద్దకొడుకైన యదువునురాజుగా చేశాడాయన.
దక్షిణ పూర్వ భూభాగానికి తుర్యసుడి పట్టం కట్టాడు. పశ్చిమ, ఉత్తర భూభాగాలకు ద్రుహ్యుణ్ణి, అనుణ్ణి రాజులుగా చేశాడు. ఇక మధ్యమ భూభాగానికి తనకు అత్యంత ప్రియనందనుడైన పూరుడికి పట్టం కట్టాడు. ఈ విధంగా సకల రాజ్యం కొడుకులకిచ్చి తాను రాజ్యవహన భారం నుంచి విరతి చెందినా కామ సుఖకాంక్ష ఆయనను విడిచిపెట్టలేదు. అప్పుడాయన తన ఐదుగురు కొడుకులను తన దగ్గరకు పిలిపించుకొని తన వయోభారాన్ని ఎవరైనా తీసుకొని వాళ్ళ వ్వనాన్ని తనకు ఇవ్వవలసిందిగా అర్థించాడ. మొదటి నలుగురు అందుకు ఇష్టపడలేదు. తండ్రి అడగకుండానే తాను ఇస్తానని ముందుకు వచ్చాడు పూరుడు.
ఇందుకు యయాతి మహారాజు ఎంతో ఆనందించినా తండ్రిని నిరాదరించారని నలుగురు కొడుకులకు శాపమిచ్చాడు యయాతి మహారాజు. బహుకాలం తన పత్నులతో అభిమత సుఖాలు నిరంతరం అనుభవించాడు. ఇంద్రుడిచ్చిన రథంలో భూనభోంతరాలాలలో విహరించాడు. అయినా ఆయన కామసుఖవాంఛ ప్రసుప్తం కాలేదు. ఆయన గ్రహించాడు అది ఎన్నటికీ ఉడిగిపోయేదికాదని. అందువల్ల తన దగ్గరకు మళ్లీ పూరుణ్ణి పిలిపించుకొని ‘నాయనా నీ వ్వనం నీవు తీసకొని మళ్లీ నా ముదిమి నాకు ఇవ్వు’ అని కోరి తన ముసలితనం తాను తీసుకున్నాడు. ఆయన తన భోగానుభవంతో పెద్దకాలం జీవిత సుఖభోగాలు అనుభవించిన ఎరుకతో లోకానికి కొన్ని సూక్తులు తెలిపాడు.
‘తాబేలు తన అన్ని అవయవాలను ఎట్లా తనలోపలకి తీసుకుంటుందో అట్లా కామాన్ని తనలో అణచుకోగలవాడే ధన్యాత్ముడు. ఆనందఘనుడు. ఇతరులు కాలగతిని వేగిరపరచుకొంటారు.
ఈ ధరాతలంలోని పసిడి, పశువులు, భామలు తనను చేరినా ఎవడూ తృప్తిపడడు. తృష్ణ వర్జించినపుడే సుఖి అవుతాడు ఎవడైనా. భోగాలపట్ల విరక్తి పెంపొందించుకోవాలి, రక్తి పెంచుకోకూడదు. అధిక కామానుభవం కామతృప్తి కలుగుతుంది అనుకోవటం, అనటం మృషావాదం.

ఇంకా ఉంది