భక్తి కథలు

హరివంశం 214

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మపరిపాలన దేశంలో ఈయనవల్ల ప్రవర్తించేట్లు కూడా దత్తాత్రేయుడు ఈయనకు వరమిచ్చాడు. సకల భూమండలం ఏలుకోగల శక్తినీయుకు ఇచ్చాడు. ఈయన ఏడు దీవులను తన వశంలో ఉంచుకున్నాడు. ఏడునూర్ల యజ్ఞాలు చేశాడు.
ఈయన యజ్ఞాలవల్ల సంతుష్టుడై, పరితృప్తుడై నారద మహర్షి సకల దేవ సభలలో మునీంద్ర గోష్ఠులలో వేద విద్యలో, దాన పరతంత్రతలో, శౌర్య ధైర్య సాహస పరాక్రమాలలో, శమదమాలలో కార్తవీర్యార్జునుడికి సాటి రాగల సమ్రాట్టు మరి ఎవరూ లేరని కీర్తించాడు. పెక్కువేల ఏండ్లు ఈయన పరిపాలన చేసి పరశురాముడి గండ్రగొడ్డలికి ఎర అయినాడు.
కార్తవీర్యార్జునుడికి ఐదుగురు కొడుకులు. చివరి కొడుకు జయధ్వజుడు అవంతీశ్వరుడైనాడు. ఈయనకు తాలజంఘుడు పుట్టాడు. ఈయనకు చాలామంది పుత్రులు కలిగారు. ఇందులో వంశకరుడు వృషుడు. ఈయనకు మధువు అనే కుమారుడు జన్మించాడు.
మధువుకు వృష్ణి అనే కుమారుడు కలిగాడు. కాబట్టి ఈ వంశంవారు యదువును బట్టి యాదవులు, మధువువల్ల మాధవులు, వృష్ణివల్ల వృష్ణులు అనిపించుకున్నారు. ఇట్లా యయాతి ఐదుగురు కొడుకులు తామరతంపరగా వృద్ధి చెందాయి.
ఇక అఖిల జగత్ప్రభుడైన పురుషోత్తమ జన్మస్థానమైనది యదువు మూడో కుమారుడైన క్రోష్టుని వంశం. ఈ క్రోష్టుడి వంశంలో ఆయన మునిమనవడు శశిబిందుడు చాలా ప్రసిద్ధుడు. వంశాన్ని బాగా విస్తరింపజేసినవాడు.
ఈయన వంశంలోని వాడే అయిన రుక్మకవచుడు. రాజులందరినీ జయించటంవల్ల పరాజిత్తు అనే అన్వర్థ నామం పొందాడు. ఈ పరాజిత్తుకు ఐదుగురు కొడుకులు పుట్టారు. ఇందులో పాలితుడు, హరి అనేవాళ్లను తండ్రి తన యజ్ఞంలో మహాద్విజులకు దక్షిణగా సమర్పించాడు. పెద్దకొడుకులిద్దరు రాజ్యం చేశారు. మూడోవాడు జ్యామదుడు రాజ్యాన్ని ఇష్టపడక తన పత్ని శైబ్యతో తపస్సు చేయటానికి అరణ్యానికి పోయినాడు.
అయితే ఒక మహా తపస్సంపన్నుడైన ఋషి రాజులు పరిపాలన చేయడమే స్వధర్మం కాని, తపస్సు కాదు అని గట్టిగా బోధించాడు. అపుడు జ్యామదుడికి మనఃపరివర్తనం కలిగింది. కాని అన్నలకు వదిలేసి వచ్చిన రాజ్యంలో మళ్లీ తనకు భాగం కావాలని కోరటం ఆయనకు ఇష్టం లేకపోయింది. అపుడాయన ఋక్షవంత పర్వతం పాదభూమిలో ఉన్న శుక్తిమతి అనే నగరాన్ని విక్రమించి ఆక్రమించుకున్నాడు.
ఆ తరువాత తన రాజ్యాన్ని విస్తరించుకోవటానికి నర్మదా, మృత్తికావతి అనే నదీ తీర ప్రాంతాలను వశం చేసుకోవటానికి ఒక్కడిగానే రథస్థుడై వెళ్ళాడు. ఈ తీర ప్రాంతాలలోని రాజులందరూ ఈయనకు శరణాగతులైనారు. ఇట్లా ఈయన సాగించిన దండయాత్రలలో ఒక అడవిలో ఒక సౌందర్యవతిని చూశాడు.
ఆమె సతత బాష్పకపోల లలిత సుందరాకృతితో ఆయనకు కన్పించింది. నీకు వచ్చిన భయం ఏమీ లేదు అని ధైర్యం చెప్పి, ఆమె రాజకుమార్తె అనే విషయం తెలుసుకొని తాను సంతాన హీనుడు కాబట్టి ఈమెను వరించాలని అభిలషించి రథం ఎక్కించుకొని తన రాజధానికి వెళ్లి అంతఃపురంలో ప్రవేశించే సందర్భంగా పుట్టపు రాణి, ఆమె పరివారం ఆయనకు మంగళాక్షతలు చల్లి, మంగళహారతులు పట్టాలని సంసిద్ధులై వచ్చినపుడు రథంమీద ఆయన రాణి ఇంకా ఎవరో నవ వ్వనవతి ఉండటం చాసి ఆయనకు ఆక్షేపించింది.

ఇంకా ఉంది