భక్తి కథలు

హరివంశం 217

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరివల్ల ఆయనకు సంతానం కలిగింది. ఈ సంతానమంతా అధిక సంఖ్యాకమైంది. శ్రీకృష్ణుడి కుమారులలో చారుదేష్ణుడు, సాంబుడు ప్రసిద్ధికి వచ్చారు.
వృష్ణి కడగొట్టు కుమారుడు అనమిత్రుడు. ఈయన కొడుకు శిని. సత్యకుడీయన పుత్రుడు. సత్యకి కుమారుడే సాత్యకి. ఈయనకు యుయుధానుడనే పేరు ప్రసిద్ధం. ఈ వంశాన్ని శైనేయులని వ్యవహరిస్తూ వచ్చింది లోకం.
ఇక వృష్ణి రెండో భార్య అయిన మాద్రికి యుధాజిత్తు పెద్ద కొడుకు. యుధాజిత్తు మనవడు నిఘు్నడు. నిఘు్నడి కుమారులు ప్రసేనుడు, సత్రాజిత్తులు. ఈ సత్రాజిత్తు సూర్యోపాసకుడు. ఈ సత్రాజిత్తు మిమల చారిత్రం. సద్గుణ సౌశీల్యాలు మెచ్చి ఆదిత్యుడీయనతో మైత్రి పాటించాడు. ఈ సత్రాజిత్తు ఒకసారి సముద్ర తీరంలో నిలిచి పదకొండు రోజులు నియమ నిష్ఠలతో సూర్యుణ్ణి ఆరాధించాడు.
అపుడు సూర్యుడు సత్రాజిత్తుపట్ల ప్రసన్నుడైనాడు. అతడికేదైనా వరం ఇవ్వాలని ఆదిత్యుడికి కోరిక కలిగింది. ఆయన దివ్య ధీధితులతో సాకారుడై సత్రాజిత్తు సన్నిధికివచ్చాడు. సత్రాజిత్తు భక్తిప్రపత్తులతో భానుదేవుణ్ణి ప్రస్తుతించాడు. ఇంకా ఇట్లా అన్నాడు, ‘‘దేవా! నీవు గగనభాగంలో ఎట్లా దురాసదుడవై (తేరిచూడరాకుండా) సంచరిస్తావో, అట్లా నా దగ్గరకు వస్తే ఎట్లా? నేను కనుల తనివితీర దర్శించలేకుండా ఉన్నాను ప్రభూ! దిననాథా! నిన్ను చూడాలని నాకు ఉత్కంఠగా ఉన్నది. ఎట్లా దర్శించగలనో చెప్పు’’ అని అడిగాడు. అపుడు సూర్యుడికి నవ్వు వచ్చింది.
‘సత్రాజితా! నా కంఠభాగంలో ఒక మహారత్నం కంఠహారంలో వుంది. దానిని శ్యమంతకం అంటారు. దాని దివ్య ధీధితులవల్ల నీవు నన్ను కనులు విప్పి స్పష్టంగా కాంచలేకుండా ఉన్నావు. కాని నిజానికి చాలా సౌమ్యుడిగా, చల్లటివాడుగానే నేను నీ దగ్గరకు వచ్చాను. చూడు ఒక పని చేస్తాను. ఈ శ్యమంతకాన్ని నీమెడలో అలంకరిస్తాను. అపుడు నన్ను నీవు బాగా చూడగలవు అని తన కంఠ భూషణమైన ఆ శ్యమంతక రత్నాన్ని సత్రాజితి మెడలో అలంకరించి సూర్యదేవుడు తనను చూడమని అతణ్ణి కోరాడు. అపుడు సత్రాజితికి ఆశ్చర్యానందాలు ఉత్కంఠ ముప్పిరిగొన్నాయి. సూర్యమూర్తిని సత్రాజిత్తు కన్నుల పండువగా దర్శించుకోగలిగాడు. సూర్యుడు కూడా సంతోషపడి ఇప్పుడేమైనా ఒక వరం కోరుకో ఇస్తాను అని సత్రాజిత్తుకు ప్రియంగా చెప్పాడు.
సత్రాజిత్తు విభ్రమానంద పారవశ్యంతో ‘అట్లా అయితే నాకీ శ్యమంతకాన్ని ప్రసాదించండి’ అని ఆయనను కోరాడు. సరే! అయితే ఇస్తున్నాను అని చెప్పి ఆదిత్యుడతడికి ఇచ్చివేశాడు. అట్లా ఇచ్చి ఆదిత్యుడు అదృశ్యమైపోయినాడు. ఆ తరువాత సత్రాజిత్తు ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఆయనన చూసిన వాళ్ళందరికీ విస్మయ సమ్మోహ సంభ్రమ చకితులైనారు. కృష్ణుడి దగ్గరకు వారంతా పరుగులు తీశారు. ‘కమల దళాయతాక్షా! ఇపుడు సత్రాజిత్తు మిమ్మల్ని చూడటానికి వస్తున్నాడు. కాని అతడు అతడిలా లేడు. సూర్యుడే ఇలాతలానికి దిగి వచ్చి దేవర వారిని చూడటానికి వస్తున్నాడా? అన్నంతగా వెలిగిపోతున్నాడు. నిజానికి అతడు సూర్యుడే అయి ఉంటాడు అని చెప్పారు.
అప్పుడు కృష్ణుడు నవ్వి ‘ఆ వచ్చే అతడు సూర్యుడు కాడు. సూర్య వరప్రసాద లబ్ధుడైన సత్రాజిత్తు అని చెప్పాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. అయితే సత్రాజిత్తు కృష్ణుడి కొలువుకు వచ్చి ఆయనను దర్శించలేదు. సరాసరి తన ఇంటికి వెళ్ళాడు. ప్రతిరోజూ ఈ శ్యమంతకమణి సత్రాజిత్తుకు దాని మూల్యానికి ఎనిమిది రెట్లు విలువ చేసే సువర్ణమూ, రత్నాలు ఇస్తూ వచ్చింది. ఇది దాని ప్రభావం.

ఇంకా ఉంది