భక్తి కథలు

హరివంశం 219

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృత శరీరంపై సింహపు దెబ్బలు కన్పించాయి. పక్కనే చచ్చిపడి ఉన్న గుర్రం కనపడింది. దాని కళ్ళెం ప్రసేనుడి చేతిలోంచి జారిపోయిన విధం స్పష్టంగా కనపడింది. గద్దలు, రాబందులు చుట్టుప్రక్కల కనపడ్డాయి. అయితే అతడి శరీరంమీద శ్యమంతక రత్నం లేదు. కొంచెం దూరంలో ఒక సింహం చచ్చిపడి ఉంది. దాని పక్కన ఒక ఎలుగుబంటి పాదముద్రలు కన్పించాయి. మరి ఈ మణి ఏమైంది? దాని జాడ తెలుసుకోకుండా తాను మళ్లీ ద్వారకకు పోతే ఏం ప్రయోజనం? అని ఆ ఎలుగుబంటి అడుగుల జాడలను బట్టి పోయి, అక్కడ తనతో వచ్చిన సహచరులను నిలిపివేసి ఒంటరిగా ఆయన గుహలోకి వెళ్ళాడు. పోగా పోగా అక్కడ ఒక శిశువు, ఆ శిశువును బుజ్జగిస్తూ, ఆడిస్తూ, ముద్దుమాటలు చెపుతూ ఉన్న ఒక దాదిని కృష్ణుడు చూశాడు. ఆ దాది గారాబాలు కులికిస్తూ ఎందుకు ఇంకాకింక మానవు? నాయనా ఏడుపెందుకు? మీ తండ్రి ఆ సింహాన్ని ఒక్క పోటు పొడిచి, ఆ సింహం చంపినందువల్ల చచ్చిపడి ఉన్న ప్రసేనుణ్ణి ఈ సింహం చంపి ఈ మణిని లాక్కున్నదని గ్రహించి ఆ రత్నం తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు కదా! ఇటువంటి ప్రశస్తరత్నం చూసి కేరింతలు కొడుతూ ఆడుకోక ఈ వెక్కులెందుకయ్యా! అంటూ ఆ దాది ఆ శిశువును ఆడిస్తూ పలుకుతూ ఉండడం కూడా కృష్ణుడు చూశాడక్కడ. ఇంకా ముందుకు పోగా అక్కడ పట్టపగలు ప్రకాశంలాగా వెలుగులు విరజిమ్ముతున్న ఆ మణిని ఆయన చూశాడు. కృష్ణుణ్ణి చూసి ఆ దాది పెద్దగా కేకలు పెట్టి, ఆర్తనానాదాలు చేసింది. అపుడా గుహ అంతర్బిల మందిరంలో వున్న జాంబవంతుడక్కడకు పరుగు పరుగున వచ్చాడు. కృష్ణుణ్ణి ఒక బెడిదమైన పిడికిటి పోటు పొడిచాడు. కృష్ణుడు దానికి ప్రతిఘటంగా జాంబవంతుణ్ణి ఒక ముష్టి ప్రహరణంతో ఆ జాంబవంతుడికి కళ్లు తిరిగిపోయేలా చేశాడు. ఒకరికొకరు ఏమీ లొంగకుండా, వెనదీయకుండా ఇరవై ఒక్క రోజులు ఆహోరాత్రులు వారు బాహాబాహి పోరాడారు. మల్లచరపులు చరచుకున్నారు. కృష్ణుడితో వచ్చిన అనుచరులు ఆయన బయటకు వస్తాడేమోనని ఏడెనిమిది రోజులు వేచి ఉన్నారు. అయ్యో! కృష్ణుడికే కనక ఏ ఆపదా సంఘటించి ఉండకపోతే ఇన్ని రోజులెందుకాయన వచ్చి మనకు కనపడలేదు? ఆయన ఏదో గొప్ప ఆపదకు లోనై ఉంటాడు. ప్రాణాపాయానికి కూడా గురి అయి ఉంటాడు అని భయం, ఆందోళన, ఆరాటం, దుఃఖంతో పోయి ద్వారకలో అందరికీ చెప్పి ఆక్రోశించారు. ఆయనకు పరలోక విధులు, శ్రాద్ధ భోజనాలు కూడా నిర్వర్తించారు బంధువులు. ఇవన్నీ ఆ పరమేశ్వరుడికి నివేదితములై ఆయనకు ఆకలి దప్పులు సత్వ హాని లేకుండా చేశాయి.
ఇక జాంబవంతుడు ఇరవై ఒక్క రోజులు కూడు, నీళ్ళు లేక అలసి డస్సి, బలమంతా కరిగిపోయి, శ్రీకృష్ణుడి పిడికిటి పోట్లు భరించలేక ఆర్తుడై, ఆక్రందిస్తూ ఆయనను శరణు వేడుకున్నాడు. స్వామీ! ఎవరయ్యా నీవు! సుర గరుడోరగ యక్ష రాక్షస సిద్ధ సాధ్య గంధర్వ సహిత సకల దేవతలు, దానవులు నినె్నవరూ అతిక్రమించలేరు, నిలువరించలేరు, పోరాడలేరు నీతో అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది. నీ మహాసత్వం, దివ్య ప్రభావం చూస్తుంటే దేవదేవా! నీవు నా స్వామి శ్రీరామచంద్రుడి పునఃప్రభవావతారమనే శంక నాకు కలుగుతున్నది. మా వంటి తిర్యగ్జంతువులు నిన్ను ఎదుర్కోగలరా స్వామీ! అని జాంబవంతుడు శ్రీకృష్ణుడి పాదాక్రాంతుడైనాడు. తనను రక్షించవలసిందని చేతులు జోడించి వేడుకున్నాడు కృష్ణస్వామిని.
అపుడు స్వామి నవ్వుతూ తానెవరో జాంబవంతుడికి చెప్పాడు. తన అవతార కారణమేమిటో అతడికి విశదపరచాడు.

ఇంకా ఉంది