భక్తి కథలు

హరివంశం 221

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థరాత్రి గాఢ నిశి వేళ సత్రాజిత్తు గాఢ నిద్రలో వుండగా ఆయన ఇంటికి వెళ్ళి సత్రాజిత్తును హత్యచేశాడు శతధన్వుడు. అతడి దివ్యమానికాన్ని, అనర్ఘమైనదీ, సూర్యప్రసాద దత్తమైనదీ అయిన ఆ శ్యమంతక మణిని దోచుకొనిపోయినాడు.
తండ్రి ఇట్లా హత్యకు గురి అయినందుకు గోలుగోలున దుఃఖించింది సత్య. ఈ పరమఘాతుకం నారాయణుడికి తెలియజేయటానికి రథమెక్కి, అత్యంతం వడిగా ప్రయాణించగల గుర్రాలను దానికి పూన్చి వారణావతం వెళ్లి శ్రీకృష్ణుడిపై వాలిపోయింది సత్య. కృష్ణుడామెను ఎంతగానో ఓదార్చాడు. దుఃఖోపశమనం చేశాడు. ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టనని శపథ పూర్వకంగా చెప్పాడు. ఆఘమేఘాల మీద సత్యభామ సహితుడై ద్వారకకు చేరుకున్నాడు వాసుదేవుడు. వెంటనే బలరాముడితో సంప్రదించాడు. మనమిప్పుడు ఏమి చేయగలము అని. రహస్య సమాలోచనం జరిపాడాయనతో. శతధన్వుణ్ణి పరిమార్చి ఆ శ్యమంతకమణిని స్వాధీనం చేసుకోక తప్పదనీ, అదే ఇపుడు అవశ్యకర్తవ్యమనీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇది ఎట్లానో పసిగట్టి శతధన్వుడు గజ గజలాడిపోయినాడు. భయంతో అతడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. వెంటనే కృతవర్మ దగ్గరకు వెళ్లి తనకు అండగా ఉండవలసిందని కోరాడు. ‘అమ్మో! బలదేవుడితో, వాసుదేవుడితో విరోధమా? నేనెంతమాత్రం నీకు సాయపడలేను’ అని స్పష్టంగా చెప్పాడు శతధన్వుడికి కృతవర్మ. అప్పుడిక గుండె గుభేలుమంటూ ఉండగా అక్రూరుణ్ణి సాయమడగబోయాడు శతధన్వుడు. అపుడు అక్రూరుడు ‘హరి హరీ! కృష్ణుడి ఎర్ర సెరల కన్నులు నేను సహించగలనా? భరించగలనా? నేనాయన శరణు కోరేవాణ్ణి. బుద్ధి వక్రించి ఇదివరలో మీ మంతనాలలో ఒకటి రెండుసార్లు పాల్గొన్నాను. ఇంత దుస్సాహసానికి నేను ఒడిగట్టలేను. అసలు నా మనసు ఆవైపుకే పోనీయను. నీ ఇటువంటి ప్రయత్నాలన్నీ దుష్ఫలాలు, నిష్ఫలాలు అని శతధన్వుడికి చెప్పాడు అక్రూరుడు. అంతటితో శతధన్వుడికి ఏం జరగబోతున్నదో తెలియవచ్చింది. పిరికిదనంతో కూడిన తెగువ ఏర్పడింది. అప్పుడు అక్రూరుడితో అతడిట్లా చెప్పాడు. ఇపుడు నాకు బాగా అర్థమైంది. నాకు దిక్కూ మొక్కూ లేదని. నన్ను కాపాడే దక్షుడెవడూ లేడనీ నా చావు పట్టించుకొనేవాడెవడూ లేడని! ఏం చేస్తాను? ఇక ద్వారకా నగరంలో నేనుండను, ఉండలేను. అయితే ఒక చిన్న సహాయం మాత్రం నాకు చెయ్యి. ఏమంటే ఈ శ్యమంతకమణిని నీ దగ్గర భద్రంగా పరిరక్షించాలి. ప్రాణంపోయినా ఎవరికీ తెలియనీయవద్దు ఇది నీ దగ్గర ఉందని. నేను దాచి పెట్టి ఉంచానని, ఈ మాత్రమైనా సాయం చేయలేవా? అని జాలి కలిగేట్లు అక్రూరుణ్ణి శతధన్వుడు వేడుకున్నాడు. కాళ్ళా వేళ్ళా పడి అక్రూరుణ్ణి ఒప్పించాడు. ఆ శ్యమంతకమణిని అక్రూరుడి చేతికిచ్చి దండం పెట్టాడు శతధన్వుడు. ఇక ఆ మర్రోజు తెల తెలవారుతుండగానే పూర్వోత్తర దిశాముఖుడై గుర్రమెక్కి దానిని పరుగులు తీయించాడు. ఒక్క రోజులో శతయోజనాలు (ఎనిమిది వందల మైళ్ళు) పరుగు తీయగల గుర్రమది. దాని పేరు హృదయ. ఇక అడవుల్లో దూరుతూ, అసలు రథ్యను వదిలిపెట్టి గుండెలు తట తట అదురుతుండగా దానిని దౌడు తీయించాడు. ఈ విషయం కృష్ణుడికి తెలిసింది. బలరాముణ్ణి కూడా తోడు చేసుకుని ఒక దివ్య రథం ఎక్కి శతధన్వుడి వెంట పడ్డాడు కృష్ణుడు. ఆ భయందోళనలతో కూడిన తోలుడు వేగానికి తట్టుకోలేక కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి ఆ అశ్వం కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఇక భయం నిలువనీయలేదు శతధన్వుణ్ణి. గుండెలదరుతుండగా భయభ్రాంతితో ఆ భోజ వీరుడైన శతధన్వుడు పరుగులు పెట్టటం సాగించాడు.

ఇంకా ఉంది