భక్తి కథలు

హరివంశం 223

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలరాముణ్ణి ప్రేమాదర గౌరవ అభిమాన పురస్సరంగా మళ్లీ ద్వారకానగరానికి తీసుకొని వెళ్లారు.
ఇక ద్వారకలో బలరాముడు లేని రోజులలో ఒక విశేషం సంఘటించింది. అదేమంటే అక్రూరుడింట్లో రోజూ విందులే విందులు, కనీ వినీ ఎరుగని దాన ధర్మ కార్యాలు. మహా పురుష సత్కరాలు, మునిజన సమారాధనలు జరుగుతూ వచ్చాయి. శ్యమంతకమణి రోజూ ఆయనకు ప్రసాదిస్తున్న పసిడి రాశులు, నవరత్నాలు, మణిమాణిక్యాలు అక్రూరుడు స్వీయ భోగాలకు, విలాసాలకు ఎంతమాత్రం వినియోగించుకోకుండా దానధర్మాలు, యజ్ఞాలు, బంధు పూజనములు నిర్వర్తిస్తూ వచ్చాడు. ఆయనకు గొప్ప ‘దానపతి’ అని పేరు వచ్చింది. ఆయనింట్లో నిత్య యజనాలు జరిగాయి. దేవతారాధనలు సాగాయి. ఇట్లా అరవై రెండేళ్ళు కొనసాగింది. ద్వారకలో సర్వతోభద్రం వెల్లివిరిసింది. ఎవ్వరినీ రుజలు బాధించలేదు. సకాల వర్షాలు కురిసాయి. కరువు అనే మాట ఎరగనే ఎరగరు ద్వారకా నగర వాసులు. అనావృష్టి అంటే వాళ్ళకు అర్థం తెలియకుండా పోయింది. ఉగ్రసేనుడి రాజ్యమంతా కడుపులో చల్ల కదలకుండా సుఖించింది.
అయితే ఇది ఇట్లా జరుగుతుండగా భోజులలో కుటుంబ కలహం కలిగి గిట్టనివారు శత్రుఘు్నడనే యాదవుణ్ణి వాళ్ళ వాళ్లే చంపివేశారు. ఆ వంశంలో పెద్ద సంక్షోభం బయలుదేరింది. ద్వారకానగరం భోజ కుటుంబానికి సంబంధించినంత వరకు అట్టుడికిపోయింది. చుట్టాల మధ్య అక్రూరుడు ఒక్క రోజు కూడా ఉండలేకపోయినాడు. అందువల్ల ఆయన ఊరు విడిచి వెళ్లిపోయినాడు. ఎప్పుడైతే ఈ మహాత్ముడు ద్వారకానగరం విడిచిపోయినాడో అప్పుడిక ద్వారకానగరంలో చాలా కష్టాలనుభవించారు ప్రజలు. వివిధ రోగాలు అలముకున్నాయి. అనావృష్టి కలిగింది. అగ్నిప్రమాదాలు తరచైనాయి. చుట్టుపక్కల దవాగ్ని విజృంభించింది. వృష్ణి వంశస్థులంతా దిగాలు పడ్డారు. వాళ్ళలో వాళ్ళే ఈ ఉత్పాతాలకు కారణాలేమిటా? అని చర్చించుకోసాగారు. అపు డు వాసుదేవుడు వాళ్ళందరినీ సమావేశపరిచి, ఇదివరలో కనీ వినీ ఎరుగని పీడలు, అరిష్టాలు ఎందుకు మన దరి చేరాయి అని వితర్కిస్తుండగా, ఏమిటి నిమిత్తం అని నలుగురితోనూ ఆలోచిస్తుండగా నందకుడునే కులవృద్ధుడు లేచి ‘దేవా! నాకు ఒకటి స్ఫురిస్తున్నది. చెపుతాను విను అంటూ అక్రూరుడి తండ్రి శ్వఫల్గుడెక్కడ నివసిస్తాడో అక్కడ దుర్భిక్షం కాని, రోగ భయం కాని, ఈతి బాధలు కాని ఏవీ ఉండవు? అక్కడి ప్రజలు సర్వసుఖాలు అనుభవిస్తారు.
ఒక విషయం మీకు చెపుతాను వినండి. ఒకసారి కాశీరాజు దేశంలో గొప్ప కరువు వచ్చి, అనావృష్టితో ప్రజలు తల్లడిల్లుతుండగా వాళ్ళు వచ్చి మన శ్వఫల్గుణ్ణి ప్రార్థించి తమతో తీసుకుపోయినారు. ఆ తర్వాత వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినాయి. శ్వఫల్గుడి మహత్వం ఇంకొకటి కూడా చెపుతాను వినండి. కాశీరాజు ఇల్లాలు మహారాణి ఒకసారి చూలు ధరించి నెలలు నిండినా ఆమెకు ప్రసవం రాలేదు. ఇట్లా ఒక ఏడు కాదు, రెండేళ్ళు కాదు, పనె్నండేళ్ళు ఆ తల్లి గర్భభారం మోయాల్సి వచ్చింది. అపుడు కాశీరాజు భయభ్రాంతి చెందాడు.
విస్మయాకుల మనస్కుడైనాడు. ఆయన తీవ్ర ధ్యాన తత్పరుడై తల్లి గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకొని ‘తల్లీ! మీ తల్లికి ఇంత క్లేశం ఎందుకు కలగజేస్తున్నావు? మా అందరికీ ఇంత ఆందోళన ఎందుకు తెచ్చి పెడుతున్నావమ్మా! నీ ముద్దు మొగం చూడాలని నేను కొండంత ఆశతో ఉన్నాను కదా! అని ఆ శిశువును ప్రార్థించాడు. నిన్ను చూసి నేను కృతార్థుణ్ణి అవుతానే అమ్మా! అని వేడుకున్నాడు.

ఇంకా ఉంది