భక్తి కథలు

హరివంశం 224

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు తల్లి కడుపులో ఉన్న ఆ నిసుగు ఆయన వింటుండగా ఇట్లా పలికింది. తండ్రీ! నే చెప్పేది విను. రోజూ నీవు మూడు సంవత్సరాలపాటు పాత్రుడైన సద్బ్రాహ్మణుడికి గోదానం చెయ్యి. అపుడు నేను జన్మిస్తాను’ అని చెప్పింది. ‘తల్లీ! నీవు చెప్పినట్లే చేస్తాను’ అని ఆమె సూచించిన అనుష్టానాన్ని విధి యుక్తంగా నిర్వహించాడు కాశీరాజు. అన్నట్లుగానే ఆమె జన్మించింది. గోదాన మహిమవల్ల ఆమె పుట్టింది కాబట్టి ఆమెకు ‘గాందిని’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు కాశీరాజు దంపతులు. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. పెండ్లీడు వచ్చింది. కాశీరాజ్యం కరువుతో కొట్టుమిట్టాడుతున్నపుడు పరమోపకారం చేశాడు కాబట్టి మహాత్ముడైన శ్వఫల్గుడికే ఆ కన్యనిచ్చి పెళ్లిచేశాడు కాశీరాజు. ఇటువంటి తల్లిదండ్రులకు కదా జన్మించాడు మన అక్రూరుడు. ఆయనకు తన తండ్రి ప్రభావం సంక్రమించదా? అక్రూరుడు అసాధారణ మహిమానుభావుడు. ఆయన ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి పోగానే మనకీ అరిష్టాలన్నీ చుట్టుకున్నాయి అని తోస్తున్నది అని ఆ నందకుడు సభవారికి చెప్పాడు. అపుడు ఉగ్రసేన మహారాజు అకూరుడు ఎక్కడ ఉన్నాడో వెదకి ద్వారకానగరానికి వచ్చే ఏర్పాటు చేశాడు? అక్రూరుడిరహస్య గోపనం కృష్ణుడికి తెలుసు. కాని అతడు తన భక్తుడు. అతణ్ణి కొలువుకు పిలిపించి అతడి రహస్యం వెల్లడించటం కృష్ణుడికి ఇష్టం లేకపోయింది. అక్రూరుడు తండ్రి అంతటి గొప్ప ప్రభావ సంపన్నుడు. ఆయన ఇంత దాన ధర్మాలు, యజ్ఞాలు చేయటానికీ, ద్వారకానగర ప్రజలు సుఖంగా ఉండటానికీ ఆయన దగ్గర ఉన్న శ్యమంతక రత్నమే కారణమని నాకు తెలియకపోలేదు. ప్రతిరోజూ యజ్ఞం ఎట్లా చేస్తున్నాడు అక్రూరుడు. అని సమస్త యదువృష్ణి ప్రముఖులందరినీ సమావేశపరిచి అక్రూరుడితో ఏదో పని ఉండి పిలిపించినట్లు పిలిపించాడు కృష్ణుడు. అతడితో సరస సల్లాపంగా ఇష్టాగోష్టిగా ఆయనకు చాలా సంతోషం కలిగేట్లు మాట్లాడాడు కృష్ణుడు. ‘దానపతీ’ అని సంబోధించి ఉబ్బిపోయేట్లు చేశాడు. ఆ తరువాత అసలు విషయం బయటపెట్టాడు.
‘ఏమయ్యా! అక్రూరుడా! శతధన్వుడు నీ దగ్గర శ్యమంతకమణి దాచిపెట్టమని ఇచ్చాడు కదూ! నీవు గోప్యంగా దానితో పని గడుపుకుంటూ గొప్ప గొప్ప దాన ధర్మాలు, యజన యాజనాదులు నిర్వహిస్తున్నావు. పోనీ లోకానికి మేలు చేస్తున్నావు కదా! అని నేను పట్టించుకోలేదు. నాకు కూడా చాలా సంతోషమే అనిపించింది.

ఇంకా ఉంది