మెయన్ ఫీచర్

వనరుల కొరతే సంఘర్షణలకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవాళి ప్రస్తుతం అవరోహణ పథంలో పయనిస్తోంది. దాదాపు రెండు శతాబ్దాలుగా విచ్చలవిడి శిలాజ ఇంధన వినియోగం ప్రకృతిలోని విభిన్న జీవరాశులను, జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. నేలలో సారాన్ని దెబ్బతీసింది, నీటిని కాలుష్యమయం చేయడమే కాదు, నీటి పరిమాణం కూడా దారుణంగా పడిపోయేలా చేసింది. మొత్తంగా చెప్పాలంటే మొత్తం పర్యావరణ వ్యవస్థనే పూర్తిగా దెబ్బతీసింది. ఐదు వందల ఏళ్లపాటు నిర్విరామంగా సాగిన వలసవాదం వివిధ సంస్కృతులను, భాషలను, ప్రజలను పూర్తిగా కనుమరుగు చేయడమే కాదు ఉత్పత్తి, పరిపాలన సజావుగా సాగడానికి హింసను ఆశ్రయించే సంప్రదాయాన్ని మిగిల్చింది.
ఒక సంఘర్షణను ఏవిధంగా ఎదుర్కొనాలన్న అంశంపై మన చర్చలు, ఆలోచనా పథంలో, నవంబర్ 13 నాటి ప్యారిస్ దాడు లు హింస చెలరేగడం అనేది చొచ్చుకువచ్చింది. ఈ భూమిపై పర్యావరణ సంక్షోభానికి, ప్రపంచ సాంస్కృతిక సంక్షోభానికి ప్యారిస్ కేంద్రస్థానంగా నిలిచింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు ప్యారిస్‌లో పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కింద సదస్సు-సీఓపి21- జరుగుతోంది. ఈ సీఓపీ21 కేవలం వాతావరణ మార్పుపై మాత్రమే కాదు. ఈ ధరిత్రిపై జీవరాశి మనుగడకు ఆధారభూతమైన జీవావరణ వ్యవస్థను మన ఉత్పత్తులు, వినిమయాలు ఏవిధంగా ధ్వంసం చేస్తున్నాయనే అంశంపై కూడా చర్చించడానికి ఏర్పాటైన సదస్సు.
నవంబర్ 13 నాటి సంఘటనలకు, మానవ చరిత్రలో శిలాజ ఇంధన యుగం పర్యావరణానికి చేసిన భయంకరమైన హానికి మధ్య లోతైన అవినాభావ సంబం ధం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న విధానమే పర్యావరణ మార్పునకు, ప్రజల్లో పెరిగే హింసాప్రవృత్తికి కారణభూతమవుతోంది. ఈ రెండూ కూడా ఈ ధరిత్రికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాట ఫలితాలే. పారిశ్రామిక వ్యవసాయం అనేది పెద్ద ఎత్తున శిలాజ ఇంధన వాడకంతో కూడి ఉన్నటువంటిది. దాదాపు 40 శాతం గ్రీన్‌హౌజ్ వాయువులు (కార్బన్ డైయాక్సైడ్) విడుదల కావడానికి ఇది దోహదం చేస్తోంది. ఫలితం పర్యావరణ మార్పు. ప్రపంచీకరించిన ఆహార వ్యవస్థతోపాటు, భూతాపం పెరుగుదలలో కనీసం 50 శాతం వాటా కేవలం పారిశ్రామిక వ్యవసాయానిదే నంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
సింథటిక్ నైట్రోజన్ ఎరువులు కేవలం శిలాజ ఇంధనాలపై ఆధారపడి తయారుచేసినటువంటివి. అదేవిధంగా పేలుడు పదార్ధాలు, మందుగుండు సామగ్రి తయారీలో కూడా సింథటిక్ ఎరువుల తయారీలో అనుసరించిన రసాయనిక విధానాలనే అమలుపరుస్తారు. ఒక కిలో నత్రజని ఎరువును తయారు చేయడానికి రెండు లీటర్ల డీజిల్ మండిస్తే ఎంత శక్తి ఉత్పన్నమవుతుందో అంత శక్తి అవసరం. రసాయన ఎరువుల తయారీలో 2000 సంవత్సరంలో 191 బిలియన్ లీటర్ల డీజిల్ ఉపయోగించగా, 2030 నాటికి ఇది 277 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. సింథటిక్ ఎరువులు పారిశ్రామిక వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఇదే వాతావరణ మార్పుకు ప్రధాన దోహదకారి అవుతోంది. క్షేత్రంలో పనిచేయడానికి ముందు ఈ ఎరువులు మన భూగ్రహానికి విపరీతమైన హాని చేస్తాయి. అయినప్పటికీ సింథటిక్ ఎరువులు మాత్రమే మనకు ఆహారం అందడానికి కారణమని, అవి లేకతోతే కరువుతో ఇబ్బందులు పడక తప్పదన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటారు. ఇక రసాయన ఎరువుల కంపెనీలైతే ‘మేం గాలి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాం’ అంటూ ఘనంగా చెప్పుకుంటాయి.
నత్రజనిని భూమికి, మొక్కలకు అందించే అనేక అహింసాత్మక, ప్రభావయుత విధానాలను ప్రకృతి, మానవులు కనుగొని ఉన్నారు. ఉదాహణకు పుప్పు్ధన్యాలు, బీన్స్ మొక్కలు నత్రజనిని భూమిలో స్థాపితం చేస్తాయి. ఈ మొక్కల వేళ్లపై ఉండే బుడిపెలపై రైజోబియం బ్యాక్టీరియా ఆవాసం ఏర్పరచుకొని, వాతావరణంలోని నైట్రోజన్‌ను, అమోనియాగా ఆ తర్వాత సేంద్రీయ పదార్ధాలుగా మరుస్తాయి. ఈ పదార్ధాలను మొక్కలు తమ పెరుగుదలకోసం ఉపయోగించుకుంటాయి. కాయధాన్యాలు, తృణధాన్యాలను అంతర పంటలుగాను లేదా మార్పిడి పంటలుగాను వేయడం అనేది పురాతన కాలం నుంచి మనదేశంలో అనుసరిస్తున్న సంప్రదాయం. ఇదే సమయంలో మనం వాడే ఆకుపచ్చని ఎరువు కూడా భూమిలో నత్రజనిని స్థాపితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆవిధంగా సేంద్రీయ పదార్ధం స్థాపితం కావడం వల్ల, భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. అందువల్లనే సేంద్రీయ వ్యవసాయంలో మనం సాగుచేసే పంటను బట్టి భూమిలో నత్రజని 44 నుంచి 144 శాతం వరకు వృద్ధి చెందుతుంది. పారిశ్రామిక వ్యవసాయంలో మాదిరిగా కాకుండా సేంద్రీయ వ్యవసాయం గాలిలోని కార్బన్‌ను కిరణజన్య సంయోగక్రియ ద్వారా మార్పు చేసి భమిలో దాని పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా భూసారం భాగా పెరిగి అధిక ఆహారోత్పత్తికి దోహదం చేయగలదు. అంతేకాదు ఆవిధంగా ఉత్పత్తి అయిన ఆహారం అత్యధిక పోషక విలువలతో కూడి ఉంటుంది. ఫలితంగా ఏవిధమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే సానుకూల పర్యా వరణ మార్పు సాధ్యమవుతుంది.
హరితవిప్లవం పేరుతో శిలాజ ఇంధనాలపై ఆధారపడే పర్యావరణ పరంగా అస్థిర వ్యవసాయ నమూనాలను ‘మద్దతు’ మరియు ‘అభివృద్ధి’ పేరిట మనపై ప్రభుత్వాలు రుద్దుతున్నాయి. నేల, నీరు ధ్వంసమైపోయాక, పర్యావరణ వ్యవస్థ ఉత్పత్తి చేసే ఆహారం మరియు మద్దతుగా నిలిచే జీవనోపాయాలు ఎంతోకాలం సమాజాన్ని సుస్థిరంగా ఉంచజాలవు. ఫలితంగా ఆగ్ర హం, అసమ్మతి, నిరసనలు, సంఘర్షణలు చోటు చేసుకోవడం అత్యంత సహజం. అయినప్పటికీ భూమి, నీరు, వ్యవసాయ సంబంధ సంఘర్షణలు పదేపదే ఉద్దేశపూర్వకంగా మత వివాదాలుగా మార్పు చెంది, క్రమంగా సైనికీకృత వ్యవసాయ నమూనాను పరిరక్షించే విధంగా రూపొందుతాయి. ఇది క్రమంగా భూమి, ప్రజలకు వ్యతిరేకంగా చేపట్టే ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది.
ఈ పరిస్థితిని నా పుస్తకం కోసం పరిశోధన జరుపుతుండగా పంజాబ్‌లో ప్రత్యక్షంగా చూశాను. 1984లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ‘‘ది వాయిలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్’’ పేరుతో పుస్తకాన్ని రాశాను. భూసారం క్షీణించడం, నీటి సంక్షోభం కారణంగా చోటు చేసుకుంటున్న ఘర్షణలకు మత ఘర్షణల రంగు పులుముతుండటాన్ని నేడు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అస్థిర వ్యవసాయ పద్ధతులవల్లనే ఈ ఘర్షణలు తలెత్తుతున్నాయన్న సంగతి మరువకూడదు. 2009 నుంచి మనం బోకొహరాం ఉగ్రవాద సంస్థపేరు వింటున్నాం. ఇదే సమయంలో మనకు తెలియని అంశమేమంటే ‘్ఛద్ సరస్సు’ అదృశ్యమైపోవడం. ఛాద్ సరస్సు నైజీరియా, ఛాద్, కామెరూన్, నైజిర్ దేశాలకు చెందిన 30 మిలియన్ ప్రజల జీవనాధారంగా ఉండేది. అయితే 1983 నుంచి 1994 మధ్యకాలంలో ఈ దేశాల్లో పారిశ్రామిక వ్యవసాయం నాలుగురెట్లు పెరిగింది. ఆనకట్టల నిర్మాణం, తీవ్రస్థాయిలో పారిశ్రామిక వ్యవసాయం కోసం విపరీతంగా నీటివాడకం వల్ల యాభై శాతం ఛాద్ సరస్సు అదృశ్యమైపోయింది. ఎప్పుడైతే నీరు అదృశ్యమైపోయిందో ఇక తరిగిపోతున్న నీటి వనరులకోసం పశువుల కాపర్లుగా ఉన్న ముస్లింలు, సుస్థిర వ్యవసాయం చేస్తున్న క్రైస్తవ రైతుల మధ్య ఘర్షణ ఏర్పడి చివరికి అశాంతికి దారితీసింది.
ఎడారిని అరికట్టడానికి సంబంధించిన యుఎన్ కనె్వన్షన్ మాజీ ప్రధాన కార్యదర్శి ల్యూక్ నాకడ్జా నైజీరియాలో ప్రస్తుతం నెలకొన్న హింసాత్మకతకు కారణాన్ని ఈవిధంగా వివరిస్తున్నారు. ‘‘మతయుద్ధంగా ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న నైజీరియా సంఘర్షణలు వాస్తవానికి ముఖ్యమైన వనరులపై ఆధిపత్యానికి జరుగుతున్న పోరాటం మాత్రమే.’’
సిరియా కథ కూడా దీనికి భిన్నమేం కాదు. 2009లో దేశంలో తీవ్రస్థాయిలో కరువు సంభవించింది. దీంతో లక్షలమంది రైతులు జీవనాధారం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో జీవిక కోసం పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు విధించిన నిబంధనల చట్రంలోని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వాణిజ్య నిబంధనలు సిరియా ప్రభుత్వం తమ దేశ రైతులను ఆదుకోవడానికి వీల్లేకుండా చేశాయి. దీంతో రైతుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. 2011 నాటికి ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు సిరియాలోకి ప్రవేశించాయి. తమ ఆయుధాలను అమ్ముకోవడం ద్వారా సంఘర్షణకు అసలు కారణమైన భూమి, రైతులను మతం వైపునకు మరలించాయి. నేడు సిరియాలోని సగం ప్రాంతం పునరావాస శిబిరాలతోనే నిండిపోయింది. అంతర్యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడమే కాదు, మతం పేరుతో హింస చాలా చరుగ్గా కొనసాగుతోంది.
జైక్లోన్-బి అనే విషవాయువును కనుగొన్న హబర్ అనే శాస్తవ్త్రేకు రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇదే వాయువును ప్రయోగించి 1915లో నాజీలు లక్షలాది యూదులను పొట్టన పెట్టుకున్నారు. అమెరికాకు చెందిన జీవశాస్తవ్రేత్త నార్మన్ బోర్లోగ్‌కు కూడా నోబెల్ బహుమతి లభించింది. ఆయన ప్రవేశపెట్టిందే రసాయన ఆధారిత హరిత విప్లవం! మరి నేడు దాని పుణ్యమాని హింసా సంప్రదాయం కొనసాగుతోంది. నావరకు నాకు సీఓపి-21 అనేది కేవలం శాంతికోసం జరిపే ‘తీర్థయాత్ర’ వంటిది. భూమి, ప్రజలకు వ్యతిరేకంగా నిర్వహించే యుద్ధం బారిన పడిన అమాయక బాధితులను గుర్తు చేసుకునేందుకు, తెగలు, మతాల పేరిట మనం విడిపోవద్దని, మనమంతా ఒక్కటేనన్న దృఢమైన భావన కలిగేందుకు, మనల్ని మింగేస్తున్న పర్యావరణ విధ్వంసం, పెరుగుతున్న హింస మరియు యుద్ధాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంనేందుకు మాత్రమే ఈ సదస్సు ఉపయోగపడుతుంది. అయితే ఒక్కటి మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. భూమితో మనం శాంతిని కుదుర్చుకొనకపోతే, ప్రజల మధ్య శాంతి సాధ్యం కాదు. (చిత్రం) ఛాద్ సరస్సు నైజీరియా, ఛాద్, కామెరూన్, నైజిర్ దేశాలకు చెందిన 30 మిలియన్ ప్రజల జీవనాధారంగా ఉండేది. పారిశ్రామిక వ్యవసాయం పుణ్యమాని ఇది ఎండిపోతోంది. తరిగిపోతున్న ఈ నీటి వనరుపై ప్రారంభమైన సంఘర్షణలు క్రమంగా బొకొహరాం ఆవిర్భావానికి దారితీశాయ.

- వందనా శివ