రంగారెడ్డి

వణికిస్తున్న విష జ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 31: హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపంలో ఉన్న పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలో విష జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, అపరిశుభ్రత, విజృంభిస్తున్న దోమలతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి పక్కన నల్లచెరువు, గూడెం చెరువు మధ్యలో అస్తవ్యస్తమైన భూగర్భ డ్రైనేజీ, కలుషితమైన తాగునీటి వంటి సమస్యల వలయంలో చిక్కుకుని దుర్భర జీవనం గడుపుతున్న పురపాలక సంఘం ప్రజలు విష జ్వరాలతో వణుకుతూ ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొంతమందికి డెంగీ లక్షణాలు కన్పించడంతో భయాందోళన చెందుతున్నారు. గడిచిన పది రోజులుగా వందలాది మంది విష జ్వరాల పాలయ్యారు. పరిసర ప్రాంతాలలోని చిన్నది మొదలు పెద్దాసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పురపాలక సంఘం పరిధిలోని పీర్జాదిగూడ మల్లిఖార్జున్‌నగర్, బుద్ధానగర్, కెనరానగర్, పాతబస్తీ, హనుమాన్‌నగర్, అన్నపూర్ణకాలనీ, ఆర్టీసికాలనీ, బండి సత్తయ్య కాలనీ, పర్వతాపూర్, మేడిపల్లిలోని అనేక కాలనీ ప్రజలు విష జ్వరాలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే ఇద్దరు డెంగీతో మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు డెంగీ లక్షణాలు కన్పించడంతో లక్షలు వెచ్చించి మెరుగైన చికిత్సలు చేయించుకుంటున్నారు. మల్లిఖార్జున్‌నగర్‌లోని ఒకే కుటుంబంలో ఐదుగురు విష జ్వరాలతో ఆసుపత్రిపాలై ఆరోగ్యంతో బతికి బయటపడ్డారు. వీరిలో భార్యాభర్తలు దర్గ బాలమణి, దర్గ సత్తిరెడ్డి మాజీ సర్పంచ్ ఉన్నారు. ఎందరో బాధితులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అపరిశుభ్రతకు నిలయమైన పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలో పరిశుభ్రత, దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో అయితే దోమలు పట్టి పీడిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు చెరువుల మధ్య ఉన్న గూడెంలోని అన్ని కాలనీలలో పరిశుభ్రతపై, యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తూ దోమల నివారణ కోసం నిత్యం ఫాగింగ్ చేసి ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.పీర్జాదిగూడలో కాలనీలవారిగా ఆరోగ్య వైద్య శిబిరాలను తరుచూ నిర్వహించి విషజ్వరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లక్ష జనాభా ఉన్న గూడెం పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి లేక ప్రైవేటు ఆసుపత్రులలో అధికంగా డబ్బులు చెల్లించలేక వైద్యం చేసుకోలేని నిరుపేదలు ఎందరో ఉన్నారు. అధికారులు అప్రమత్తమై బస్తీలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి రోగాలు రాకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

బాలికల గురుకుల పాఠశాలను తరలించొద్దు
వికారాబాద్, అక్టోబర్ 31: వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం ఎనె్నపల్లి సంగం లక్ష్మిబాయి బాలికల గురుకుల పాఠశాలను తరలిస్తే ఊరుకునేది లేదని విద్యార్థినుల తల్లిండ్రులు హెచ్చరించారు. సోమవారం పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీతో చేరుకుని, ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ సురేష్‌పొద్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పట్టణ పరిధిలోని ఎనె్నపల్లి గురుకుల పాఠశాలను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రి మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌లు దివ్య.. పాఠశాలను పరిశీలించి జిల్లా కలెక్టరేట్, కార్యాలయాలు ఇర్మించాలని నిర్ణయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పిల్లల బడిని కలెక్టరేట్‌గా మార్చడానికి తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. విద్యార్థినులకు భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. పక్కనే జిల్లా పోలీసు కార్యాలయం ఉండటంతో బాలికలు భద్రంగా ఉన్నారనే ధైర్యంతో ఉన్నామని పేర్కొన్నారు. పాఠశాలను తరలించేందుకు ప్రయత్నిస్తే పూర్వవిద్యార్థులను కలుపుకుని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఓ పక్క ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తామని ప్రకటించి పాఠశాలను తరలించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులు నర్సింలు, మహేందర్, రాములు, గోవర్ధన్, రుక్మయ్య, సత్తయ్య, శేఖర్, అంజయ్య పాల్గొన్నారు.

దీపావళి పండుగలో అపశ్రుతి

నార్సింగి, అక్టోబర్ 31: దీపావళి పండుగ రోజున టపాసులు కాలుస్తుండగా ప్రమాదవ శాత్తు పేలి ఆపశ్రుతి చోటుచేసుకుంది. నగరంలో కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలను నుంచి కూడా సరోజినిదేవి కంటి ఆసుపత్రికి వచ్చి చికిత్సలు నిర్వహించుకున్నారు. దీపావళి పండుగ రోజున రాత్రి కొందరికి జీవితాలలో చీకటిమయం చేసిందని బాధితులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. దీపావళి పండుగ పురస్కారించుకుని టపాసులు కాల్చడంతో ప్రమాదవశాత్తు కంటికి గాయాలైయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం నగరంలోని సరోజిని దేవి కంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్సలు నిర్వహించుకుంటున్నారు. కంట్లో నిప్పురవ్వలు పడటంతో కంటి చూపూలు పోయ్యాయని, కొందరికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్య సిబ్బంది ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నారు. దీపావళి పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా అదివారం జరుపుకున్నారు. టపాసులు కాల్చుతుండగా ప్రమాదవ శాత్తు పేలి కొందరికి కంట్లో కాలిన గాయాలైయ్యాయి. టపాసులు కాల్చుతుండగా దారికుండా పోతున్న వారికి కళ్లలలో కూడా నిప్పురవ్వలు వచ్చి పడి గాయాలైయ్యాన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కంటి గాయాలతో మెహిదీపట్నం సరోజిని దేవి కంటి ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యులు కంటి వైద్యం నిర్వహిస్తున్నాట్లు ఆర్‌ఎంవో-02 రాథోడ్ తెలిపారు. ఆదివారం రాత్రి టపాసులు కాల్చుతున్న వారిలో ఎక్కువగా నిప్పురవ్వలు పడి కళ్లకు తీవ్ర గాయాలైయ్యయి. అయితే వీరి పరిస్థితి ప్రమాద స్థాయిగా ఉందని మరో రెండు రోజులు గడిస్తే గాని, తము ఏమి చెప్పలేమని డాక్టర్లు పేర్కొన్నారు. ఆదివారం అర్ధారాత్రి వరకు కళ్ల్లలో గాయాలైన ఐదుగురు ఆసుపత్రికి వచ్చారని వారికి అప్పటినుంచి చికిత్సలు నిర్వహిస్తున్నాట్లు డాక్టర్లు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు మరో 18మంది చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి వచ్చినట్లు ఆర్‌ఎంవో రాథోడ్ పేర్కొన్నారు. ఇందులో 18మంది ఓపి చికిత్సలు నిర్వహించిన తర్వాత వారు ఇంటికి వెళ్లిపోయ్యారని కొన్ని రోజుల పాటు చికిత్సలు నిర్వహిస్తే వారికి ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. కళ్ల్లలో ప్రథమిక చికిత్సలు నిర్వహించి, వారికి ఎప్పటికప్పుడు ఎలా మందులు వాడాలని డాక్టర్లు సూచించారని తెలిపారు. చికిత్స కోసం వచ్చిన వారు నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చారని పేర్కొన్నారు. ఇందులో చిన్నారులతో పాటు యువకులు కూడా ఉన్నారు. కాగా నగరంలో వారసిగూడ ప్రాంతానికి చెందిన శివ (14), పాతబస్తీకి ప్రాంతానికి చెందిన భరత్‌కుమార్ (17), మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్‌గౌడ్ (34), సన్‌దీప్ (11), వరంగల్ జిల్లాకు చెందిన గణేష్ (11) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం ఇద్దరికి ఆపరేషన్లు చేసి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా చిచ్చుబుడ్డిలు, సూతిలిబంబులు కాలుస్తు ఉండగా ప్రమాదవ శాత్తు అవి పేలాయని, కంటిలో నిప్పు రవ్వలు వచ్చి పడ్డాయని బాధితులు తెలిపినట్లు ఆర్‌ఎంవో తెలిపారు. టపాకాయలు కాల్చి కంటికి గాయాలైన వారికోసం ప్రత్యేక ఆసుపత్రిలో డాక్టర్లును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొందరికి స్వల్పంగా గాయాలైన వారికి చిన్నా పాటి చికిత్స చేసి అప్పటికప్పుడే చికిత్సలు నిర్వహించి ఇంటికి పంపించినట్లు తెలిపారు. చికిత్స కోసం వచ్చిన వారిలో ఎక్కువ మందిలో చిన్నారులు కూడా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. టపాసులను చిన్నారులు కాల్చినప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని డాక్టర్లు సూచించారు.

కరడుగట్టిన నేరస్థునిపై పిడి యాక్ట్
ఘట్‌కేసర్, అక్టోబర్ 31: సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగాల ఆశ చూపి 30 మంది యువతులను నిర్మానుష ప్రాంతాలకు తీసుకువెళ్లి దోపిడీలకు పాల్పడిన ఓ కరడుగట్టిన నేరస్థున్ని పిడి యాక్ట్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర