రంగారెడ్డి

31లోపు సిసి రోడ్ల పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, మార్చి 4:రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన సిసి రోడ్ల పనులు ఈనెల 31లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఒఎస్‌డిలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్విహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు మంజూరై చేపట్టిన సిసి రోడ్ల పనులు వేగవంతం చేసి మార్చి 31 తారీఖులోపు పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ ఇఇలను, డిఇలను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు మంజూరైన పనుల వివరాలు వచ్చే సోమవారం వరకు సమర్పించాలని ఇఇలను కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీ పనులు నాణ్యతతో చేపట్టిన క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో పూర్తయిన మరుగుదొడ్ల నిర్మాణాలకు ఎఫ్‌టిఒలు చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా పెంచే నర్సరీలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పర్యవేక్షించాలని ఒఎస్‌డిలకు సూచిస్తూ ప్రతి నర్సరీలో మొక్కలను సంరక్షించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున ముందుగానే కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని తాగు నీటి ఎద్దడి కలుగకుండా చూడాలని ఆర్‌డబ్లూఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని, పశువులకు నీటి తొట్టెలను నిర్మించి అందులో నీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పన్నుల వసూలు గురించి మండలాల వారీగా సమీక్షించి మార్చి 31 నాటికి వంద శాతం పన్నుల వసూలు చేసే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల గురించి శాఖల వారీగా సమీక్షించి నియమాకాలు త్వరగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి స్థల సేకరణ పనులు మందకొండిగా సాగుతున్నాయని ఈ విషయంలో అందరు శ్రద్ధ వహించాలని జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే నాలుగు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయితీ, అంగన్‌వాడీ భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఒఎస్‌డిలను ఆదేశించారు.