రంగారెడ్డి

ఆస్తిపన్ను బకాయిలను వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 19: మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలో ప్రజలు ఆస్తిపన్నులను వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కమిషనర్ కె.రామిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. డైరెక్టర్ మున్సిపల్‌శాఖ సంచాలకులు హేమలత నగర పంచాయతీ ఆస్తిపన్నుల వసూళ్ల తీరుతెన్నులపై సమీక్షించడానికి నియమించడంతో ఆమె శనివారం కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో ఆస్తిపన్ను బకాయిల వసూలుపై సమీక్ష జరిపారు. ఆస్తిపన్నుల వసూళ్లు శీఘ్రంగా చేపట్టాలని నగర పంచాయతీ మనుగడ దానిపైనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మరువరాదని ఆమె సూచించారని కమిషనర్ తెలిపారు. ఆస్తిపన్నుల వసూలు అంతా ఆశాజనకంగా లేదని దీనిని అధికారులు అంకితభావంతో మరింత వేగవంతంగా చేపట్టాలని ఆమె పేర్కొన్నారని వివరించారు. వంద శాతం ఆస్తిపన్నులను అధికారులు విధిగా వసూలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మొండి బకాయిదారులపై వత్తిడి తేవాలని పట్టించుకోని పక్షంలో అలర్ట్ నోటీసు జారీచేసి వారి స్థిరచరాస్థులను జప్తు చేయాలని ఆదేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు తమ ఆస్తిపన్నులను సకాలంలో చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాల్లో రుణాలు పొందాలంటే చేతులు తడపాల్సిందే
వికారాబాద్, మార్చి 19: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వ్యాపారం చేసుకునేందుకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న కోట్లాది రూపాయలు అర్హులకందడం లేదు. దరఖాస్తు చేసుకున్నది మొదలు రుణం చేతికందే వరకు జేబులో డబ్బులు పెట్టుకుని పంచాల్సిన పరిస్థితి లబ్ధిదారుడిది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్‌లలో రుణం పొందాలంటే దళారీలను ఆశ్రయించాల్సిందే. వారిని ఆశ్రయిస్తేనే రుణం చేతికందుతుందనే వాదన రుణం ఆశించే వారిలో బలంగా పాతుకుపోయింది. అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఉమ్మడి లబ్దిదారుల ఎంపిక గ్రామ సభలు, లక్ష్యాన్ని పూర్తి చేయాలని బ్యాంకర్ల సమావేశాలు మొక్కుబడిగానే సాగుతున్నాయి. దళారీలను ఆశ్రయించకపోతే రుణం దొరకదన్నంతగా సంబంధిత శాఖల అధికారులు, ఇటు రుణం ఇచ్చే బ్యాంకు అధికారులు చెప్పులరిగేలా తిప్పుతారని రుణం కోసం ప్రయత్నించి విసిగి వేసారిన వారి అనుభవాలు కోకొల్లలు. ఉపాధి కోసం రుణం తప్పనిసరి అనుకునే వారు అప్పు చేసి దళారీలను ఆశ్రయించి రుణం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారుడికి దళారీల బాధ తప్పాలంటే ప్రభుత్వం నిఘా ఉంచాల్సిన అవసరముంది. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, బహిరంగపర్చాల్సిన అవసరముందని అపుడే అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు.