అంతర్జాతీయం

మోదీ, ఒబామా కీలక భేటీకి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 25: వాతావరణ మార్పులపై వచ్చేవారం పారిస్‌లో జరగనున్న శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అమెరికా కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసింది. పారిస్ సమావేశంలో పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోదీ ఈ నెల 30న అమెరికా అధ్యక్షుడితో సమవేశమవుతారు. అలాగే చైనా అధ్యక్షుడు జి జింపింగ్‌తో ఒబామా భేటీ అవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులకు సంబంధించి రెండు దేశాలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని అమెరికా భావిస్తున్నట్టు జాతీయ భద్రత ఉప సలహాదారు బెన్ రోడ్స్ వెల్లడించారు. ఈ సమావేశంలోనే ఓ పటిష్టమైన అంతర్జాతీయ ఒప్పందం చేసుకుంటారని కూడా ఆయన తెలిపారు. ‘ప్రపంచానికే పెను సవాల్‌గా మారిన వాతావరణ మార్పు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై శిఖరాగ్ర సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు’ అని రోడ్స్ చెప్పారు. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా ఇరువురు దేశాధినేతలు చర్చించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే ఐరాస భద్రతామండలి సమావేశం నిమిత్తం న్యూయార్క్ వచ్చిన మోదీతో ఒబామా అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారని ఆయన అన్నారు. పారిస్ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావాలని అమెరికా ఆకాంక్షిస్తోందని, ఇందులో భాగంగానే చైనా, భారత్ సహకారం కోరుతున్నట్టు రోడ్స్ స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పటిష్టమైన కార్యాచరణ పారిస్ సమావేశాల్లో రూపొందించాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు.