అంతర్జాతీయం

బ్రిటన్‌కు రావద్దంటూ సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ ఆన్‌లైన్ పిటిషన్‌పై పది లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ఒక పిటిషన్‌పై పదిలక్షల సంతకాలు దాటితే దానిపై బ్రిటిష్ పార్లమెంట్ తప్పనిసరిగా చర్చ జరపాల్సి ఉంటుంది. శనివారం ట్రంప్ వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులు జారీచేసిన 48గంటల్లోనే ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. ఈ పిటిషన్‌పై హౌస్ ఆఫ్ కామన్స్ మంగళవారం చర్చిస్తుంది. ‘డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రభుత్వాధినేతగా ఇక్కడ పర్యటించవచ్చు. కానీ, యుకె ప్రభుత్వం ఆయన్ను అధికారికంగా పర్యటించాలని ఆహ్వానించరాదు. ఇది గౌరవనీయురాలైన రాణివారికి అవమానం అవుతుంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాణి కానీ, యువరాజు కానీ స్వయంగా స్వాగతించటానికి డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి అర్హతలు లేవని స్పష్టం చేసింది. గత వారం బ్రిటన్ ప్రధాని థెరిసా మే అమెరికాలో పర్యటించినప్పుడు రాణి ఎలిజబెత్-2 పక్షాన ట్రంప్‌కు బ్రిటన్ రావలసిందిగా ఆహ్వాన పత్రాన్ని అందజేసి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ బ్రిటన్ ప్రజలు సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు.