భక్తి కథలు

జైమిని భారతం - 105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనసూయా అరుంధతీ వంటి పతివ్రతామణులు ధర్మరాజుకు హారతి పట్టి ఆశీర్వదించేరు.
ధర్మరాజు బకదాల్భ్యునికి రత్నమయమైన వృషభాన్ని దానమిచ్చి, ఆచార్యుడైన వేదవ్యాసునికి సమస్త భూమండలాన్నీ దక్షిణగా సమర్పించేడు. వ్యాసుడు ఆ దక్షిణను తిరిగి ధర్మరాజుకు అమ్మి వచ్చిన ధనాన్ని దీనులకు పంచి పెట్టించేడు. ఒక్కొక్క ఋత్విక్కునకు నాలుగు గుఱ్ఱాలతో ఉన్న రథం, రత్నరాశి, పదివేల గోవులు, నాలుగు మానల ముత్యాలూ దానమిచ్చి- సేవకులకు ప్రతిహారులకు నూత్న వస్త్రాలతోపాటు ఋత్విక్కులకిచ్చిన సంపదలో సగభాగం కానుకలిచ్చేడు. వచ్చిన దేశాధినేతలకు ఆభరణాలూ, మదగజాలూ, జాతి అయిన అశ్వబలాన్నీ బహూకరించేడు. యాదవ వీరులకు అపార ధనాన్ని ఆదరంతో సమర్పించి- రుక్మిణీ సత్యభామాది కృష్ణ కులాంగనలకు మణిమాణిక్య ఖచిత ఆభరణాదికాలను ద్రౌపదిచే ఇప్పించేడు ధర్మసుతుడు.
శ్రీకృష్ణదేవుణ్ణి ద్రౌపదీ ధర్మరాజులు సాదరంగా వేదికపైకి తోడ్కొని వెళ్లి సోదరులు చేతులు కట్టుకొని వినయంగా వెంట రాగా బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి విధి విధానంగా అర్చించేడు- ధర్మజుడు.
‘ఏతత్ క్రతుఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు’ అంటూ అశ్వమేధయాగ ఫలాన్ని శ్రీకృష్ణుని చేతిలో ధారపోసేడు. చెమర్చిన కన్నులతో భక్తిపూర్వకంగా ధర్మజుడు చిరునవ్వుల స్వామికి సాష్టాంగ ప్రణామం చేసేడు.
పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. తరువాత భీమసేసనుడు వేదికపై నిలిచి అందరికీ విందు సిద్ధంగా ఉందనీ, తన హస్త పాక చాతుర్యం రుచి చూసి వెళ్లవలసిందేనని ప్రకటించేడు. రాజలోకానికీ, మునికోటికీ, సమస్త ప్రజాబంధు సేవక వర్గాలకూ అందరికీ విందు.
రకరకాల పిండి వంటలు! వాటి ఆకారాలూ విచిత్రమే. పూదండల్లా, వెనె్నల్లా, తామరతూడుల్లా, పద్మకేసరాల్లా, నక్షత్రాల్లా, పూలగుత్తుల్లా, మణుల రాశుల్లా- అనేక ఆకారాలతో వివిధ సుగంధాలతో కనువిందు చేస్తున్నాయి గోధుమ పిండితో చేసిన భక్ష్యాలు!
భీముని ఆజ్ఞతో నిముషంలో భోజనశాల సర్వసంపన్నం అయిపోయింది. ఋషులకు, రాజలోకానికీ రత్న మండపంలో అగరు పరిమళ భరితమైన శీతల వాయు తరంగాలు మందమందంగా వీస్తుండగా వడ్డనలు జరిగేయి.
- ఇంకా ఉంది

- బులుసు వేంకటేశ్వర్లు