అంతర్జాతీయం

రుణఎగవేతదార్లను నిద్రపోనివ్వను : జైట్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో:బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలను ఎవరినీ వదిలిపెట్టమని, వారిని నిద్రపోనివ్వమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హెచ్చరించారు. జపాన్‌లో ఐదురోజుల పర్యటనలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌కు భారీగా పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఉద్దేశించి ఆయన జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెట్టుబడులకు భారత్‌లో ఉన్న మంచి అవకాశాలను ఆయన వివరిస్తూ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. భారత్‌లో ఎస్‌బిఐవంటి బ్యాంకులు అప్పులిచ్చినా లాభాల్లో ఉన్నాయని, కొన్ని బ్యాంకులు మాత్రం నిర్వహణ లోపంతో నష్టాల్లో చిక్కుకుంటున్నాయని ఆయన అన్నారు. అయినా బ్యాంకులకు అండగా ప్రభుత్వం ఉంటుందని, రుణఎగవేతదార్లనుంచి ముక్కుపిండి వసూలు చేసి బ్యాంకులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.