డైలీ సీరియల్

ఎప్పుడెప్పుడు -- 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సారీనే.. ఏదో కొత్తగా పెళ్లయింది. ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం చేసుకుంటుంది అని క్షమించేయవే..’’ పావని గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతున్నట్టు అంది.
‘‘ఓకెనే.. ఏం చేస్తాం..’’ అంది సన్నజాజుల మాలను నిశ్చల జడలో తురుముతూ.
‘‘మీ ఆయన కిరణ్ ఏం చేస్తున్నాడే..’’ అడిగింది ఓరగా పావని వైపు చూస్తూ..
‘‘మీ ఆయనకు పంచె కడుతున్నాడు.. ఓ పని చేస్తాను.. కట్టినంతవరకు కట్టింది చాలు.. మిగతాది వాళ్ళావిడ కట్టుకుంటుంది.. రమ్మని చెబుతాను..’’ అంది మొబైల్ చేతిలో తీసుకుని.
‘‘అబ్బ అలా వద్దులే.. బావోదేమో..’’ అంది.
అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కిరణ్ బయటకు వచ్చాడు.
‘‘అబ్బబ్బ వాడికి పంచె కట్టేసరికి నా చొక్కా తడిసిపోయింది.. అయినా ఈ పంచెలు ఎవరు కనిపెట్టారో.. శుభ్రంగా అరవ లుంగీ కట్టుకుంటే రొంబ సుఖం’’ అన్నాడు కిరణ్.
‘‘మీ ఫ్రెండ్ ఏది కట్టుకున్నా బాగానే ఉంటాడు.. ఇంకేంటి కిరణ్ సంగతులు...’’ అడిగింది కిరణ్ వంక చూస్తూ...
వెంటనే అమాయకంగా కిరణ్.. ‘‘సంగతులంటే గుర్తొచ్చింది.. మీ బామ్మా..’’ అంటూ ఏదో చెప్పబోయాడు.
‘‘చాల్చాలు.. అది ఇంకేంటి సంగతులంటే.. తొందరగా దయచేయమని.. మీకు హిందీనే కాదు.. తెలుగు కూడా అర్థమైచావదు’’ అంది పావని.
‘‘ముందు నువ్వు అర్థమైతే కదా’’ మనసులోనే అనుకున్నాడు కిరణ్.
సరిగా అరగంట తర్వాత పావని కిరణ్ ఇంటికి వెళ్లడానికి లేచారు.
పావని నిశ్చలను దగ్గరికి పిలిచి ‘ఆల్ ది బెస్ట్ నిశ్చలా.. భర్తను మొదటి రాత్రే గ్రిప్‌లో పెట్టుకోవాలి.. అలా కాదని నెత్తిమీద పెట్టుకుంటే ఏదో ఒక రోజు పాతాళంలోకి తొక్కేస్తారు మొగుళ్ళు..’’ అంది.
కిరణ్ ఆ మాటలు విననే విన్నాడు.
‘‘నిశ్చలా.. భర్తను పెట్టుకోవాలిసింది గ్రిప్‌లో కాదు.. గుండెల్లో.. ఇగోలు పక్కన పెట్టండి.. భర్తలను సాధించే భార్యల లిస్టులో నువ్వు చేరొద్దు.. ఆల్ ది బెస్ట్.. నీకూ నిహార్‌కు.. ఆల్రెడీ వాడికి చెప్పాను.. ఇప్పుడు ఇద్దరికీ కలిపి..’’ చెప్పాడు కిరణ్.
పావని కోపంగా కిరణ్ వంక చూసింది.
మొదటిరాత్రి తాలూకూ ఆలోచనలో వున్న నిశ్చలా ఈ విషయాన్నీ నోటీస్ చేస్తే కథ మొదటిరాత్రే మరో మలుపు తిరిగేది.
ఇద్దరూ వెళ్లిపోయారు..
ఆ ఇంట్లో వారిద్దరే మిగిలారు..
నిశ్చల నిహార్...
వాళ్ళకోసం ఎదురుచూసే పడగ్గది...
***
వైవాహిక జీవితానికి శుభారంభం
రెండు దేహాలే కాదు రెండు మనసులూ ఒక్కటై.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక వేదిక, దేహాలు వేరైనా మనసులు ఒక్కటే అన్న సూత్రాన్ని, మంగళసూత్రంతో ముడిపెట్టి, సప్తపదిని ఇష్టపదిగా మార్చుకోమని చెప్పే తొలి రాత్రి దంపతుల సమాగమానికి సుముహూర్తం.
***
నిహార్ టెన్స్‌గా వున్నాడు. అతనికి కొత్తగా వుంది. సినిమాల్లో చూడ్డం, కథల్లో చదవడం మినహా అతనికి ఎలాంటి ఐడియా లేదు. ఫ్రెండ్స్ ఫస్ట్‌నైట్ గురించి చర్చించినా అక్కడినుంచి తప్పుకునేవాడు. తానిప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? తన రియాక్షన్‌ను నిశ్చల ఎలా రిసీవ్ చేసుకుంటుంది?
కొన్నాళ్ల క్రితం అతనికి తాను చదివిన కథ గుర్తొచ్చింది. పెళ్లిముందే అమ్మాయి అబ్బాయి అన్ని విషయాలను మనసు విప్పి మాట్లాడుకోవాలి. రొమాంటిక్ లైఫ్‌తో సహా.
చదివినప్పుడు ఒకలా అనిపించినా ఆలోచిస్తుంటే నిజమే కదా అనిపిస్తుంది.
అతని ఆలోచనలను డిస్ట్రబ్ చేస్తూ, ఇష్టంగా ఆ గదిలోకి అడుగుల శబ్దం వినిపించింది. ఆ శబ్దం తన చెవులకు సోకినట్టు కాకుండా, తన మనసుమీద ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపించింది.
మెల్లిగా తలెత్తి చూసాడు.. తలొంచుకుని ఒక్కో అడుగు వేస్తోన్న నిశ్చల.. నడిచివస్తోన్న సౌందర్యంలా వుంది. తెల్లటి పాదాలు.. వాటికీ పారణి.. తెల్లగా మెరిసే మెట్టెలు.. వాటికి జోడీగా పట్టీలు.. తెల్లటి చీరెలో, జడలో సన్నజాజులతో.. మెడలో పసుపుతాడుతో.. తన వైపునకు వస్తుంటే అతని గుండె వేగం రెట్టింపు అయ్యింది.
ఈ నడిచొచ్చే అందం తన స్వంతమా?
ఒక్క క్షణం అతని గుండెలయ అతని శరీరాన్ని శృతిమీటింది.
కొద్దిగా మెల్లిగా తలెత్తి చూసింది నిశ్చల. ఎప్పుడెప్పుడు అతగాడిని తాను మనువాడినవాడిని తనవితీరా చూద్దామా? అని వుంది. కానీ మొదటిరాత్రి తాను ఓపెన్‌గా వుంటే మొగుడనే జీవుడు కంగారుపడతాడని తమాయించుకుంది.
తలెత్తి భార్య కళ్ళల్లోకి చూడాలా? వద్దా? అన్న డైలమాలో వున్న నిహార్ క్రీగంట చూసాడు. ఆమె శరీరం తాలూకు ఫ్లేవర్ అతడిని వివశత్వంలోకి నెట్టేస్తుంది.
కొద్దిక్షణాలు ఇద్దరిమధ్య వౌనం. వౌనాన్ని ఛేదించే స్పర్శ అక్కడ ఊపిరిపోసుకుంది. మెల్లిగా కిందికి వంగి తన చేతులను అతని పాదాలమీద పెట్టింది.
చిన్నపాటి గగుర్పాటు.. అది ఉద్వేగంతో కలిగింది.
అప్రయత్నంగా అతని చేతులు ఆమె రెండు భుజాలను పట్టుకున్నాయి.
ఒక్క క్షణం.. కాదు కాదు క్షణంలో వెయ్యోవంతు ఆమె శరీరం కంపించింది. వేనవేల ప్రకంపనలు ట్రాన్స్‌మిట్ చేస్తూ..
ఆమె అలాగే లేచి తన తలను అతని గుండెలమీద సేద తీర్చింది.
ఆమెను అలాగే పొదవిపట్టుకుని మంచంమీద కూచోబెట్టాడు.
***
దంపతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసే తొలిరాత్రి.
ఇద్దరిమధ్య దూరాన్ని, మనసుల మధ్య అనురాగాన్ని, శరీరాలమధ్య అనుబంధాన్ని శారీరక సంబంధంతో ముడివేసే మూడు రాత్రుల్లోని మొదటి రాత్రి..
భార్యాభర్తలమధ్య అనుబంధం ఇంత గొప్పగా వుంటుందా?
రెండు శరీరాల మధ్య కెమిస్ట్రీ మిస్టరీ ఇంత అద్భుతంగా వుంటుందా?
మరి కిరణ్ అలా ఎందుకు చెప్పాడు?
అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ...
***
‘‘ఏమండీ..’’ పిలిచింది అతని గుండెలమీద తలపెట్టి అతని వైపు చూస్తూ నిశ్చల.
‘‘చెప్పు నిశ్చల.. నువ్వు మాట్లాడితే వినాలని వుంది. ఇప్పటివరకు నీ స్పర్శ మాట్లాడింది.. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వినాలని వుంది’’ అన్నాడు నిహార్.
‘‘ఇది కలా? నిజమా?’’ అనిపిస్తుంది.
‘‘కలలాంటి నిజం.. నిజమైన కల..’’ ఆమె వీపు చుట్టూ చేయి వేసి అన్నాడు.
‘‘ఈ కల ఇలానే నిజంగా ఉండాలి...’’
‘‘మన కల మన జీవితం.. కలకాలం కల నిజమై మనతోపాటు ప్రయాణిస్తూ, కలల్ని కంటూ ఉంటుంది. వాటిని మనం నిజం చేసుకుంటూ ఉంటాం’’ మనస్ఫూర్తిగా అన్నాడు నిహార్.
‘‘మనమధ్య ఎటువంటి అపోహలు అపార్థాలు రాకూడదు.. మన మధ్య గొడవలు ఉండకూడదు. అలకలు, అహాలు మనిద్దరిని వేరు చేయకూడదు.. అసలు మనం పోట్లాడుకోకూడదు’’ చిన్నపిల్లలా అంది అతని పెదవులమీద చూపుడు వేలితో సంతకం చేస్తూ..
‘‘చిత్తం’’ అన్నాడు చిన్నగా నవ్వి నిహార్.
‘‘అదేంటి తథాస్తు అనాలి కదా.. మనం మాట్లాడుతుంటే తథాస్తు దేవతలు తథాస్తు అంటారట?’’ అమాయకంగా చెప్పింది నిశ్చల.
‘‘తథాస్తు దేవతలు ఎప్పుడుపడితే అప్పుడు ఆకాశంలో జర్నీ చేయరు.. తెల్లవారు జామున శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారట.. ఆ టైంలో మనం మాట్లాడుకునే మంచి మాటలు మెచ్చి తథాస్తు అంటారుట..’’ అన్నాడు.
‘‘ఈ విషయం మీకెవరు చెప్పారుట.. పోనీ అప్పటివరకూ మెలుకువగా వుండి మాట్లాడుకుందామా?’’
-సశేషం

-తేజారాణి తిరునగరి