పఠనీయం

చరిత్ర పాఠాలు విస్మరిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర పాఠాలను విస్మరిస్తే
మూలం:వి.డి.సావర్కార్
తెలుగు అనువాదం:
కె.శ్యాంప్రకాశ్,
వెల:రూ.60/-
ప్రతులకు:మేనేజర్, సాహిత్య నికేతన్, 3-4-852,
కేశవ నిలయం,
హైదరాబాద్- 500 027 (తెలంగాణా రాష్ట్రం)
ఫోన్:27563236

భారత స్వాతంత్ర సంగ్రామంలో స్వతంత్ర వీర సావర్కార్ చేసిన సేవ అజరామరమయినది. హిందూత్వానికి ఆయన పర్యాయపదం. సాహసానికి ప్రతిరూపం. సింహానికి మరో పేరు సావర్కార్. ఆయన దేశభక్తుడు- త్యాగధనుడు. సాహిత్య నిర్మాత. 1857 స్వర్ణపత్రములు వంటి రచనలు చేశారు. సమాజ సంస్కరణోద్యమాలలో పాల్గొన్నారు. ‘హిందూ మహాసభ’ అనే పక్షాన్ని స్థాపించారు. సావర్కార్ రచనలు వివిధ భారతీయ భాషలలోనికి అనువదింపబడ్డాయి. ఇటీవల కె.శ్యాంప్రకాశ్‌గారు సావర్కార్‌గారి స్వర్ణ పత్రములు అనే ఆంగ్ల గ్రంథం నుండి కొన్ని అధ్యాయాలు అనువదింపగా నవభారతి ప్రచురణలు దానిని ప్రచురించారు.
ఇది స్వతంత్ర వీర దామోదర వినాయక సావర్కర్ రచించిన ‘్భరతీయ ఇతిహాసంలో ఆరు స్వర్ణపత్రాలు’ అనే గ్రంథంలో 5వ స్వర్ణపత్రంలోని మొదటి భాగానికి తెలుగులో సంక్షిప్త అనువాదం. దీనికి ‘చరిత్ర పాఠాలను విస్మరిస్తే భవిష్యత్తు ఎలా వుంటుంది?’ అని శీర్షిక పెట్టారు. భారతదేశంపై జరుగుతున్న ద్విముఖమయిన దండయాత్రలకు హిందువుల ప్రతిఘటన అనే అంశంలో పుస్తకం ప్రారంభమయింది. భారతదేశంమీదికి గత రెండు వేల సంవత్సరాలుగా దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. అరబ్బులలు మొగలులు ఆంగ్లేయులు ఫ్రెంచివారు ఇండియాను పరిపాలించారు. ప్రపంచంలో ఏ దేశమూ ఇన్ని వేల సంవత్సరాల బానిసతనంలో ఉండలేదు. ఇదెలా సాధ్యమయింది?
సావర్కార్ ఈ గ్రంథంలో కొన్ని నూతనాంశములను ప్రతిపాదించారు. అందులో హిందువుల పరాజయానికి ‘సద్గుణ వికృతి’ అనే అంశం ఎత్తిచూపారు. శరణుకోరినవారిని రక్షించాలి. ఈ శరణాగత రక్షణము, సహిష్ణుత- సద్గుణ వికృతి అని సావర్కార్ విశే్లషించారు. గజినీ భారతదేశంమీదికి పదిహేడుసార్లు ఎలా దండయాత్ర చేయగలిగాడు? చేతికి దొరికిన శత్రువును హిందువులు క్షమించి వదిలివేశారు. ఫలితంగా జాతి పరాధీనమయిందని సావర్కార్ ఈ అధ్యాయంలో వివరించారు. హిందువులను బలవంతంగా అన్యమతాలలలోనికి మార్చారు. వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూ ధర్మంలో కలుపుకోవాలనే ఆలోచన నాటి రాజులకు శంకరపీఠాలకు రాలేదు. హైందవ పతనానికి ఇది మరొక కారణం అని సావర్కార్ విశే్లషించారు. 2050 నాటికి ఇండియా ముస్లిం మెజారిటీ దేశంగా మారబోతున్నదని విశే్లషకులు భావిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నవభారతి వారు ఈ గ్రంథాన్ని ప్రచురించి జాతికి మహోపకారాన్ని చేశారు. సావర్కార్ జాగృత శంఖారావం అందరూ వినవలసిందే. కె.శ్యాంప్రసాద్‌గారి శైలి అత్యంత సరళ సుందరంగా హృదయానికి హత్తుకునేదిగా ఉంది. త్వరలో స్వర్ణపత్రములలోని ఇతర భాగాలు కూడా తెలుగు పాఠకులకు అంఅదజేస్తారని ఆశిద్దాం. రచయిత ప్రచురణకర్తలు అభినందనీయులు.

ప్రొ.ముదిగొండ శివప్రసాద్