పఠనీయం

మానవ సంబంధాల చిక్కుముడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కన్నపేట రైల్వేస్టేషన్ కథలు
- డా. ఎం.ఎం. అయోధ్యారెడ్డి
వెల : రూ.150/-లు
ప్రతులకు
రచయిత
9399962117
*
ఒక కథకు సంబంధించిన మూల పదార్థం. మేధలో ప్రవేశించగానే అది పురుగై తొలుస్తుంది. నిరంతర ధ్యాస, ధ్యానంతో రాయకుండా ఉండలేని పరిస్థితికి చేరుకుంటాడు ఆ రచయిత. కాగితం మీదకు దించగానే ఉపశమనస్థితికి చేరుకుని మెరుగులు దిద్దటానికి ఉపక్రమిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబుకు అవతలి వేపు ఉన్నా అమెరికన్ రచయిత్రి మాయాజిలోన్ కావొచ్చు. ఇవతలి వేపున ఉన్న తెలుగు కథా రచయిత డా. ఎ.ఎమ్. అయోధ్యారెడ్డి కావొచ్చు, అందరిదీ ఒకే మాట ఒకే బాట.
వీరు అనుభవాలకు, ఆలోచనల్ని జోడిస్తూ, మెరుగులు పెడుతూ, కథా శిల్పాలను స్పృశిస్తూ ఒక్కోసారి ఆంగ్ల, హిందీ కథలను అనువదిస్తూ తన మేధకు వీరు పదును పెట్టుకుంటున్నారు. గొప్పకథకుడు. కనుక అవార్డులు, రివార్డులు వీరిని వరించటం సహజం. జీవితాలకు సరంగులూ అద్దకుండా సహజంగా చెప్పగలగటం బహుశా వీరి 33 ఏళ్ల పాత్రికేయ ఉద్యోగం నుంచి నేర్చుకున్నారనిపిస్తుంది. ప్రస్తుతం కథాసంకలనం ‘అక్కన్న పేట రైల్వేస్టేషన్’ లో 14 కథలున్నాయి. ఇవి 1990 నుండి నేటి వరకు రాసిన కథల్లో మేటి కథలు- పలుపత్రికలు ప్రశంసించి, అచ్చువేసుకున్నా కథలు, నేటి సమాజంలో అమానవీయత కఠినత్వం, కాపట్యం ప్రతిబింబించే కథలు.
అన్నీ వాళ్లే అని అనుకుని అన్నింటినీ వాళ్లకోసం త్యాగం చేసిన నల్లగొండ దగ్గరి పల్లెటూరు లో ఉండే దంపతులు. నిరాశ్రయులయ్యారు. వాళ్లింట్లో వాళ్లే పరామిలై కొడుకుల చేత బయటకు తరమబడ్డారు. నిరాశ్రయులైన వారికి నగరం ఫ్లీమినర్ ఆశ్రయం ఇచ్చింది. దయతలచి నగరవాసులు విదిల్చే నాలుగు డబ్బులతో కడుపునింపుకుంటున్నారు. ముసిల్ది జబ్బు పడి మరణిస్తే కొడుక్కు తెలపాలని అనుకున్నాడు. కారణం తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ముసలివాసన భరించలేడు. కానీ మనిషే పోయినంక చెత్తను ఇసిరేసేటందుకో .. బూడిద చేసేటందుకో రాకపోతడా...?అన్న పేగు బంధపుఆలోచన ఆ తండ్రిది. వడిసెలలోంచి దూసుకువచ్చిన గులకరాయిలా .. పాఠకులు ఆచేతనులవటం ఖాయం. (చావువాసన) కొడుకు వెంకటేష్‌ను ప్రమాదం నుంచి రక్షించబోయినంతన ప్రాణాల్నే పొగొట్టుకుంది. తల్లి, భార్య మరణం తట్టుకోలేక పశువై పోయాడా తండ్రి. బలిపశువై పోయాడా పదేళ్ల వెంకటేష్. తండ్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడు సరికదా. తాగిన మైకంలో మానవత్వం మరిచి కొడుకును క్రూరంగా శిక్షిస్తుంటాడు. తెలిసీ లేత మనసు గాయపడి ప్రాణత్యాగానికి పూనుకుని అక్కన్న పేట రైల్వేస్టేషన్ కు చేరుకుంటాడు వెంకటేష్ కొడుకును కోల్పోయి అనాధగా ఆ రైల్వేస్టేషన్ లోనే బ్రతుకుతున్న ఓ తల్లి కంటబఢుతాడు. ప్రేమరాహిత్యపు వారి బ్రతుకుల్లో ఒకరికొకరు దగ్గరవుతారు. ఆమెలో అమ్మను చూసిన వెంకటేష్ కు ఆమె దేవతలా కనిపించటం.. ఏమాతం అసంబద్ధంకాదు. పేగు తెంచుకుని పుట్టబోయేది ఆడపిల్ల. ఇంకా భూమీద పడకముందే ఆడపిల్ల కనుక ‘విచ్ఛిత్తి’ అయిపోయింది దేవుడు కరుణించి ఆపాపు మరోసారి అమ్మను చూసుకునే అవకాశం ఇచ్చి భూమీదకు పంపిస్తాడు. తల్లి సావిత్రి పైకి కాఠిన్యం చూపినామెలో అడవులు కాలిపోతున్న వేదన, ఘర్షణ, కడుపులో కదుల్తోన్న మరో ఆడపిల్ల రోదన. ఆ తల్లీ పిల్లల జీవితం అంతం కావటమే తప్ప మరో మార్గం లేకపోయిందని రచయిత అనుకున్నాడేమో.. (పేగుముడి) మనుషులు పైకి కనిపించేవారే కాదు. వారిలో వారు అంతర్గతం గా ఎంతో భిన్నంగా ఉంటారు. రచయిత్రి స్వర్గీయ తెనే్నటి హేమలత గారన్నట్లు ‘బాహ్యము, అంతరంగం లైలు పట్టాల వంటివి. అవి కలుసుకోవడం అరుదు’ పొరుగింటి ఆంజనేయులు భార్య సరస్వతుల జీవితాలు అంతే! బయటకు అన్యోన్యత కనిపించినా , నిజానికి ఆంజనేయులు ‘మంచిమొగుడు’ కాదు. కిరాతకుడు. శాడిస్టు! ‘రెప్పచాటు కన్నీరు’ చుక్క రెప్ప దాటి జారితేనే కదా తెలిసేది. ఈ ప్రపంచమూ అంతేనంటారు అయోధ్యారెడ్డిగారు. కథ, కథను మించిన కథనం .. చాలా కథల్లో కధనమే ఓవర్‌టేక్ చేసింది. తాడిత పీడిత సామాన్య ప్రజల్లోంచి ఏరుకున్నా కథలను తన వర్ణనాశక్తితో, సానపెట్టి రాయిని రత్నంగామలిచిన ప్రతిభ ప్రతి కథలోనూ అడుగడుగునా కనిపిస్తాయి కథల్లో. (ఆమె) నిద్రిస్తున్నా హృదయం ఊపిరి పట్టి ఏడుస్తున్నట్టుగనే ఉన్నదట. (పేరు) ఈరైలు పట్టాల సంభాషణ గమనిద్దాం.
‘‘డబ్బుంటే అన్నీ ఉన్నట్టే మాదిగా! ఒక్కరూపాయి సూత జారిపోనివ్వకు డబ్బుంటే సుఖమొస్తది. అదికారమొస్తది. డబ్బు మహాశక్తి’’
‘‘ఆ నాబొందస్తది... డబ్బుకోసం ఆరాటపడితే అన్నీ బాధలే.. డబ్బుకు అసలు ప్రాముఖ్యతే ఇవ్వొద్దు’’
‘‘ఏహే .. గీ వేదాంతాల కేంది.. ఉన్నా కొద్దికాలం భాగ అనుభవించాలె (ఇడ్లీపొట్లం పే.76) ‘‘ఏకక్య్రి ద్వర్తకరీ’’ రెండుపార్శ్వాలు.
చివరకు రచయితే ఆకలి అన్నింటినీ జయించినట్లు వ్యక్తపరుస్తాడు.
అయోధ్యారెడ్డి కథల్లో సమాజం ఉంది. వ్యక్తులున్నారు. వారు వివిధ సందర్భాలల్లో వైవిధ్యంగా ప్రవర్తిస్తారు. ప్రపంచం ఈకథల్లో ప్రతిబింబిస్తుంది. చావు వాసన, పేగు ముడి, వీటిని పరిశీలించినా ఇడ్లపొట్లాన్ని విప్పినా, వెంటాడిన రాత్రిలోని లేచి వచ్చి ఆజంను గమనించినా, విశదమయ్యేది ఒక్కటే అదే మానవ సంబంధాలు ఒక్కో చోట వాటిని శాసించే చిక్కుముడుల ఆర్థిక సంబంధాలు.

- కూర చిదంబరం , 8639338675