వినమరుగైన

బసవరాజు అప్పారావు గేయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసవరాజు అప్పారావు గేయాలుఆయన జీవితానికి రచనల క్రమానికి రుజువులు కనపడితే ఎంత బాగుండును? రచనలచ్చైన క్రమానికీ రచించిన క్రమానికీ సంబంధం ఉందనుకోవాలా అలా వీలు కనపడదు.
పాపాయిలో పరమాత్ముణ్ణి సాక్షాత్కారం పొందిన అప్పారావుగారు వటపత్రసాయిని తాను చూచి మనందరికీ ప్రత్యక్షంగా చూపించారు.
అప్పారావుగారి గీతాలన్నింటినీ సాక్షాత్కారం పొందిన అప్పారావుగారు వటపత్రసాయిని తాను చూచి మనందరికీ ప్రత్యక్షంగా చూపించారు.
అప్పారావుగారి గీతాలన్నింటినీ ఒక్కొక్కటిగా క్లాసులో పాఠం చెప్పినట్లు చెప్పాలనిపిస్తుంది. నేను చెబితే వినే అంత అమాయకులెవరుంటారు? నాకు నేనే చెప్పుకోవాలి. ఎంతోమంది ఎందరెందరినో ఎంచుకుని సిద్ధాంత గ్రంథాలు రాశారు. అప్పారావుగారిని గురించి ఎవరూ తలచుకున్నట్టు కనపడదు.
ఆయన వలపు ఆయనది. ఆయన వైఫల్యం ఆయనది. ఆయన విలాపం ఆయనది. ఆయన పండిన గుండె ఆయనది. మెచ్చినను, మెచ్చకుండినను ఇది నేను అని చెప్పి వెళ్లిపోయాడాయన. భవభూతి చెప్పినట్టు ఆయనకు సమాన ధర్ములెక్కడో ఏ కొద్దిమందో ఇంత విశాలమైన భూమిలో అంతులేని కాలంలో ఉండే ఉంటారు.
తన విలువ తనకు తెలుసునన్న సంతృప్తి ఆయనకు ఉంది. అందుకే నోట పలికేదంట పాటగా మ్రోగాను
కోటి వరహాకెత్తు కెత్తుగా తూగేను.
అనగలిగారు. అటువంటిది ఆయన ఆత్మప్రత్యయం. ఇంత ధీమగా పలికిన మనిషే కాళిదాసు శాకుంతలారంభంలోని ‘ఆ పరితోషాద్విదుషామ్’ అనే శ్లోకాన్ని అనువరించారు.
పండితులు మెచ్చి ముదమందు వరకు నా ప్ర
యోగ విజ్ఞాన మెంచను యోగ్యమనుచు
బాగుగా శిక్షనొందిన వారికేని
ఆత్మ విషయాన అప్రత్యయమ్మె కాదె
గోపాలకృష్ణయ్య జీవిత చరిత్రే కాక ఆంధ్ర కవిత్వ చరిత్ర రచించారు.
ఈ గ్రంథం పాతూరి నాగభూషణంగారి గ్రంథాలయంలో (పటమటలంక) నేను చూశాను. అప్పారావుగారి జీవిత చరిత్రను ఆయన ధర్మపత్ని కవయిత్రి రాజ్యలక్ష్మమ్మగారు వ్రాశారని విన్నాను. చూడలేదు. సౌదామిని పేరుతో కవితలు వ్రాసి రాజ్యలక్ష్మమ్మ గారు అప్పారావుగారి సాంగత్యంవల్లే కవయిత్రిగా పేరు సంపాదించారనవచ్చేమో.
కయ్యాల విందు, క్రాస్ పరీక్ష, కవరు, ఉత్తుత్తిపెళ్లి హాస్యం కూడా కవిత్వమే అనడానికి నిదర్శనాలు. మధుర మధుయామినీ పీఠమధివసించి అనే పదగుంభనం ఏ భావకవికైనా తీసిపోనిది. అలాగే ప్రళయాంతాభీలనభో దళన ఫళ్ పెళారావముల అనే పంక్తి కూడా ఆయన భాషాపటిమ చాటుతుంది. యశోద విలాపం, వటప్రతశాయి మొదలైనవి ఇంపైన రచనకు మచ్చుతునకలు. ఆయన కోమలంగా కూడా చెప్పి మెప్పించిన కావ్యఖండాలు.
మేలిమి బంగారం వంటి కవితలందించిన ఈ మహానీయుడు జీవితం చివరి దశలో మతిభ్రమణానికి గురి అయ్యాడంటే, అది పొయెటిక్ జస్టిస్ కాబోలు. ఎ ఫొయిట్ ఈజ్ ఎ మాడ్ మాన్.
పాట పాడుతుండగ నా ప్రాణి దాటి యేగేనా?
ప్రాణి దాటి యేగుచుండ పాట నా నోట మ్రోగేనా?
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-సూరంపూడి భాస్కరరావు