భక్తి కథలు

కాశీఖండం 82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రీతిగా పెద్దకాలం రాజ్యం ఏలి, సుతుడి భుజాన రాజ్య భారం మోపి, కాశీకి చని, అయోధ్య, అవంతి, కాంచి, మధుర, ద్వారవతి, ఉజ్జయినీ తీర్థాల సంసేవనంవల్ల విశే్వశ్వరుడి అనుగ్రహంవల్ల మోక్షం పొందుతావు అని పలికి హరి సేవకులు ఆ శివశర్మని దివ్య విమానం నుంచి దింపి, నారాయణుడి ముందట వుంచారు. పుణ్యశ్లోకుడైన విష్ణుశర్మ విష్ణులోకంలో చాలాకాలం సుఖముండి పుణ్యశీల సుశీలురు చెప్పిన ప్రకారం ముక్తిపడశాడు అని లోపాముద్రాదేవికి అగస్త్య మహర్షి శ్రీగిరి సానువున సకల తీర్థాలు కాశీ ప్రాప్తిని పొందించుట ద్వారా దవ్వు నుంచి ఉపకరించేవి అయి మోక్షం ఒసగుతాయి. కాశీ పవిత్ర క్షేత్రం వ్యవధానం లేకుండానే ముక్తిని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని తేటతెల్లం చేశాడు. ఇది శివశర్మ నిర్వాణం అనే ఉపాఖ్యానం. ఈ కథ విన్నా, పఠించినా, వ్రాసినా నరులకి ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి’’ అని పలికాడు.
అనంతరం అగస్త్య మహాముని తన ధర్మపత్ని అయిన లోపాముద్రతో కూడ విశ్వాసం, భక్త్భివం, హితం, శాంతి, దాంతి ఒప్పే రీతిగా మల్లికార్జునస్వామికి ఆవాసం అయిన శ్రీశైల పర్వతానికి ప్రదక్షిణంచేశాడు. ప్రదక్షిణించి కొన్ని పయనాలు సలిపాడు.
అగస్త్యుడు కుమారస్వామిని దర్శించుట
సామిమలకి వెడలి అగస్తి తానూ , సాధ్వియును మహానియమంతో పవిత్ర తపోవాటికా తరుల నడుమ వున్న మణిమందిరంలోని మనోహరమైన బంగారు వనె్న శరీరం కల గజముఖుడి ఆ తమ్ముణ్ణి అమృత మధుర దరహాసంవల్ల నిర్మలములైన కపోలాలు కల చంద్రముఖుణ్ణి పార్వతీదేవి తనయుణ్ణి, సకల దేవతా శరణ్యుణ్ణి ఆశ్రీత జనమనోరథసిద్ధుణ్ణి కుమారస్వామిని భజించాడు’’ అని పురాణించిన సూతుడితో నైమిశారణ్య వాసులు తదుపరి వృత్తాంతం ఏది అని ప్రశ్నించాడు.
కాశీ ఖండంలో చతుర్థాశ్వాసం సమాప్తం

పంచమాశ్వాసము
కుమారాగస్త్య సంవాదము
ఆ కథకుడు శౌనకాది మహామునులతో ఈ గతి పలికాడు.
కుమారస్వామి సతీహితుడైన మహారుషి అగస్త్యుణ్ణి ఆదరించి యోగక్షేమాలు విచారించాడు. పిమ్మట కూర్చుండ నియమించాడు. వచ్చిన కార్యం అడిగి తెలిసికొని వారణాశీ క్షేత్ర మహత్యం వినిపింపదలచి, అగస్త్య మహర్షితో ఈ చందంగా వాకొన్నాడు. నేను ఆరు ముఖాల వాణ్ణి అయినా సకల వేద శాస్త్రానిష్ణాతుణ్ణి అయినా, కడు వైదర్థ్యం (ప్రాగల్భ్యం) కలవాణ్ణి అయి వుండిన్నీ శ్రీ కాశీ క్షేత్ర మహిమను వర్ణించి చెప్ప శక్యుడిని కాలేకపోతున్నాను. అయినప్పటికీ నా నేర్చిన విధంగా కాశీ క్షేత్ర మహత్మ్యాన్ని వినిపిస్తాను. ఎడినెడ అడుగవలసిన అడుగదలచిన విషయాలు అడుగు. కొల్లాపురపు మహాలక్ష్మి పంపగా నువ్వు రావడం ఎరిగున్నాను’’ అని పలికాడు.
అప్పుడు లోపాముద్రాపతి కుమారస్వామికి ప్రణమిల్లి ఈ క్రియ పలికాడు. ‘‘మహాత్మా! షణ్ముఖా! అవిముక్తక్షేత్రం మోక్ష నిలయం అనిన్ని, మణికర్ణికా తీర్థం తీర్థరాజం అనిన్నీ ఆ పుణ్యక్షేత్రం అవిముక్తం, ఆనందకాననం, మహాశ్మశానం, రుద్రవాసం, వారణాసి, కాశి అనే నామధేయాలతో వరలుతుందని చెప్పుతారు. ఈ విషయాలన్నీ నేను తెలుసుకొనగోరుతున్నాను. తేటతెల్లంగా వివరించు’’ అని వేడాడు. అప్పుడు గిరిరాజకుమారీ తనయుడు కుమారస్వామి కలశ సంభవుడితో ఇట్లు వాకొన్నాడు.
‘‘ఓ ఇల్వల సంహారకా! నువ్వు అడిగిన ప్రశ్నయొక్క భావాన్ని వివరించుట మిక్కిలి కష్టం. ఈ విషయమై మా తల్లి పార్వతీ దేవి మా తండ్రి అయిన హరుణ్ణి అడిగింది.

-ఇంకాఉంది